
సాక్షి,ముంబై: భారతీయ నాలుగవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతిదారు అయిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రెండో త్రైమాసికంలో నికరలాభంలో 9.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంచనాలను బీట్ చేస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్( సెప్టెంబర్) ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది.
బుధవారం వెల్లడించిన సెప్టెంబరు 30 తో ముగిసిన క్యూ2(జూలై-సెప్టెంబర్) ఫలితాల్లో త్రైమాసిక ప్రాతిపదికన మూడు నెలల్లో నికర లాభం రూ. 2,207 కోట్లనుసాధించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 2,015 కోట్లను ఆర్జించింది. మొత్తం ఆదాయం 2.3 శాతం పెరిగి రూ. 12,433 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 4 శాతం పుంజుకుని రూ. 3037 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 0.39 శాతం బలపడి 24.4 శాతంగా నమోదయ్యాయి. కార్యకలాపాల ఆదాయం 8 శాతం పెరిగి రూ. 12,433 కోట్లు. స్థిరమైన కరెన్సీపరంగా వార్షిక రెవెన్యూ గైడెన్స్ 10.5 - 12.5 శాతం మధ్య వృద్ధిని అంచనా వేస్తున్నట్టుగా పేర్కొంది. అలాగే ఒక్కో షేరుకు కూ.2రూ. డివిడెండ్ ప్రకటించింది. కాగా ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment