ఉక్కు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర
న్యూఢిల్లీ: కొన్ని రకాల ఉక్కు ఉత్పత్తులకు కేంద్రం శుక్రవారం కనీస దిగుమతి ధర (ఎంఐపీ)ను నిర్ణయించింది. ఈ విలువ వివిధ ఉత్పత్తులకు సంబంధించి టన్నుకు 341 డాలర్ల నుంచి 752 డాలర్ల వరకూ ఉంది. చౌక దిగుమతుల నుంచి దేశీయ పరిశ్రమను రక్షించడంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 173 హెచ్‌ఎస్ కోడ్స్(ప్రొడక్ట్స్)పై ఎంఐపీని విధిస్తున్నట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.ఈ ఎంఐపీ నిబంధనలు ఆరు నెలలు అమల్లో ఉంటాయి. ఎంఐపీ కంటే తక్కువ ధరకు దిగుమతులను అనుమతించడం జరగదు.