
ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎమ్‌సీ) ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు అనూహ్య స్పందన లభించింది. ఈ ఐపీఓ 83 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ నెల 25న మొదలైన ఈ ఐపీఓ శుక్రవారం ముగిసింది. ఐపీఓలో భాగంగా ఆఫర్ చేయనున్న 1.88 కోట్ల షేర్లకు గాను 156 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. రూ.1,095–1,100 ప్రైస్‌బాండ్‌తో ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,800 కోట్లు సమీకరిస్తుందని అంచనా. వచ్చే నెల 6న ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్‌కావచ్చు. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ల(క్విబ్)కు కేటాయించిన వాటా 192 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 195 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 7 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ మంగళవారం ఈ కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.732 కోట్లు సమీకరించింది.
సెబీకి పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఐపీఓ పత్రాలు...
పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓ పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఆఫర్ ఫర్ సేల్ విధానంలో భాగంగా 49.58 కోట్ల షేర్లను విక్రయిస్తారు. ఇష్యూ సైజు రూ.2,000 కోట్ల మేర ఉండొచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment