
వాషింగ్టన్: భారతీయ ఐటీ నిపుణులకు అతి కీలకమైన హెచ్1 బీ వీసాల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. 2019ఆర్థిక సంవత్సరానికిగాను ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నామని ఫెడరల్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. మరోవైపు ప్రీమియం వీసా ప్రాసెసింగ్‌ను ఆరు నెలలపాటు ట్రంప్ సర్కార్ నిలిపేసింది. ప్రాసెసింగ్‌లో సమయాన్ని ఆదాచేసే ఉద్దేశంతో హెచ్1బీ ప్రీమియం వీసా ప్రాసెసింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశామని ఇమ్మిగ్రేషన్ శాఖ ప్రకటించింది. హెచ్1 బీ వీసా పిటిషన్ల ప్రీమియం ప్రాసెసింగ్ సస్పెన్షన్ సెప్టెంబరు 10, 2018 వరకు కొనసాగుతుందని పేర్కొంది.
2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించామని యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. 2018 అక్టోబరు 1న ప్రారంభమవుతుందని యూఎస్‌సీఐఎస్ మార్చి 20, 2018 న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై వివరాలను తిరిగి నోటిఫే చేస్తామని చెప్పింది. తాత్కాలికంగా ప్రీమియం ప్రాసెసింగ్‌ను నిలిపివేయడం ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను ప్రాసెస్ చేయాలని భావిస్తున్నట్టు ఏజెన్సీ వెల్లడించింది. అయితే హెచ్1బీ వీసాల దరఖాస్తుల స్వీకరణ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం 65 వేలకుపైగా హెచ్1బీ వీసాలను జారీ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment