సాక్షి, హైదరాబాద్ : కరోనా కట్టడి చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో సంస్థ రూపొందించిన రెమ్డిసివియర్ ఔషధాన్ని ముందుగా అయిదు రాష్ట్రాలకు పంపించారు. ‘కోవిఫర్’ పేరుతో జనరిక్ మందు అమ్మకానికి ఇటీవల గ్రీన్‌సిగ్నల్ లభించగా.. భారత్‌లో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న ముంబై, ఢిల్లీ వంటి నగరాలతోపాటు తమిళనాడు, గుజరాత్, హైదరాబాద్ నగరాలకు 20,000 వేల ఇంజక్షన్లను అందించినట్లు హెటిరో తెలిపింది.రెండో విడత కింద కోల్‌కతా, ఇండోర్, భోపాల్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కొచ్చి, త్రివేండ్రం, పణజి నగరాలకు పంపనున్నట్లు పేర్కొంది. (కోవిడ్‌కు హైదరాబాద్ ఇంజెక్షన్ రెడీ)
కాగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అరికట్టేందుకు హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో సంస్థ రెమ్డిసివిర్ ఔషధాన్ని ‘కోవిఫర్’ ఇంజెక్షన్ మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. `రెమ్డిసివిర్` ఔషధాన్ని ల్యాబ్‌లలో పరీక్ష చేసిన అనంతరం పాజిటివ్ రోగులుగా గుర్తించబడిన చిన్నారులు, యువత, కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రి పాలైన వారి చికిత్స కోసం వినియోగించవచ్చు. కోవిఫర్ (రెమ్డిసివిర్) 100 మిల్లీగ్రాములు ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. (కరోనా డ్రగ్ అమ్మకానికి గ్రీన్ సిగ్నల్)
ఇక 100 మిల్లీగ్రాముల రెమ్డిసివిర్ ఔషధానికి 5,400 రూపాయలు ఖర్చవుతుందని హెటిరో సంస్థ పేర్కొంది. వచ్చే మూడు, నాలుగు వారాల్లో లక్ష డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని వివరించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కంపెనీలో ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మందు కేవలం వైద్యల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికే లభిస్తుందని, రిటైల్గా ఇవ్వబడదని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ వంశీ కృష్ణ బండి తెలిపారు. ఇక భారత్‌లో గురువారం నాటికి 4.73 లక్షల కోనా కేసులు వెలుగు చూడగా, 14,894 మంది మరణించారు. (కరోనాకు హైదరాబాద్ మెడిసిన్!)
Comments
Please login to add a commentAdd a comment