వీసాల్లో మార్పులు మన టెక్కీలకే లాభమట! | H-1B visa rules to help Indian IT professionals: Experts | Sakshi
Sakshi News home page

వీసాల్లో మార్పులు మన టెక్కీలకే లాభమట!

Published Fri, Apr 28 2017 6:19 PM | Last Updated on Thu, Apr 4 2019 3:41 PM

వీసాల్లో మార్పులు మన టెక్కీలకే లాభమట! - Sakshi

వీసాల్లో మార్పులు మన టెక్కీలకే లాభమట!

వాషింగ్టన్ : అమెరికా హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం చేయగానే.. దేశీయ ఐటీకి తీవ్రదెబ్బ అని, మన టెక్ ప్రొఫిషినల్స్ ఉద్యోగాలు ఊడతాయని తెగ ప్రచారం జరిగింది. దీంతో ఐటీ నిపుణుల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే హెచ్-1బీ వీసా నిబంధనల్లో ఇటీవల తీసుకొచ్చిన మార్పులు భారత ఐటీ ప్రొఫిషినల్స్ కు ఎంతో సాయపడనున్నాయని అమెరికా నిపుణులు చెబుతున్నారు.  భారత ఐటీ ప్రొఫిషినల్స్ కు ఈ నిబంధనల కఠినతరంతో ఎక్కువ వేతనాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు, అవుట్ సోర్సింగ్ కంపెనీల్లో లేబర్ కాస్ట్ లు పెరుగుతాయని బన్యాన్ ట్రీ క్యాపిటల్ మేనేజ్ మెంట్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్టనర్ ఇగ్నేషియస్ చితెలెన్ వార్టన్ వెబ్ సైట్ ఓపెడ్ లో చెప్పారు. వీసా హోల్డర్స్ కు  వార్షిక వేతనం కింద లక్ష డాలర్లను చెల్లిస్తారని వివరించారు. 
 
దీంతో అదనపు ఖర్చులు ఏడాదికి 2.6 బిలియన్ డాలర్లుంటాయని పేర్కొన్నారు. కొత్త వీసా పాలసీ నవంబర్ లో ప్రకటిస్తారని, వచ్చే ఏడాది నుంచి అప్లికెంట్ల వేతనాలు పెరుగుతాయని తెలిపారు. భారత ఐటీ ప్రొఫిషినల్స్ కూ లబ్ది చేకూరుతుందని చెప్పారు. అమెరికాలో అడ్వాన్స్ డిగ్రీలు పొందిన భారత గ్రాడ్యుయేట్లు, హెచ్-1బీ జాబ్స్ కు అప్లయ్ చేసే భారతీయులు ఎక్కువ వేతనం, మంచి పని ప్రదేశాల్లో ఉద్యోగాలు పొందవచ్చని పేర్కొన్నారు. అయితే హైర్ అమెరికన్ల పేరుతో హెచ్-41బీ వీసాల జారీ తగ్గుతుందని చెప్పారు. ప్రస్తుత హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ ఉద్దేశ్యం అమెరికా ఫస్ట్ అనేది కాదని, సిస్టమ్ లో ఉన్న దుర్వినియోగాన్ని అరికడుతుందని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు దేవ్ బ్రాట్ తెలిపారు. కంపెనీలు హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ లో లొసుగులను అడ్డం పెట్టుకుని, అత్యంత నిపుణులైన అమెరికా వర్కర్లను చీఫ్ లేబర్ తో రిప్లేస్ చేస్తున్నారని బ్రాట్ మరోసారి ఉద్ఘాటించారు. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ లో మార్పులను ప్రతిపాదించిన వారిలో ఈయన ఒకరు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement