MIP
-
పెద్ద ఉక్కు పరిశ్రమలకు షాక్
న్యూఢిల్లీ: పెద్ద ఉక్కు పరిశ్రమలకు కేంద్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. వాటి తీవ్రమైన లాబీయింగ్ ను వ్యతిరేకించిన ప్రభుత్వం స్టీల్ కనీస దిగుమతి ధర(ఎంఐపీ)ను మరో రెండు నెలలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 66 స్టీల్ అంశాలపై కనీస దిగుమతి ధరను డిసెంబర్ 4 వరకు పొడిగిస్తూ భారత ఉక్కు - కామర్స్ మంత్రిత్వ శాఖ నోటిషికేషన్ జారీ చేసింది. దీంతో దేశీ స్టీల్ పరిశ్రమకు విదేశీ చౌక ఉత్పత్తుల నుంచి మరికొంతకాలం ఉపశమనం లభించనుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే చౌక ఉత్పత్తులకు చెక్ పెట్టేందుకు ఈ తాజా నిర్ణయం ఉపకరిస్తుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీనిపై ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సానక్ మిశ్రా హర్షం వ్యక్తం చేశారు. తాము పరిమితిని ఆరు నెలలపాటు పొడిగించాలని కోరినట్టు తెలిపారు. దేశీయ స్టీల్ కంపెనీల కష్టాలు తగ్గడంతోపాటూ, మార్కెట్ మరింత బలోపేతమవుతుందన్నారు. కాగా సుమారు 173 స్టీల్ ప్రొడక్టులకు వర్తించే ఎంఐపీని ప్రభుత్వం తొలుత ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రభుత్వం మరోసారి అక్టోబర్ 4వరకూ గడువును పొడిగించింది. తాజా ఎంఐపీ పొడిగింపు 66 ఉత్పత్తులకు వర్తించనుంది. ఐరన్ లేదా నాన్‌అల్లాయ్ స్టీల్ సెమీ ఫినిష్డ్ ఉత్పత్తులు, విభిన్న ఫ్లాట్ రోల్డ్ ప్రొడక్టుల దిగుమతులపై ఎంఐపీ అమలుకానుంది. -
స్టీల్ దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకం!
♦ ఇది టన్నుకు 557 డాలర్లు వరకు ఉండొచ్చు ♦ ఎంఐపీపై కేంద్ర నిర్ణయం స్టీల్ పరిశ్రమకు కీలకం: ఇక్రా న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశంలోకి దిగుమతయ్యే పలు స్టీల్ ప్రొడక్ట్స్‌పై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించనుంది. ఇది టన్నుకు 557 డాలర్ల వరకు ఉండొచ్చని తె లుస్తోంది. చైనా, జపాన్, కొరియా, రష్యా, బ్రెజిల్, ఇండోనేసియా దేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే అలాయ్/నాన్ అలాయ్ స్టీల్ హాట్ రోల్డ్ ఫ్లాట్ ప్రొడక్ట్స్ ధరలు సాధారణ స్థాయి కన్నా తక్కువ గా ఉన్నట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ డంపింగ్ అండ్ అలీడ్ డ్యూటీస్ (డీజీఏడీ) పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి మన దేశ ంలోకి వచ్చే పలు స్టీల్ ఉత్పత్తులపై టన్నుకు 474-557 డాలర్ల స్థాయిలో యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా ఇతర దేశాల నుంచి మనకు దిగుమతి అవుతున్న పలు స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకం విధించాలని ఎస్సార్ స్టీల్ ఇండియా, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా డీజీఏడీని ఇదివరకే అభ్యర్థించాయి. కేంద్రపు ఎంఐపీ నిర్ణయంపైనే స్టీల్ పరిశ్రమ భవితవ్యం: ఇక్రా కేంద్ర ప్రభుత్వం కనీస దిగుమతి ధర (ఎంఐపీ) అంశంపై తీసుకోనున్న నిర్ణయంపైనే దేశీ స్టీల్ పరిశ్రమ భవిష్యత్తు ఆధారపడి ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లోని మిగులు ఉత్పత్తి, అధిక దిగుమతులు, చౌక ధరలు వంటి అంశాల కారణంగా దేశీ స్టీల్ పరిశ్రమ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపింది. ఎంఐపీని ఆగస్ట్ 5 తర్వాత కొనసాగించాలా? వద్దా? అనే అంశం పరిశ్రమకు చాలా కీలకమని అభిప్రాయపడింది. విదేశాల నుంచి ఉప్పెనలా వస్తోన్న స్టీల్ దిగుమతులకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కేంద్రం ఫిబ్రవరిలో దాదాపు 173 స్టీల్ ఉత్పత్తులపై ఎంఐపీని విధించింది. దీంతో వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్-మే కాలంలో స్టీల్ దిగుమతులు 30 శాతం తగ్గాయని తెలిపింది. అలాగే జూన్ మధ్య నాటికి స్టీల్ ధరలు 25 శాతంమేర పెరిగాయని పేర్కొంది. ఈ చర్యలు స్టీల్ కంపెనీలకు ఊరట కలిగించేవని పేర్కొంది. ఇక ఎంఐపీ కొనసాగింపుపై గత కొన్ని రోజులుగా నెలకొని ఉన్న అస్థిర పరిస్థితుల వల్ల స్టీల్ ధరలు గత నెల రోజుల్లో 8 శాతం మేర క్షీణించాయని తెలిపింది. -
ఉక్కు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర
న్యూఢిల్లీ: కొన్ని రకాల ఉక్కు ఉత్పత్తులకు కేంద్రం శుక్రవారం కనీస దిగుమతి ధర (ఎంఐపీ)ను నిర్ణయించింది. ఈ విలువ వివిధ ఉత్పత్తులకు సంబంధించి టన్నుకు 341 డాలర్ల నుంచి 752 డాలర్ల వరకూ ఉంది. చౌక దిగుమతుల నుంచి దేశీయ పరిశ్రమను రక్షించడంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 173 హెచ్ఎస్ కోడ్స్(ప్రొడక్ట్స్)పై ఎంఐపీని విధిస్తున్నట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో పేర్కొంది.ఈ ఎంఐపీ నిబంధనలు ఆరు నెలలు అమల్లో ఉంటాయి. ఎంఐపీ కంటే తక్కువ ధరకు దిగుమతులను అనుమతించడం జరగదు. -
ఉక్కు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర !
* త్వరలో నిర్ణయించనున్న కేంద్రం * దేశీయ స్టీలు కంపెనీలకు పెద్ద ఊరట * ఒకే పోర్టుకు దిగుమతులు పరిమితం! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఉక్కు (స్టీలు) రంగ కంపెనీలకు తీపి కబురు. కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల్లో స్టీలు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర (ఎంఐపీ) నిర్ణయించనుంది. కేంద్ర వాణిజ్య శాఖతోపాటు ఉక్కు శాఖ సంయుక్తంగా 30-35 రకాల స్టీలు ఉత్పత్తులకు ఎంఐపీని నేడోరేపో ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఎంఐపీ కంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తుల దిగుమతులకు చెక్ పెడతారు. దీంతో భారత్‌కు ప్రధాన ఎగుమతిదారైన చైనాతోపాటు జపాన్, దక్షిణ కొరియా, రష్యా తదితర దేశాల చవక ఉత్పత్తులకు అడ్డుకట్ట పడనుంది. మరోవైపు గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయం నుంచి మాత్రమే ఉక్కు ఉత్పత్తులను అనుమతించేలా నిబంధన రానుంది. చైనా, యూఎస్ తర్వాత అతిపెద్ద స్టీల్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో ఇన్ఫ్రా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున రానుండడంతో ఇక్కడి విపణిపై సానుకూల పవనాలు వీస్తున్నాయి. పెద్ద కంపెనీలకూ కష్టాలు: చవక దిగుమతుల కారణంగా భారతీయ కంపెనీలు మార్కెట్లో పోటీపడలేకపోతున్నాయి. లాభాలు కుచించుకుపోతున్నాయని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఎస్సార్ స్టీల్, జిందాల్ స్టీల్ తదితర దిగ్గజ కంపెనీలు కేంద్రానికి గతంలో ఫిర్యాదు చేశాయి. భారతీయ స్టీలు కంపెనీల తయారీ వ్యయం టన్ను స్టీలుకు సుమారు రూ.23 వేలుంటే, దిగుమతైన స్టీలు ధర రూ.16 వేలుంటోంది. ప్లాంట్ల సామర్థ్యం 20 శాతానికి మించడం లేదని, చాలా ప్లాంట్లు మూతపడ్డాయని ముంబైకి చెందిన ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఓఎన్జీసీ సైతం చైనా పైపులను దిగుమతి చేసుకుంటోందని వెల్లడించారు. పరిశ్రమను కాపాడాలంటే దిగుమతులకు అడ్డుకట్ట వేయాల్సిందేనని పలు స్టీలు కంపెనీలను నిర్వహిస్తున్న కామినేని గ్రూప్ చైర్మన్ కామినేని సూర్యనారాయణ సాక్షి బిజినెస్ బ్యూరోతో అన్నారు. లక్షల కోట్లలో పెట్టుబడులు.. దేశీయ స్టీలు కంపెనీలు విస్తరణకుగాను కోట్లాది రూపాయలను వెచ్చించాయి. ఇందుకోసం భారీగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల వద్ద నిరర్దక ఆస్తులు రూ.3.09 లక్షల కోట్లకు ఎగిశాయి. ఇందులో అత్యధిక వాటా స్టీల్ పరిశ్రమదేనని సమాచారం. కోల్డ్ రోల్డ్ ఫ్లాట్ స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం యాంటీ డంపింగ్ సుంకాన్ని రకాన్నిబట్టి 57.4 శాతం వరకు విధించింది. సీమ్‌లెస్ పైపులపైనా యాంటీ డంపింగ్ సుంకం విధించాలని మహారాష్ట్రకు చెందిన ఒక కంపెనీ ఎండీ తెలిపారు. భారత సీమ్‌లెస్ పైప్ మార్కెట్ రూ.15,000 కోట్లుగా ఉన్నప్పటికీ, ఒక్క భారతీయ సీమ్‌లెస్ పైప్ కంపెనీ కూడా ఆర్డరు పొందకపోవడం గమనార్హం.