హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నుంచి రెలిగేర్‌ బయటకు! | Home-grown PE firm True North acquires Religare Health Insurance | Sakshi
Sakshi News home page

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నుంచి రెలిగేర్‌ బయటకు!

Published Mon, Apr 10 2017 2:52 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నుంచి రెలిగేర్‌ బయటకు!

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నుంచి రెలిగేర్‌ బయటకు!

న్యూఢిల్లీ: రెలిగేర్‌ ఎం టర్‌ప్రైజెస్‌ వైద్య బీమా నుంచి తప్పుకుంటోం ది. రెలిగేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో తనకున్న మొత్తం 80% వాటాను రూ. 1,040 కోట్లకు విక్రయించనుంది. ఈ వాటాను ట్రూ నార్త్‌ మేనేజర్స్‌ అనే ప్రైవేటు ఈక్విటీ ఆధ్వర్యంలోని ఇన్వెస్టర్ల కన్సార్టియమ్‌ కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు తప్పనిసరిగా అమలు చేయాల్సిన ఒప్పందాన్ని ట్రూ నార్త్‌ మేనేజర్స్‌ ఆధ్వర్యంలోని ఇన్వెస్టర్ల బృందంతో కుదుర్చుకున్నట్టు,

 రెలిగేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో తమకున్న మొత్తం వాటాను విక్రయించనున్నట్టు రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. కొనుగోలు చేస్తున్న ఇన్వెస్టర్లలో గౌరవ్‌ దాల్మియా, ఫేరింగ్‌ కేపిటల్‌ కూడా ఉన్నాయి. రెలిగేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో యూనియన్‌ బ్యాంకుకు 5% వాటా ఉంది. కీలకమైన వ్యాపారంపై దృష్టి పెట్టాలన్న రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ విధానంలో భాగంగానే తాజా విక్రయమని గ్రూపు సీఈవో మణిందర్‌సింగ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement