
జీవీకే ఆస్ట్రేలియా గనులకు కోర్టు అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే గ్రూపు ఆస్ట్రేలియా దేశంలో అభివృద్ధి చేయనున్న బొగ్గు గనులకు ప్రధాన అడ్డంకి తొలగింది. జీవీకే- హ్యాంకాక్ సంయుక్తంగా చేపట్టిన బొగ్గు గనుల పర్యావరణ అనుమతులపై తలెత్తిన అభ్యంతరాలను ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆల్ఫా కోల్ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులపై స్థానిక పర్యావరణ వేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై జీవీకే హర్షం వ్యక్తం చేసింది.