సాక్షి, న్యూఢిల్లీ: రికార్డు కలెక్షన్ల పరంపర నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు ఫిబ్రవరి మాసంలో తగ్గుదలను నమోదు చేశాయి. ఫిబ్రవరి మాసపు జీఎస్‌టీ వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది.
జనవరి నెలలో రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు ఫిబ్రవరి నెలలో రూ.97,247కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం రూ.97,247కోట్లు వసూలు కాగా అందులో కేంద్ర జీఎస్‌టీ(సీజీఎస్‌టీ) రూ.17,626కోట్లు, రాష్ట్ర జీఎస్‌టీ(ఎస్‌జీఎస్‌టీ) రూ.24,192కోట్లు, ఐజీఎస్‌టీ రూ.46,953కోట్లుగా ఉన్నాయి. అలాగే దిగుమతుల మీద వసూలైన సెస్ కింద రూ.21,384కోట్లు, సెస్ కింద రూ.8,476కోట్లు వసూలయ్యాయి. విక్రయాలకు సంబంధించి దాఖలయ్యే రిటర్నరులు(జీఎస్‌టీఆర్-3బీ) 73.48లక్షలకు చేరాయి.
కాగా గత నెల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.02లక్షల కోట్లు వచ్చాయి. ఒక నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటడం ఇది మూడోసారి. గతేడాది ఏప్రిల్, అక్టోబరులో ఈ స్థాయిని అధిగమించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment