
హెటిరో నుంచి క్యాన్సర్ చికిత్స ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా సంస్థ హెటిరో డ్రగ్స్ తాజాగా మెటాస్టాటిక్ కొలోరెక్టల్ క్యాన్సర్ (ఎంసీఆర్‌సీ) చికిత్సలో ఉపయోగపడే సిజుమాబ్‌టీఎం ఔషధాన్ని ప్రవేశపెట్టింది. 100 మి.గ్రా, 400 మి.గ్రా. మోతాదులో సింగిల్ డోస్‌గా ఇది లభిస్తుందని సంస్థ పేర్కొంది. బెవాసిజుమాబ్ కి ఇది బయోసిమిలర్ అని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఎండీ బి. పార్థసారథి రెడ్డి తెలిపారు.