Medical Insurance
-
ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స సౌకర్యం
-
పెద్దలకు పరిపూర్ణ రక్షణ
మన దేశ జనాభాలో వృద్ధులు (సీనియర్ సిటిజన్లు) 2015 నాటికి 8 శాతానికి చేరారు. 2050 నాటికి 19 శాతం వృద్ధులే ఉంటారని అంచనా. ప్రతీ ఇంటిలోనూ 60 ఏళ్లు నిండిన వయసు వారు ఆ కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి వంటివారే. కుటుంబం కోసం అప్పటి వరకు వారు ఎంతో పాటు పడి, ఎంతో శ్రమకోర్చి ఉంటారు. కానీ, వృద్ధాప్యంలో వారిని చుట్టుముట్టే ఆరోగ్య, జీవనశైలి సమస్యలెన్నో. వీటి కోసం చేయాల్సిన ఖర్చు కొన్ని సందర్భాల్లో భారీగానూ ఉంటుంది. వయసుతోపాటు పెరిగే ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ప్రతీ కుటుంబం తగినంత సన్నద్ధతతో ఉండాలి. అయితే, సీనియర్ సిటిజన్లు, వారి పిల్లలు హెల్త్ కవరేజీ విషయంలో తగినంత రక్షణతో లేనట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ‘‘ఉమ్మడి కుటుంబాలు కాస్తా ఏక కుటుంబంగా మారుతున్న రోజుల్లో.. పిల్లలు పెద్ద పట్టణాలకు, విదేశాలకు జీవనోపాధి కోసం తరలిపోతుండడంతో పెద్దల జీవనం, వారి సంరక్షణ సవాలుగా మారుతున్నాయి’’ అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో సంక్షేమం, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలను ముందు నుంచే తీసుకోవడం శ్రేయస్కరం. ఇందుకు వైద్య బీమాతో పాటు ఇతరత్రా తీసుకోతగిన చర్యలు సూచించే కథనమే ఇది. 50 ఏళ్లకు వచ్చిన వారికి పదవీ విరమణ తీసుకునేందుకు మరో 10 ఏళ్ల వరకు సమయం మిగిలి ఉంటుంది. ఈ కాలాన్ని వైద్య అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవసరమైనంత నిధిని సమకూర్చుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు రేణు మహేశ్వరి సూచించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ తన వంతుగా రోగి చెల్లించాల్సి వస్తే అందుకోసం వైద్య అత్యవసర నిధి అక్కరకు వస్తుంది. అవుట్ పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు అన్ని పాలసీల్లోనూ కవరేజీ ఉండకపోవచ్చు. కనుక అవుట్ పేషెంట్ వైద్య సేవలకు చేసే చెల్లింపులు, ఆస్పత్రికి రాను, పోను చార్జీలు ఇవన్నీ రోగి తన పాకెట్ నుంచే పెట్టుకోవాల్సి రావచ్చు. ఇంటి నుంచే నర్సింగ్, చికిత్సల సేవలను పొందాల్సి వస్తే అయ్యే వ్యయాలు ఎక్కువగానే ఉంటాయి. అత్యవసర నిధి ఉంటే దాన్నుంచి వీటికి చెల్లింపులు చేసుకోవచ్చు. ఒక్కసారి అత్యవసర నిధి సిద్ధం చేసుకున్న తర్వాత.. మొత్తాన్ని ఒకే చోట కాకుండా.. సేవింగ్స్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఉంచుకోవాలి. గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెద్దలకు చోటు ఉద్యోగం చేసే చోట గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సంస్థ ఆఫర్ చేస్తుంటుంది. ఇందులో తమ తల్లిదండ్రుల పేర్లను కూడా యాడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సాధారణంగా గ్రూప్ హెల్త్ కవరేజీలో ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. ముందు నుంచే తల్లిదండ్రులను యాడ్ చేస్తే ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. దీనికి తోడు తల్లిదండ్రులకు విడిగా హెల్త్ కవరేజీ కూడా తీసుకోవాలి. ‘‘చాలా సంస్థలు తల్లిదండ్రులకు దీర్ఘకాలం కవరేజీని ఆఫర్ చేయడం లేదు. అందుకే ముందు తల్లిదండ్రులను గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చేర్చుకున్నా కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగించాల్సి రావచ్చు. పైగా ఈ పాలసీల్లో పెద్దలకు కవరేజీ తక్కువగా రూ.2–3 లక్షల వరకే ఉంటుంది. ఉద్యోగం మానేసినా, లేక సంస్థ మారినా ఈ కవరేజీని కోల్పోవాల్సి వస్తుంది’’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం హెడ్ అమిత్ ఛబ్రా పేర్కొన్నారు. అవసరమైనంత కవరేజీ తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకోవడం ఎంతో అవసరం. ‘‘మీరు నివసించే ప్రాంతం, జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు.. ఆధారంగా ఎంత మేర సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) తీసుకోవాలన్నది ఉంటుంది’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. మెట్రోలో ఉంటున్న వారు, ఆస్పత్రిలో సింగిల్‌రూమ్ కోరుకునే వారు అధిక కవరేజీ తీసుకోవడం అవసరం. వృద్ధ దంపతులకు రూ.10–20 లక్షల కవరేజీ, ఆ వయసులో విడిగా ఒకరికి అయితే రూ.7–10 లక్షల వరకైనా బీమా తీసుకోవాలి. ఆలస్యం చేయవద్దు 50 ఏళ్లకి వచ్చే సరికి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వైద్య బీమా అన్నది తగినంత లేకపోతే సూపర్ టాపప్ ద్వారా దాన్ని పెంచుకోవాలి. అదే 60 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా హెల్త్ పాలసీ తీసుకోవాలన్నా, సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేక సూపర్ టాపప్ తీసుకోవాలన్నా అది కష్టంగా మారుతుంది. ‘‘ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులోకి ప్రవేశించారంటే వారికి కఠిన అండర్‌రైటింగ్ నిబంధనలు అమలవుతాయి. ఉదాహరణకు పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి’’ అని సిక్దర్ తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి బీమా కంపెనీలు బీమాకు నిరాకరిస్తున్నాయి కూడా. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పాలసీలు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముందస్తు వ్యాధులకు ఇవి కవరేజీని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. ఎన్నో పరిమితులను విధిస్తున్నాయి. కనుక వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. కోపేమెంట్ ఎంత..? సీనియర్ సిటిజన్ పాలసీల్లో ఎక్కువ వాటిల్లో కోపేమెంట్ ఆప్షన్ ఉంటోంది. కోపేమెంట్ అంటే వైద్య చికిత్సా వ్యయాల్లో రోగి తన వంతుగా చెల్లించాల్సిన వాటా. ఇది పాలసీలను బట్టి 10–30 శాతం మధ్య ఉండొచ్చు. క్లెయిమ్ మొత్తంలో ఈ మేరకు పాలసీదారులు భరించగా, మిగిలినది బీమా కంపెనీలు చెల్లిస్తాయి. కనుక కోపేమెంట్ క్లాజ్ లేని పాలసీ తీసుకోవాలి. లేదంటే పాలసీదారుని వాటా తక్కువగా ఉండేదానిని ఎంచుకోవడం మంచిది. ఉప పరిమితులు బీమా సంస్థలు చెల్లింపుల్లో ఉప పరిమితులను కూడా విధిస్తుంటాయి. అంటే, ఫలానా వ్యాధికి గరిష్టంగా ఇంత మొత్తమని లేదా సమ్ ఇన్సూర్డ్‌లో నిర్ణీత శాతాన్ని చెల్లిస్తామన్న నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలకు గరిష్టంగా రూ.3 లక్షలే చెల్లిస్తామనే పరిమితి ఉండొచ్చు. అదే కేటరాక్ట్ సర్జరీ అయితే గరిష్ట చెల్లింపులను రూ.25,000కు పరిమితం కావొచ్చు. ఒకవేళ ఇంతకు మించి వ్యయం అయితే దాన్ని పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే అన్ని పాలసీల్లో కాకపోయినా కొన్నింటిలో రూమ్ రెంట్, ఐసీయూ రెంట్ పరంగా ఉప పరిమితులు కూడా ఉంటుంటాయి. వీటితో మొత్తం పాలసీ చెల్లింపులు కూడా మారిపోతాయి. అందుకే పాలసీ తీసుకునే ముందుగానే వీటన్నింటినీ తెలుసుకోవాలి. వేచి ఉండే కాలం సీనియర్ సిటిజన్ పాలసీల్లో రెండు రకాల వేచి ఉండే కాలావధి (వెయిటింగ్ పీరియడ్) ఆప్షన్లు ఉంటుంటాయి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు వర్తించేది ఒకటి. పాలసీ తీసుకున్నాకా రెండు నుంచి నాలుగేళ్లు Výæడిచాకే వీటికి కవరేజీనిస్తాయి. కేటరాక్ట్, మోకీలు మార్పిడి తదితర (కొంత కాలానికి వ్యాప్తి చెందేవి) చికిత్సలకు కవరేజీ కోసం పాలసీ తీసుకున్నాక రెండేళ్ల పాటు ఆగాల్సి రావడం మరొకటి. అంటే ఈ కాలంలో చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారులే పెట్టుకోవాల్సి వస్తుంది. దాదాపు అన్ని పాలసీల్లోనూ ఈ నిబంధనలు ఉంటున్నాయి. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే అంశాలు ♦ 18% తల్లిదండ్రులకే హెల్త్ కవరేజీ ఉంది. అంటే మెజారిటీకి కవరేజీ లేదు. ♦ 26 శాతం తల్లిదండ్రులు వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులకు పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంటే నాలుగింట మూడొంతుల మందికి తగినంత పెట్టుబడులు, పొదుపు నిధుల్లేవు. ♦ 29 శాతం మంది తమ తల్లిదండ్రులను కంపెనీ లేదా ప్రభుత్వ వైద్య బీమా కవరేజీలో భాగం చేసినట్టు చెప్పారు. వీరికి ప్రత్యేకంగా కవరేజీ అవసరం కూడా ఉంది. -
ప్రణాళికతోనే ప్రశాంతత
భాగస్వామితో జీవితాన్ని పంచుకుంటాం.. కానీ జీవితంలో భాగమైన ముఖ్య ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచుతాం. అందరి విషయంలోనూ ఇదే వాస్తవం కాకపోయినా.. అత్యధిక దంపతుల్లో జరుగుతున్నది ఇదే. కుటుంబానికి తగినంత రక్షణ కోసం జీవిత బీమా, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులు, అవసరంలో ఆదుకునే వైద్య బీమా.. ఇలా ప్రతీ ఒక్క ఆర్థిక విషయాన్ని జీవిత భాగస్వామితో పంచుకోవడం అవసరమే కాదు.. ఎంతో ప్రయోజనం కూడా. భవిష్యత్తులో ఎవరికైనా ఊహించని పరిస్థితి ఎదురైతే అప్పుడు అయోమయానికి గురి కాకుండా సరైన దిశగా అడుగులు వేసేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం తప్పకుండా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. పెట్టుబడుల విషయాలను తప్పకుండా చర్చించి నిర్ణయించాలి. డాక్యుమెంట్లు ఎక్కడ పెడుతున్నది, ముఖ్యమైన బ్యాంకు ఖాతాలు, వాటి నామినీ వివరాలు, బీమా పాలసీలు ఇవన్నీ దంపతుల్లో ఇద్దరికీ తెలిసి ఉండాలి. ఆ అవసరాన్ని ఇక్కడి ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి... అనురాగ్ వయసు 40 ఏళ్లే. ఎప్పుడూ చలాకీగా ఉంటాడు. ఎదుటివారిని నవ్వుతూ విష్ చేస్తాడు. తన కెరీర్ పరంగా ఎంతో పని భారం మోస్తున్నా కానీ ఎప్పుడూ అది ముఖంపై కనిపించదు. ఎప్పుడూ నవ్వుతూ, తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ, అవసరంలో ఉన్న వారికి సాయం చేసే తత్వం. కానీ, దురదృష్టం.. ఒకరోజు గుండెపోటుతో అకస్మాత్తుగా తన వారందరినీ విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అనురాగ్‌పై ఆధారపడిన తల్లిదండ్రులు, భార్య, 11 ఏళ్లు, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం అంతటికీ అతడొక్కడే ఏకైక ఆధారం. అనురాగ్ భార్య అవంతిక బాగా చదువుకున్న మహిళ. పూర్తి స్థాయి ఉద్యోగానికి వెళ్లాలా లేక పార్ట్ టైమ్ ఉద్యోగం ఎంచుకోవాలా? అన్న సంశయంతో, ఆఖరుకు పార్ట్‌టైమ్ ఎంచుకుంది. తన పిల్లల కోసం కొంత సమయం వెచ్చించాలన్నది ఆమె కోరిక. తానే వారిని స్కూల్‌కు తీసుకెళ్లి, తీసుకురావాలని, వారి ఎదుగుదలను కళ్లారా చూడాలని, అందులో ఉన్న ఆనందాన్ని కోల్పోకూడదన్నది ఆమె అభిప్రాయం. అప్పటికే అనురాగ్ తన కష్టార్జితంతో కుటుంబాన్ని కాస్త మంచి స్థితిలో ఉంచిపోవడంతో, అవంతిక ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు సులభంగా జరిగాయి. వైద్యనాథన్ (44) ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాడు. దీంతో ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడుల కోసం వెచ్చించే తీరిక కూడా లేదు అతనికి. దీంతో పెట్టుబడులను పరిశీలిస్తే అంతా అస్తవ్యస్తంగానే కనిపిస్తుంది. తన సన్నిహితుల సలహాలపై ఆధారపడతాడు. అందు వల్లే వైద్యనాథన్ పొదుపులో అధిక భాగం బ్యాంకు సేవింగ్స్ ఖాతాలోనే ఉంటుంది. వాటిపై రాబడులు 3.5 శాతమే. పైగా పలు ఎండోమెంట్ పాలసీలను కూడా తీసుకున్నాడు. వీటిపైనా దీర్ఘకాలంలో రాబడులు 5–6 శాతం మించవు. కాకపోతే పదేళ్ల క్రితం చేసిన రియల్ ఎస్టేట్ పెట్టుబడి మాత్రం అతడికి బాగా కలిసొచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రుణం తీసుకుని రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడి పెట్టాడు. కానీ, ముందు చూసిన ఫలితం అతడికి రెండో పెట్టుబడిలో కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం (రెరా)ను తీసుకురావడంతో నల్లధన లావాదేవీలు తగ్గిపోయాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్‌లో డిమాండ్ తగ్గి ధరలపై ప్రభావం పడింది. కాకపోతే తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో వైద్యనాథన్‌కు ఓ ఇల్లు, మరో చోట ఇంకొక ఇల్లుతోపాటు ప్లాట్ కూడా ఉన్నాయి. మరోవైపు ఈక్విటీల్లో పెట్టుబడులు నేరుగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. అవన్నీ గతంలో మంచి పనితీరు చూపించినవి. కానీ, క్రితం ఐదేళ్లలో వాటి పనితీరు చెప్పుకోతగ్గంత లేదు. అనురాగ్ మాదిరే ఉన్నట్టుండి వైద్యనాథన్ కూడా ఆకస్మిక మరణానికి గురయ్యాడు. కానీ, ఇక్కడ పరిస్థితి భిన్నం. ఆస్తుల వివరాలు... వైద్య నాథన్ భార్య శ్రీనిధి ముందున్న పెద్ద టాస్క్.. అసలు ఆస్తులు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు వాటి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో గుర్తించాల్సి వచ్చింది. ఎందుకంటే కుటుంబ ఆర్థిక విషయాల గురించి ఆమెకు పెద్దగా తెలియదు. వైద్యనాథన్ తనంతట తానే నిర్ణయాలను అమలు చేసేవాడు. పలు సందర్భాల్లో తన భార్యకు తెలియజేసేందుకు వైద్యనాథన్ ప్రయత్నించినా ఎందుకోగానీ అది వాయిదా పడింది. కుటుంబానికి ఉన్న ఆస్తుల వివరాలు, ఫిజికల్ లేదా డిజిటల్ డాక్యుమెంట్లను ఎక్కడ భద్రపరిచినదీ శ్రీనిధికి తెలియదు. దీంతో అయోమయ పరిస్థితిని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తానికి వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. వైద్యనాథన్ బ్యాంకు ఖాతాలో నమోదై ఉన్న ఈ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ వివరాలు ఆమెకు తెలియవు. ఇంట్లో డాక్యుమెంట్లను గుర్తించే పనిలో పడింది. బ్యాంకు శాఖకు చెందిన రిలేషన్షిప్ మేనేజర్, భర్త స్నేహితులను సంప్రదించడం ద్వారా కొన్ని వివరాలు తెలిశాయి. కానీ, అప్పటికీ పూర్తి వివరాలపై స్పష్టత లేదు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకులో, ఒక ప్రైవేటు బ్యాంకులో భర్తకు ఖాతా ఉంది. ప్రైవేటు బ్యాంకు ఖాతాకు నామినీగా భార్య శ్రీనిధి పేరే రిజిస్టర్ అయి ఉంది. కానీ, ప్రభుత్వరంగ బ్యాంకు ఖాతాలో ఆమె పేరును నామినీగా నమోదు చేసి లేదు. ఎందుకంటే ఆ ఖాతా తెరిచి చాలా కాలం అయింది. పైగా వైద్యనాథన్ ఎటువంటి విల్లు రాయలేదు. దీంతో ఖాతాలోని బ్యాలన్స్ సరైన లబ్ధిదారునకు చేరేలా చూసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకు మరిన్ని డాక్యుమెంట్లను అడిగింది. వైద్యనాథన్ తన వివాహానికి పూర్వమే రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఒక మంచి పని చేశాడు. అప్పట్లో ఇది పెద్ద మొత్తమే అయినప్పటికీ, చాలా ఏళ్లు గడిచిపోవడంతో ద్రవ్యోల్బణం ఈ విలువను తగ్గించి వేసింది. పాలసీ తీసుకున్న సమయంలో నామినీగా తండ్రి పేరును చేర్చాడు. వివాహం అయిన తర్వాత ఆ స్థానంలో భార్య పేరును రిజిస్టర్ చేయడాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆమె అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని, తన మామయ్యను వెంట పెట్టుకుని ఎన్నో సార్లు బీమా కార్యాలయం చుట్టూ క్లెయిమ్ కోసం తిరగాల్సి వచ్చింది. ఇక పనిచేస్తున్న సంస్థ తరఫున వైద్యనాథన్ కుటుంబానికి మంచి వైద్య బీమా కవరేజీ ఉండేది. అది కాకుండా విడిగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలని వైద్యనాథన్ అనుకున్నా కానీ ఆ పని చేయలేదు. దాంతో వైద్యనాథన్ మరణం వల్ల ఇప్పుడు కుటుంబానికి వైద్యబీమా కవరేజీ లేకుండా పోయింది. కంపెనీ నుంచి ఉన్న పాలసీని మరో బీమా సంస్థకు పోర్ట్ పెట్టుకునేందుకు శ్రీనిధి ప్రయత్నాలు ఆరంభించింది. ఇక ఈపీఎఫ్ సభ్యుడు కావడంతో వైద్యనాథన్‌కు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా ఉంది. కంపెనీని సంప్రదించడంతో ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునే విషయంలో శ్రీనిధికి సహకారం లభించింది. కానీ, వైద్యనాథన్ మరణించే నాటికి అతని ఈపీఎఫ్ ఖాతాలో రూ.9 లక్షలు బ్యాలన్స్ ఉంది. అదే సమయంలో నామినీగా శ్రీనిధి పేరు అప్డేట్ అయి లేదు. బ్యాలన్స్ రూ.లక్ష మించి ఉండడంతో తన హక్కులను నిరూపించుకునేందుకు గాను శ్రీనిధి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడం తప్పనిసరి అయింది. కానీ, దీనికి చాలా సమయంతోపాటు, శ్రమ కూడా అవసరమే. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వైద్యనాథన్ రియల్ ఎస్టేట్‌లో తొలి ప్రయత్నం ఇచ్చిన విజయంతో ఐదేళ్ల క్రితం మరిన్ని పెట్టుబడులు పెట్టాడు. వాటి విలువ పెరగకపోగా, 20% తగ్గిపోయింది. ప్లాట్ ఒకటి ఉండడంతో కబ్జా భయంతో వెంటనే దాన్ని విక్రయించాలన్నది శ్రీనిధి ఆలోచన. మరో పట్టణంలో రెండో ఇంటిని కొనుగోలు చేయగా, దానిపై అద్దె ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో మంచి కిరాయిదారులు రావడం కష్టంగా మారడంతో ఏడాదిలో రెండు నెలలు ఖాళీగా ఉంటోంది. కిరాయి కూడా ఆస్తి విలువలో 2–3% మించి ఉండడం లేదు. దీంతో ఆ ఇంటిని కూడా వెంటనే విక్రయించేసి వచ్చే డబ్బులను లిక్విడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంది. ఆర్థిక, భావోద్వేగ పరంగా ఎంతో మద్దతుగా నిలిచి, కుటుంబం కోసం ఎంతో శ్రద్ధ చూపించిన భర్త ఆమెకు లేకపోవడంతో గత కొన్ని నెలలుగా ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవేళ భర్తతో కలసి సమష్టిగా ఆర్థిక విషయాలు చర్చించి ప్రణాళికలను అమలు చేసి ఉంటే నేడు శ్రీనిధి ఇన్ని ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. సమగ్రమైన జీవిత బీమాతోపాటు, కంపెనీకి వెలుపల సొంతంగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీ తీసుకుని ఉంటే ఆ ప్రయోజనాలు కొనసాగి ఉండేవి. అలాగే, సమయానికి లిక్విడిటీ అందుబాటులో ఉండని రియల్ ఎస్టేట్‌పైనా ఎక్స్పోజర్ తగ్గించుకుని ఉండాల్సింది. అలాగే, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్స్‌లోనూ వైవిధ్యానికి అవకాశం ఉండేది. అలాగే, జాయింట్ అకౌంట్లు, బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా నామీని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే శ్రీనిధి పని మరింత సులభం అయ్యేది. ఆస్తులు కూడా ఆమె పేరిట సులభంగా బదిలీ అయ్యేవి. -
పగలు తిప్పండి.. రాత్రి ఆపండి
సాక్షి, అమరావతి: అకస్మాత్తుగా అనారోగ్యం పాలైనా.. యాక్సిడెంట్ అయినా.. వెంటనే 108కు ఫోన్ చేయడం ప్రజలకు అలవాటు. ఇకపై రాత్రి పూట ఫోన్ చేస్తే 108 రాదు. ఎందుకంటే ఉన్న వాహనాలను పగలు మాత్రమే తిప్పండి, రాత్రి నిలిపివేయండి అంటూ 108 అంబులెన్సుల నిర్వహణా సంస్థ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీచేయడమే కారణం. రాష్ట్రంలో 439 వాహనాలుండగా 422 వాహనాలు తిరుగుతున్నాయని ముఖ్యమంత్రి కోర్‌డాష్ బోర్డులో సమాచారం ఉంది. కానీ ప్రస్తుతం 342 వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయని నిర్వాహణ సంస్థ జీవీజీ ఉద్యోగులు చెబుతున్నారు. వాహనాలను పగలు మాత్రమే తిప్పాలని, ఐదు కిలోమీటర్ల దూరం అయితేనే వెళ్లాలని, అంతకుమించి దూరంలో సంఘటన స్థలం ఉంటే బిజీగా ఉన్నామని చెప్పాలని ఉద్యోగులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదానికో, ఇతరత్రా ఆపదలో ఉన్న పేదలు 108కు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నామని జవాబు వస్తోంది. వాహనాలు తిరగడం లేదని ఉద్యోగులెవరైనా మీడియాకు చెబితే అలాంటి వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని సంస్థ బెదిరిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. కొన్ని వాహనాల్లో ఆక్సిజన్ సిలెండర్లు లేవు, 90 శాతం వాహనాల్లో మందులు లేవు, మెజార్టీ వాహనాలకు టైర్లు అరిగిపోయి తిరగడం లేదు..ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రెండు దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం లేదు. అయితే తాము ఇచ్చిన సమ్మె నోటీసును వెనక్కి తీసుకోలేమని, ఏ క్షణంలో అయినా సమ్మెలోకి వెళతామని ఉద్యోగులు హెచ్చరించారు. 108 వాహనాల సమస్యలు ఇవీ.. - సకాలంలో ఇంజన్ ఆయిల్ మార్చకపోవడంతో ఇంజన్లు సీజ్ అవుతున్నాయి - హెడ్లైట్లు పనిచేయకపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదానికి గురవుతున్నాయి - సైరన్, బార్‌లైట్స్, బ్లింకర్స్, బ్యాటరీ హారన్ పనిచేయడంలేదు. టైర్లు పూర్తిగా అరిగిపోయి వందల వాహనాలు తిరగలేని పరిస్థితిలో ఉన్నాయి - బ్రేకులు, బ్యాటరీలు పనిచేయడం లేదు - వైఫర్స్ పనిచేయకపోవడంతో వర్షంలో తిరగడం కష్టంగా ఉంటోంది. వాహనాల్లో మల్టీచానల్ మానిటర్, సెక్షన్ ఆపరేటర్స్, డిఫ్రిబ్యులేటర్, వెంటిలేటర్, పల్సాక్సీ మీటర్లు లేవు - కనీసం బీపీ ఆపరేటర్, స్టెతస్కోప్, గ్లూకోమీటర్, ధర్మామీటర్లు కూడా లేవు - చాలా అంబులెన్సుల్లో ఆక్సిజన్ అందుబాటులో లేదు - క్షతగాత్రులకు అవసరమైన కాటన్, డ్రెస్సింగ్ ప్యాడ్స్, సెరిలైజ్డ్ దూది, అయోడిన్, స్ట్రెచర్ కూడా లేవు - పాముకాటు సమయంలో ఇవ్వాల్సిన ఏఎస్వీ,టీటీ ఇంజక్షన్లు లేవు ఉద్యోగుల సమస్యలు.. - ప్రతినెలా ఉద్యోగుల వేతనాల్లో కారణం లేకుండా కోత వేస్తున్నారు - రోజుకు 8 గంటలు కాకుండా 12 గంటలు పనిచేయిస్తున్నారు - వేతనం పెంచుతామని హామీ ఇచ్చినా ఇప్పటికీ పెంచలేదు - గత 6 నెలలుకు సంబంధించిన రిలీవింగ్ బిల్లులు చెల్లించలేదు - వాహనాలకు మైనరు రిపేర్లు, పంక్చర్స్, ఎయిర్, హెడ్లైట్లకు సంబంధించిన బిల్లులు ఉద్యోగుల మీద వేస్తున్నారు. - వాహనాలు ఆగిపోతే ఆ సిబ్బందికి ప్రత్యామ్నాయం చూపించకపోగా వేతనాలు కూడా ఇవ్వడంలేదు. సిబ్బంది ప్రమాదానికి గురైతే ఎలాంటి వైద్య బీమా లేదు -
అవుట్ పేషెంట్ కవరేజీ తీసుకుంటే మేలా...?
ఆరోగ్యపరంగా ధీమాగా ఉండాలంటే నేడు వైద్య బీమా ఉండాల్సిందే. ఆస్పత్రి పాలైతే చికిత్స వ్యయాలను బీమా కంపెనీ చెల్లిస్తుంది. మరి ఆస్పత్రిలో చేరే అవసరం లేకుండా అవుట్ పేషెంట్‌గా తీసుకునే చికిత్సల వ్యయాల సంగతేంటి? ఎప్పుడైన ఆలోచించారా...? ఆస్పత్రిలో వైద్యుల కన్సల్టేషన్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందుల కొనుగోలు వ్యయాలు వీటికి ఎవరికి వారు విడిగా చెల్లించుకోవాలా..? లేక బీమా పాలసీలో కవరేజీ కావాలా? వైద్య బీమా పాలసీలో ఇది కూడా ముఖ్యమైన అంశమే. చాలా కంపెనీలు రెగ్యులర్ హెల్త్ పాలసీలతోపాటు అవుట్ పేషెంట్ విభాగం (ఓపీడీ) నుంచి పొందే చికిత్సలకు కూడా కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. అయితే, ఓపీడీ కవరేజీని ఎంచుకునే ముందు వేటికి కవరేజీ లభిస్తుంది? ఎంత మేర గరిష్టంగా క్లెయిమ్‌కు అనుమతిస్తారు? తదితర అంశాలను తప్పక తెలుసుకోవాలి. వీటికి ప్రీమియం కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి. ఓపీడీ కవరేజీని విడిగా పాలసీ రూపంలో కంపెనీలు ఆఫర్ చేయడం లేదు. సాధారణ హెల్త్ పాలసీకి అనుబంధంగానే ఓపీడీ కవరేజీ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, అపోలో మ్యునిక్, ఐసీఐసీఐ లాంబార్డ్, మ్యాక్స్ బూపా ఈ కవరేజీతో పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా ఓపీడీ కవరేజీలో డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు, వైద్యులు రాసిన మందులకు అయ్యే వ్యయాలు, వైద్య పరీక్షల వ్యయాలకు కవరేజీ ఉంటుంది. వీటికి క్లెయిమ్‌ను ఆస్పత్రి ద్వారా క్యాష్‌లెస్ రూపంలో పొందొచ్చు. లేదా రీయింబర్స్మెంట్ విధానంలోనూ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే, మొత్తం బీమాలో ఓపీడీ కవరేజీ ఎంత మేర గరిష్టంగా క్లెయిమ్ చేసుకోవచ్చన్నది ముఖ్యంగా తెలుసుకోవాలి. సాధారణంగా ఓపీడీ కవరేజీ చాలా పరిమితంగానే ఉండొచ్చు. వైద్య బీమా రూ.10 లక్షల కవరేజీకి తీసుకుంటే అందులో ఓపీడీ కవరేజీ గరిష్టంగా ఒక ఏడాదిలో రూ.10,000కే పరిమితం అవుతుంది. దీనికి మించి ఎంత ఖర్చు చేసినా కంపెనీ ఇవ్వదు. ఇక కొన్ని కన్సల్టేషన్లకు, మందుల కొనుగోలుకు మళ్లీ పరిమితులను కంపెనీలు విధిస్తుంటాయి. ఉదాహరణకు మ్యాక్స్ బూపా డాక్టర్ కన్సల్టేషన్ ఫీజుకు గరిష్టంగా రూ.600వరకే ఇస్తోంది. రూ.10 లక్షల పాలసీలో ఒక ఏడాదికి ఇలా గరిష్టంగా 10 డాక్టర్ కన్సల్టేషన్లకు అయిన వ్యయాలను చెల్లిస్తోంది. ఇతర ఓపీడీ ప్రయోజనాలు కూడా ఈ పాలసీలో ఉన్నాయి. అదే రూ.4 లక్షలకు పాలసీ తీసుకుంటే కన్సల్టేషన్లు నాలుగింటికే పరిమితం. డయాగ్నోస్టిక్ టెస్ట్‌లకు పరిమితి రూ.1,500. ప్రీమియం చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో వైద్యుల వద్దకు వెళ్లడం సర్వ సాధారణం. అయితే, బీమా కంపెనీలు మాత్రం ఓపీడీ కవరేజీకి అధిక ప్రీమియం వసూలు చేస్తున్నాయి. ఓపీడీ కవరేజీ అన్నది వసూలు చేసే ప్రీమియానికి కాస్తంత ఎక్కువగా ఉండటాన్ని చాలా కంపెనీల్లో గమనించొచ్చు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఓపీడీ ప్రయోజనాలతో కూడిన రూ.4 లక్షల వైద్య బీమా పాలసీని 35 ఏళ్ల వయసున్న వ్యక్తి, అతని జీవిత భాగస్వామి, ఒక చిన్నారి (మొత్తం ముగ్గురు)కి కలిపి వార్షికంగా రూ.15,000 ప్రీమియంను వసూలు చేస్తోంది. ఇందులో ఓపీడీ క్లెయిమ్ బెనిఫిట్ పరిమితి ఏడాదికి ముగ్గురికీ కలిపి రూ.3,280 మాత్రమే. ఇదే కుటుంబం రూ.5 లక్షల హెల్త్ పాలసీని ఓపీడీ లేకుండా తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ.11,915. అంటే రూ.3,280 ఓపీడీ కవరేజీ కోసం కంపెనీ రూ.3,085ను ప్రీమియంగా వసూలు చేస్తున్నట్టు అర్థమవుతోంది. మ్యాక్స్‌బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్లోనూ ఇదే విధమైన పరిస్థితి ఉంది. రూ.10 లక్షల వైద్య బీమా పాలసీని ఓపీడీ కవరేజీతో తీసుకుంటే ప్రీమియం రూ.4,000–7,000 వరకు అదనంగా (ఓపీడీ లేని పాలసీ ప్రీమియంతో పోలిస్తే) ఉంది. ప్రత్యామ్నాయాలూ ఆలోచించాలి..! ఓపీడీ కవరేజీ తీసుకుంటే అదనంగా చెల్లించే ప్రీమియానికి సెక్షన్ 80డీ కింద ఆదాయపన్ను మినహాయింపు ఉంది. ఓపీడీ కవరేజీ కింద కంపెనీల నుంచి పొందే రీయింబర్స్‌మెంట్‌కు పన్ను లేదు. అయితే, పన్ను ఆదా ఒక్కటే ఓపీడీ కవరేజీ తీసుకోవడానికి కారణం కారాదు. ఉదాహరణకు మధుమేహ సమస్యతో ఉన్న వారు, హైబీపీతో బాధపడుతున్న వారు తరచూ వైద్యుల వద్దకు వెళ్లాల్సి రావడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరపడుతుంది. మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఈ తరహా వ్యక్తులకు బీమా కంపెనీల నుంచి తగినంత కవరేజీ లభించకపోవచ్చు. ఒకవేళ లభించినా ప్రీమియం అధికంగా ఉంటుంది. అందుకని ఓపీడీ కవరేజీ తీసుకోవడం కంటే అందుకు అయ్యే వ్యయాలను తట్టుకునేందుకు విడిగా ఆదా చేసుకోవడం మంచిది. ఇందుకోసం వేతనంలో కొంత మేర పక్కన పెడుతూ, ఆ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదంటే షార్ట్‌టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్లలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ నిధి అవుట్ పేషెంట్ చికిత్సల రూపంలో ఎదురయ్యే అకస్మిక ఖర్చులను తట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. -
క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఉండాలి
ఈ సారి బడ్జెట్లో వయో వృద్ధులు కొన్ని రకాల చికిత్సల కోసం చేసే వ్యయంపై పన్ను మినహాయింపును రూ.లక్ష వరకూ పెంచారు జైట్లీ. అంటే క్రిటికల్ ఇల్నెస్ చికిత్సకన్న మాట. ప్రస్తుతం ఇది సీనియర్ సిటిజన్ల విషయంలో రూ.60వేలుగా, అత్యంత సీనియర్ సిటిజన్లకు రూ.80వేలుగా ఉంది. ఇకపై అందరికీ ఇది రూ.లక్షగా ఉంటుందన్న మాట. అసలింతకీ ఈ క్రిటికల్ ఇల్నెస్ అంటే ఏంటి? దీనికి ఖర్చులెంతవుతాయి? దీనికి బీమా కవరేజీ ఉంటుందా? కవరేజీ కావాలంటే ఏం చేయాలి? అసలు క్రిటికల్ ఇల్నెస్కు బీమా కవరేజీ ఎందుకు అవసరం? ఇవన్నీ వివరించేదే ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం... (సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) తీవ్రమైన అనారోగ్యం రూపంలో... ఊహించని సందర్భాలు ఎదురవటం కొత్తేమీ కాదు. అలాంటి సందర్భాల్లో వైద్య బీమా పూర్తిగా ఆదుకుంటుందని చెప్పలేం. ఎందుకంటే కవరేజీ పరంగా పరిమితులు ఉంటాయి. అదే క్రిటికల్ ఇల్నెస్ పాలసీ తీసుకుని ఉంటే ఆ పాలసీ పరిధిలో ఉన్న వ్యాధుల బారిన పడినపుడు నిర్దేశిత పరిహారం అందుతుంది. ఈ తరహా బీమా 15 ఏళ్ల నుంచీ ఉన్నదే. మొదట్లో జీవిత బీమా పాలసీలకు రైడర్‌గా వచ్చేది. అయితే, ఈ కవరేజీ తీసుకునేందుకు ఎన్నో వైద్య పరీక్షలు అవసరం కనక అప్పట్లో దీని పట్ల పెద్ద ఆసక్తి ఉండేది కాదు. దీంతో వీటి అమ్మకాలు చాలా తక్కువగా నడిచాయి. వీటికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా బీమా సంస్థలే చొరవతో ఆ తర్వాత పూర్తి స్థాయి, స్టాండలోన్ పాలసీలుగా తీసుకురావడం మొదలెట్టాయి. దీంతో వాటి క్లెయిమ్ చెల్లింపుల చరిత్రను ట్రాక్ చేసే అవకాశం లభించింది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు సమగ్రమైన కవరేజీతో ఉండడం అదనపు ఆకర్షణ. ‘క్రిటికల్’ పాలసీ వేరు... కుటుంబీకులో, బంధుమిత్రులో కేన్సర్, గుండెజబ్బు వంటి వాటి బారిన పడ్డట్లు వినటమనేది పెరిగిపోయింది. చిన్న వయసులో ఉన్న వారు కూడా వీటికి అతీతం కాకపోవడం ఆందోళన కలిగించేదే. ఈ నేపథ్యంలో క్రిటికల్ ఇల్నెస్ పాలసీ తీసుకోవాల్సిన అవసరం పెరిగిపోయిందనే చెప్పాలి. చాలా మంది సాధారణ వైద్య బీమా పాలసీకి, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ పాలసీకి మధ్య తేడా లేదనుకుంటుంటారు. కానీ ఇది తప్పు. ఈ రెండూ వేర్వేరు అవసరాలను తీర్చేవని, ఒకదానికొకటి తోడుగా మరింత రక్షణనిస్తాయని అర్థం చేసుకోవాలి. వైద్య బీమా అంటే ఆసుపత్రి ఖర్చులను మాత్రమే భరిస్తుంది. కానీ, క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ఖర్చుతో సంబంధం లేకుండా వ్యాధుల బారిన పడినప్పుడు నిర్దేశిత మొత్తం చెల్లిస్తుంది. ఏ కారణంతో ఆస్పత్రి పాలైనా వైద్య బీమా ఆదుకుంటుంది. కానీ, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ అన్నది ముందుగా పేర్కొన్న వ్యాధుల బారిన పడితే పరిహారం చెల్లిస్తుంది. వైద్య బీమా పాలసీని జీవితాంతం రెన్యువల్ చేసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ మాత్రం ఒకసారి క్లెయిమ్ చేస్తే ఆగిపోతుంది. ఎలా ఎంచుకోవాలి? పాలసీ ప్రీమియం, క్లెయిమ్‌ల పరిష్కార శాతం అన్నవి కీలకం. అలాగే, విడిగా ఆయా పాలసీలు ఎన్ని వ్యాధులకు రక్షణ కల్పిస్తున్నాయి? ముందు నుంచీ ఉన్న వ్యాధులకూ కవరేజీ పొందాలంటే ఎన్నాళ్లు వేచి ఉండాలి? పాలసీ కాల వ్యవధి ఎంత? గరిష్టంగా ఎంత బీమాకు అవకాశముంది? వంటివన్నీ చూడాలి. సాధారణంగా కంపెనీని బట్టి 10 నుంచి 37 వ్యాధుల వరకు కవరేజీనిచ్చే పాలసీలున్నాయి. అయితే ఇక్కడ సంఖ్య కాదు ముఖ్యం. కవరేజీనిస్తున్న వ్యాధులు ఎలాంటివన్నది చూడాలి. అంధత్వం, చెవిటితనం, మాట్లాడే శక్తిని కోల్పోవడం, అల్జీమర్స్ (జ్ఞాపకశక్తి క్షీణించిపోవడం), మల్టిపుల్ స్కెలరోసిస్, స్ట్రోక్ తదితర వ్యాధులకు పరిహారం చెల్లించే వాటికి ప్రాధాన్యం ఇచ్చేవారూ ఉన్నారు. ఎందుకంటే వీటికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ద్వారా నిర్ణీత పరిహారం పొందొచ్చు. వీటికి సాధారణ వైద్య బీమా పాలసీలో కవరేజీ పరిమితంగానే ఉంటుంది. ఉదాహరణకు అపోలో మ్యూనిక్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అయితే వ్యాధుల సంఖ్య పరంగా, వ్యాధుల పరంగా మెరుగైన పాలసీయేనని చెప్పొచ్చు. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీ ఇవ్వని పాలసీలకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో ఒకవేళ ఆయా వ్యాధులకు సంబంధించి క్లెయిమ్ ఎదురైతే తిరస్కరణకు గురికావొచ్చు. టాటా ఏఐజీ, హెచ్డీఎఫ్సీ ఎర్గో అయితే ముందు నుంచీ ఉన్న వ్యాధుల కవరేజీకి నాలుగేళ్ల పాటు వేచి ఉండాలన్న నిబంధన విధిస్తున్నాయి. చికిత్సా వ్యయాలు క్లిష్టమైన అనారోగ్యం బారిన పడితే చికిత్సా వ్యయాలను తట్టుకోవటం సామాన్యులకు భారమే. కేన్సర్, అవయవ మార్పిడి, ఓపెన్‌హార్ట్ సర్జరీలకు వ్యయం రూ.10 లక్షలకు తక్కువ కాదు. ఈ వ్యాధులకు చికిత్సా వ్యయాలు ఏటా 15–20 శాతం స్థాయిలో పెరుగుతున్నాయి. అంటే ఓ పదేళ్ల తర్వాత ఈ వ్యాధులకయ్యే వ్యయం రూ.50 లక్షలకు చేరొచ్చు. అందుకే సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ) ఎక్కువ ఉండాలి. చాలా వరకు క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు జీవితాంతం రెన్యువల్‌కు అవకాశం ఉన్నవే. అయితే ముందే వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రెలిగేర్, మ్యాక్స్ బూపా సంస్థలు అయితే రూ.కోటికి పైగా కవరేజీతో క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను అందిస్తున్నాయి. సర్వైవల్ పీరియడ్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీల్లో సాధారణంగా 30 నుంచి 90 రోజుల వరకు సర్వైవల్ పీరియడ్ ఉంటుంది. అంటే వ్యాధి బారిన పడిన తర్వాత ఇన్ని రోజుల పాటు జీవించి ఉంటేనే పరిహారం క్లెయిమ్ చేసుకోగలరు. నిజానికి ఇది ఆమోదనీయం కాదు. ఎందుకంటే తీవ్ర వ్యాధుల బారిన పడిన తర్వాత కొన్ని రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయిన కేసులు ఎన్నో ఉంటున్నాయి. ఉదాహరణకు హార్ట్ ఎటాక్ వచ్చి గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్న కేసులు చూస్తూనే ఉన్నాం. ఐసీఐసీఐ లాంబార్డ్ సంస్థ మాత్రం ఈ విధమైన సర్వైవల్ పీరియడ్ షరతు విధించడం లేదు. కొన్ని నెలల క్రితం 600 క్లెయిమ్‌లను (ఇవన్నీ వివిధ బీమా కంపెనీలకు సంబంధించిన గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్వి) ఓ సంస్థ విశ్లేషించగా తేలిన విషయం ఏమిటంటే... ఇందులో 50 క్రిటికల్ ఇల్నెస్వి. వీటిలోనూ 15 క్లెయిమ్‌లు సమ్ అష్యూర్డ్ పరిమితి దాటినవే. కనుక ప్రతీ ఒక్కరికీ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎంతో అవసరమని అర్థం చేసుకోవాలి. -
హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి రెలిగేర్ బయటకు!
న్యూఢిల్లీ: రెలిగేర్ ఎం టర్‌ప్రైజెస్ వైద్య బీమా నుంచి తప్పుకుంటోం ది. రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో తనకున్న మొత్తం 80% వాటాను రూ. 1,040 కోట్లకు విక్రయించనుంది. ఈ వాటాను ట్రూ నార్త్ మేనేజర్స్ అనే ప్రైవేటు ఈక్విటీ ఆధ్వర్యంలోని ఇన్వెస్టర్ల కన్సార్టియమ్ కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు తప్పనిసరిగా అమలు చేయాల్సిన ఒప్పందాన్ని ట్రూ నార్త్ మేనేజర్స్ ఆధ్వర్యంలోని ఇన్వెస్టర్ల బృందంతో కుదుర్చుకున్నట్టు, రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో తమకున్న మొత్తం వాటాను విక్రయించనున్నట్టు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ బీఎస్ఈకి సమాచారం అందించింది. కొనుగోలు చేస్తున్న ఇన్వెస్టర్లలో గౌరవ్ దాల్మియా, ఫేరింగ్ కేపిటల్ కూడా ఉన్నాయి. రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో యూనియన్ బ్యాంకుకు 5% వాటా ఉంది. కీలకమైన వ్యాపారంపై దృష్టి పెట్టాలన్న రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ విధానంలో భాగంగానే తాజా విక్రయమని గ్రూపు సీఈవో మణిందర్‌సింగ్ తెలిపారు. -
వడ్డీ తగ్గుతోంది ! రిటైరయ్యాక ఎలా ?
ఎఫ్డీలపై గణనీయంగా తగ్గుతున్న రాబడి ► ఊహించని రీతిలో పెరుగుతున్న వైద్య వ్యయాలు ► అందుకోసం మూడంచెల భద్రత అవసరం ⇔ అత్యవసర నిధి ⇔ వైద్య బీమా ⇔ ఈక్విటీల్లో పెట్టుబడి ► అనవసర వ్యయాలు తగ్గించుకోవటమూ మంచిదే డిపాజిట్లపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి. బ్యాంకు ఎఫ్డీలపై 7 శాతానికి మించి వడ్డీ రావటం లేదు. మరి వడ్డీ ఆదాయాన్నే నమ్ముకున్న విశ్రాంత ఉద్యోగుల పరిస్థితేంటో ఒక్కసారి ఊహించుకోండి? ప్రైవేటు ఉద్యోగాలు కనక చాలామందికి పింఛన్ కూడా లేదు. మరి వాళ్లేం చేయాలి? తక్కువ వడ్డీ రేట్లున్న ఈ పరిస్థితుల్లో జీవనావసరాలను తీర్చుకునేందుకు వారికున్న ప్రత్యామ్నాయాలేంటి? ఇదే ఈ ప్రత్యేక కథనం... గడిచిన రెండు మూడేళ్ల కాలంలో వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి. అలాగని ఖర్చులేమీ తగ్గిపోవటం లేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, వారి జీవిత భాగస్వామి అవసరాలకు వృద్ధాప్యంలో ఆర్థిక అవసరాలు గతం కంటే ఎక్కువే అయ్యాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు నెలనెలా వడ్డీ ఆదాయంతోపాటు మూల నిధి నుంచి కొంత మేర వినియోగించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితే మరో ఇబ్బంది ఎదురవుతుంది. తరిగిపోయిన అసలునిధి భవిష్యత్తులో తగినంత ఆదాయాన్నివ్వలేదు. జీవించి ఉన్నంత కాలం అవసరాలను తీర్చే స్థాయిలో అది ఉండకపోవచ్చు. ఇది కూడా ప్రమాదకరమే రిస్క్ సమంజసం కాదు... పెట్టుబడుల ద్వారా అధికంగా ఆదాయం పొందాలన్న ఆలోచనతో రిటైర్మెంట్ కాలంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్న నిధిని ఇతర సాధనాల వైపు మళ్లించడం సరికాదు. ఎందుకంటే విశ్రాంత జీవనంలో ప్రశాంతత ముఖ్యం. ఆ సమయంలో ఆదాయం కోసం తీసుకునే రిస్క్ ఆందోళనను పెంచకూడదు. పైగా అసలు నిధికి భద్రత ఎంతో అవసరం. కార్పొరేట్ సంస్థలు చేతులెత్తేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నందున బాడ్ ఫండ్లు, కార్పొరేట్ డిపాజిట్లలో పెట్టుబడులూ సమంజసం కాదు. ఇక ఉన్న అవకాశాలు యాన్యుటీ పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లే. యాన్యుటీ పథకాల కంటే ఫిక్స్డ్ డిపాజిట్లలోనే రాబడి ఎక్కువగా ఉంది. తక్కువ వడ్డీ రేట్లు, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చులు పరిమితం చేసుకోవడం, రివర్స్ మార్ట్గేజ్ వంటి వాటి ద్వారా అవసరమైనంత పొందడం విశ్రాంత జీవనంలో ఉన్న వారి చేతుల్లో ఉన్న అవకాశాలు. ఆరోగ్యానికి రక్షణ ఉందా? అన్నింటికంటే ఖరీదైనది వైద్యం అని తెలిసిందే. అందుకే మలి జీవితంలో తక్కువ వడ్డీ రేట్ల కారణంగా ఆరోగ్య రక్షణపై ప్రభావం పడకూడదు. ఇందుకోసం మూడెంచల రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. మొదటిది అత్యవసర నిధి. రెండోది వైద్య బీమా. మూడోది ఈక్విటీల్లో పెట్టుబడులు. వైద్య బీమాలో కొన్ని వ్యాధులు, సర్జరీలకు కవరేజీ ఉండదు. దానికి ఎక్కువ డబ్బే అవసరమవుతుంది. అందుకోసమే మూడో ఆప్షన్. వైద్య వ్యయాలనేవి అనుకోకుండా ఎదురవుతాయి. ఏ స్థాయిలో ఉంటాయన్నదీ ఊహించలేం. అందుకే ఈక్విటీల్లో కొంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొంత మేర రక్షణ కల్పించుకోవచ్చన్నది నిపుణుల సూచన. ఎందుకంటే సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఆరోగ్య రంగ ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంది. ఈ లెక్కన సాధారణ వస్తువుల ధరలతో పోలిస్తే వైద్య వ్యయాల పెరుగుదల వేగంగా ఉంటుంది. మరి ఉన్నదంతా తీసుకెళ్లి సురక్షితమైనదన్న యోచనతో ఫిక్స్డ్ డిపాజిట్లలోనే పెడితే వచ్చే నామమాత్రపు వడ్డీ ఆదాయం ఏ మూలకు సరిపోతుందన్నది ఆలోచించాలి. అందుకే కొంత రిస్క్ ఉన్నప్పటికీ ఈక్విటీలో కొంచెం మెరుగైన రాబడులను ఆశించవచ్చు. ఖర్చులకు కళ్లెం వేయాలా? ఇటువంటి సందర్భాల్లో వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడం సముచితం. వినోదం, కాలక్షేపం కోసం ఖర్చులకు బదులు జీవన వ్యయాలు, ఆరోగ్య వ్యయాలకే ప్రాధాన్యమివ్వాలి. ‘జీవితమంతా కష్టపడ్డాను ఇప్పుడైనా ఎంజాయ్ చేయకుంటే ఎలా’ అన్న భావన కలగడం అసహజమేమీ కాదు. అయితే మీకు వస్తున్న ఆదాయం మీ ఆకాంక్షలన్నింటినీ తీర్చే స్థాయిలో ఉంటే త్యాగం చేయాల్సిన అవసరం రాదు. కానీ, తక్కువ ఆదాయం ఉంటే మాత్రం కనీస అవసరాలే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకోవాలి. ‘రివర్స్’ మందు!! సొంత ఇంటినే ఆదాయ వనరుగా మార్చుకునే ప్రత్యేక సదుపాయం... ఇది అనువైన సమయమే! వడ్డీ రేట్ల క్షీణత నేపథ్యంలో రివర్స్ మార్ట్గేజ్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుత రేట్ల ప్రకారం చూస్తే రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతున్న వారికి రివర్స్ మార్ట్గేజ్ అనువైనదనేది నిపుణుల అభిప్రాయం. విశ్రాంత జీవనంలో ఉన్న వారికి ప్రధానంగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీయే ఆధారం. మరి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 7 శాతానికి దిగివచ్చేశాయి కనక వడ్డీ ఆదాయానికీ చిల్లులు పడ్డాయి. రూ.50 లక్షలను ఎఫ్డీ చేస్తే గతంలో 9 శాతం వడ్డీ రేటున్నప్పుడు వార్షికంగా రూ.4.5 లక్షల ఆదాయం వచ్చేది. ఇప్పుడు 7 శాతం వడ్డీపై ఈ ఆదాయం రూ.3.5 లక్షలకు పడిపోయింది. ఆదాయం ఈ స్థాయిలో తగ్గిపోయినందున రివర్స్ మార్ట్గేజ్ తీసుకోవడానికి ఇది అనువైన సమయమన్నది నిపుణుల మాట. ఎక్కువ బ్యాంకులు 10–12 శాతం మధ్య వడ్డీ రేటు వసూలు చేస్తుండగా, ఐవోబీ మాత్రం 9.40 శాతానికే రుణమిస్తోంది. రివర్స్ మార్ట్గేజ్ పనిచేసేదెలా? ఇంటి కోసం రుణం తీసుకున్నామనుకోండి. ఒకేసారి రుణం తీసుకుని... నెలనెలా వాయిదాలు కట్టాల్సి ఉంటుంది. దానికి రివర్స్‌లో... మన దగ్గరున్న ఇంటిని బ్యాంకుకు తనఖా పెడతామన్న మాట. బ్యాంకే నెలనెలా నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. అలా కాకుండా రుణం మొత్తం ఒకేసారి కావాలన్నా జారీ చేస్తుంది. కాల వ్యవధి తర్వాత ఏక మొత్తంలో రుణాన్ని, వడ్డీతో కలిపి తీర్చివేయాలి. 2007లో ఈ పథకం అమల్లోకి రాగా... ప్రారంభంలో ఈ పథకం పట్ల భారీ అంచనాలే వ్యక్తమయ్యాయి. కానీ, వాస్తవంగా చూస్తే ఆదరణ అంతగా లేదు. దీనికి కారణం వడ్డీ రేట్లు అధికంగా ఉండడమే. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు తమ సొంతింటిని రివర్స్ మార్ట్గేజ్ చేసుకునేందుకు అర్హత ఉంది. ఎలా తీసుకుంటే మేలు...? రివర్స్ మార్ట్గేజ్ రెండు విధాలుగా ఉంటుంది. అర్హత మేరకు రుణం మొత్తాన్ని బ్యాంకు ఖరారు చేసిన తర్వాత నెలసరి వాయిదాల రూపంలో లేదా మూడు నెలలు లేదా వార్షికంగా రుణాన్ని తీసుకోవచ్చు. కాదంటే ఏక మొత్తంలోనూ ఇస్తారు. ఒకేసారి రుణాన్ని తీసేసుకుంటే దాన్ని నెలనెలా ఆదాయం కోసం బ్యాంకు ఎఫ్డీ లేదంటే బీమా కంపెనీ పెన్షన్ యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలి. వీటి ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఉంటుంది. అదే బ్యాంకు నుంచి రుణాన్ని నెలసరి వాయిదాల రూపంలో అందుకున్నట్టయితే, అది రుణం కనుక దానిపై పన్ను పడదు. ఇంటి విలువలో ఎంత రుణం..? రివర్స్ మార్ట్‌గేజ్‌లో బ్యాంకులు రుణం తీసుకున్న వ్యక్తి మరణించినపుడు మాత్రమే రుణాన్ని వసూలు చేసుకోగలవు. అదే సమయంలో రుణ గ్రహీత మార్ట్గేజ్ కాల వ్యవధి వరకూ జీవించి ఉంటే... బ్యాంకులు రుణ వసూలును వాయిదా వేసుకోవాలి. దీంతో రిస్క్ పెరుగిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే బ్యాంకులు అసలు ఇంటి విలువలో 40 శాతాన్ని మాత్రమే (ఎల్టీవీ) రుణంగా మంజూరు చేస్తున్నాయి. ఎవరికి అనుకూలం...? చక్కగా స్థిరపడిన వారికి తల్లిదండ్రుల పేరిట ఉన్న ఇంటితో దాదాపు అవసరం ఏర్పడదు. అలాంటి పిల్లల తాలూకు తల్లిదండ్రులు రివర్స్ మార్ట్గేజ్ రుణ పథకాన్ని పరిశీలించొచ్చు. అలాగే, వస్తున్న ఆదాయం కంటే ఖర్చులు అధికం కావడం తరచూ జరుగుతుంటే రివర్స్ మార్ట్గేజ్ ఓ మంచి అవకాశమేనంటున్నారు నిపుణులు. ఒకవేళ ఆదాయం, ఖర్చుల మధ్య అంతరం తక్కువగా ఉంటే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలూ చూడొచ్చన్నది వారి సలహా. బ్యాంకు ఎఫ్డీల్లోనుంచి పెట్టుబడులను స్వల్పకాలిక డెట్ ఫండ్స్‌కు మళ్లించడం ద్వారా కొంచెం అధిక రాబడులను అందుకునేందుకు అవకాశం ఉంటుంది. విధి, విధానాలు ► 60 ఏళ్లు ఆపైబడిన వారే రుణానికి అర్హులు. దంపతులు ఇద్దరి పేరిటా తీసుకోవచ్చు. కాకపోతే అందులో ఒకరి వయసు 60, ఆపైన ఉండాలి. ► రుణ కాల వ్యవధి గరిష్టంగా 20 ఏళ్లు. బ్యాంకుల మధ్య ఈ విషయంలో తేడాలున్నాయి. వాస్తవానికి తనఖా పెడుతున్న ఇంటి మిగిలిన జీవిత కాలం రుణ కాల వ్యవధికి కీలకం. ► రుణ గ్రహీత మరణానంతరమే బ్యాంకులు రుణాన్ని వసూలు చేసుకుంటాయి. ఉదాహరణకు బ్యాంకు 20 ఏళ్ల కాలవ్యవధితో మార్ట్గేజ్ రుణాన్ని జారీ చేసిందనుకుందాం. రుణగ్రహీత 30 ఏళ్లు జీవించి ఉంటే, అప్పటి వరకూ బ్యాంకులు రుణాన్ని వసూలు చేసుకోవు. ► రుణ గ్రహీత మరణానంతరం అతని వారసులకు రుణాన్ని చెల్లించే హక్కుంటుంది. వారసులు రుణాన్ని చెల్లించేందుకు ముందుకు రాకపోతే, బ్యాంకులు అప్పుడు తనఖాలో ఉన్న ఇంటిని వేలం వేస్తాయి. అలా వచ్చిన ఆదాయంలో రుణం, వడ్డీ పోను ఏమైన మిగిలి ఉంటే ఆ మొత్తాన్ని చట్టబద్ధమైన వారసులకు అందిస్తాయి. ► ఇంటి రుణం మాదిరిగానే ప్రాసెసింగ్ చార్జీలు వంటివి మామూలే. -
ముందే చేస్తే ‘హెల్త్’ బాగుంటుంది!
వయసు మీరాక బీమా చేస్తే ప్రీమియం భరించలేం కంపెనీ ఇచ్చే పాలసీతో పాటు సొంతదీ ఉండాలి రజని వయసు 23 ఏళ్లు. ఈ మధ్యే తను ఒక అడ్వర్టై జింగ్ కంపెనీలో ట్రైనీ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. జీతం నెలకు రూ.25 వేలు. కంపెనీ ఇచ్చిన పీఎఫ్ ఖాతా, పేరెంట్స్ బహుమతిగా ఇచ్చిన ఎల్ఐసీ పాలసీ ఉన్నాయి. ఆ వయసులోని మిగతా వారిలానే రజనికి సొంత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదీ లేదు. కంపెనీ తరఫునున్న రూ.5 లక్షల కవరేజీ తప్ప. తను కెరీర్ ప్రారంభంలో ఉంది. ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరమేంటన్నది తన అభిప్రాయం. ఇరవైలలో ఉన్న నేహా విషయాన్ని పక్కనబెడితే... ముప్ఫైలలో ఉన్న వారు కూడా చాలా మంది ఇలానే ఆలోచిస్తున్నారు. అదెంతమాత్రం మంచిదికాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలొస్తే ఎక్కడ లేని డబ్బూ సరిపోదు. రూ.3 లక్షల కవరేజీ ఉన్నా సంక్లిష్టమైన సర్జరీ లేదా తీవ్ర అనారోగ్యాల బారిన పడితే 5 రోజుల హాస్పిటల్ ఖర్చులకు మించి రావడం లేదు. అలాగని వ్యక్తిగతంగా పొదుపు చేసి, ఆ మొత్తాన్ని వైద్యానికి వాడదామంటే అయ్యే పని కాదు. అందుకని సాధ్యమైనంత ముందే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇటు పొదుపు మొత్తాలు భద్రంగా ఉంటాయి. అటు మీ కుటుంబానికీ భరోసా ఉంటుంది. రెండు రకాల ప్రయోజనాలు... వైద్య బీమాను సాధ్యమైనంత ముందు తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి. మొదటిది.. పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన రిస్కులు తక్కువ, దీర్ఘకాలం పాటు ఎక్కువ కవరేజీ లభిస్తుంది. రెండోది.. ఎంత ముందుగా తీసుకుంటే ప్రీమియం అంత తక్కువ. అదే నలభై ఏళ్లు వచ్చే దాకా ఆగి అప్పుడు తీసుకుంటే.. జీవిత కాలం తక్కువగా ఉంటుంది కనుక ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఎంత ముందయితే.. అంత మంచిది! కంపెనీ పరంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ.. సొంత పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. ఒకవేళ మీరో, లేదా మీ కుటుంబ సభ్యులో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు ఒకోసారి కంపెనీ ఇచ్చే పాలసీ మొత్తం చికిత్స ఖర్చులకు సరిపోకపోవచ్చు. అలాగే, మీరు రిటైరయిన తర్వాత కంపెనీ ఇచ్చే పాలసీ కవరేజీ కూడా ముగిసిపోతుంది. సొంతంగా తీసుకున్న పాలసీనే అప్పుడు అక్కరకొస్తుంది. లేకపోతే కష్టపడి పొదుపు చేసిన డబ్బును ఖరీదైన వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. పోనీ అప్పుడు పాలసీ తీసుకుందామనుకుంటే 60 ఏళ్లు వచ్చాక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే కష్టం. ప్రస్తుతం చాలా పాలసీలు డే–కేర్ ప్రొసీజర్స్ మొదలుకుని, మెటర్నిటీ, ఓపీడీ మొదలైన వాటన్నింటికీ కూడా కవరేజీ ఇస్తున్నాయి. కాబట్టి ఆస్పత్రిలో చేరకపోయినా జీవితంలో చాలా మటుకు వైద్య ఖర్చులను ఎదుర్కొనేందుకు హెల్త్ పాలసీలు ఉపయోగపడతాయి. అయితే, పాలసీ తీసుకున్నాక నిర్దిష్ట సమయం తర్వాత మాత్రమే కొన్ని రకాల అనారోగ్యాలు, ప్రత్యేక ట్రీట్మెంట్స్కు కవరేజీ వర్తిస్తుంది. కాబట్టి స్థూలంగా చెప్పాలంటే.. అరవయ్యో పడిలోకి వచ్చేదాకా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. ఆ తర్వాత వైద్య ఖర్చులకు భారీ మొత్తాలను జేబులో నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు పాలసీ తీసుకోవాలనుకున్నా ప్రీమియం కూడా భారీగానే కట్టుకోవాల్సి వస్తుంది. కనుక, ఎంత ముందుగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే అంత మంచిది. -
‘సూపర్’ సిక్స్
ఫిఫ్టీప్లస్... బాడీబిల్డర్లుగా రాణించడానికి ‘ఆరు’నూరైనా ప్యాక్ తెచ్చుకోవాలని కష్టపడేవాళ్లను చూశాం. తంటాలెన్ని పడినా తెర ‘వెలిగి’ పోవాలని ఆరుపలకల్ని అందుకునేవాళ్లను చూశాం. అయితే అటు బాడీబిల్డింగ్కు, ఇటు సినిమా ఫీల్డ్‌కు.. మరే అవసరం లేని వ్యక్తి, కేవలం తన స్టూడెంట్‌ని ఇన్స్పైర్ చేయడానికి ఆరు పలకల అపు‘రూపాన్ని’ అందుకోవాలని రెక్కలు ముక్కలు చేసుకోవడం, ఆ వ్యక్తి వయసు 50కిపైనే ఉండడం... చూశామా? ఏభై ఏళ్లు వచ్చేసరికే.. మెడికల్ ఇన్సూరెన్స్‌లు కట్టడంలో, డయాగ్నసిస్ సెంటర్ల చుట్టూ తిరగడంలో, ఆయుర్వేద, అల్లోపతి, హోమియోపతి... మంచి చెడులను తెలుసుకోవడంలో బిజీ అయిపోతారు. తక్కువ తింటే చాలక, ఎక్కువ తింటే అరగక ‘ఏం చేస్తాం? ఫిఫ్టీప్లస్ ఏజ్ కదా అంతే’అని సరిపుచ్చుకుంటూ గడిపేస్తుంటారు. ఎమ్.ఎ.గుప్తా (53) తరహాలో వయసును వెనక్కి పంపాలనే ఆలోచన చేసేవాళ్లు అరుదే. ఈ విజయవాడ వాసి ఏభై మూడేళ్లకు ఆరుపలకలు సాధించి యూత్‌కి సైతంఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. -సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి మనవళ్లను ఎత్తుకోవాలని ఎదురు చూసే వయసులో జిమ్‌కి వెళితేనే విచిత్రంగా చూస్తారు. అలాంటిది సిక్స్‌ప్యాక్ చేస్తానంటే... ‘ఆశ్చర్యపోయారు. వద్దని వారించారు. లేనిపోని సమస్యలొస్తాయని హెచ్చరించారు కూడా’ అని చెప్పారు ఎమ్.ఏ.గుప్తా. విజయవాడలోని ప్రముఖ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సూపర్‌విజ్ సంస్థ యజమాని అయిన గుప్తా...తన ఫిట్నెస్ స్టోరీని ‘సాక్షి’ కి ఇలా వివరించారు. స్టూడెంట్‌కు స్ఫూర్తినివ్వాలని... ‘నా ఓల్డ్ స్టూడెంట్స్‌లో ఒక కుర్రాడు... కొంత కాలం క్రితం కలిశాడు. బాగా లావైపోవడం వల్ల తనకు పెళ్లికావడం లేదని చెప్పి బాధపడితే.. అతన్ని ఎలా సముదాయించాలో నాకు అర్థం కాలేదు. నిజానికి అప్పటికి నేనే ఓవర్ వెయిట్ ఉన్నా. స్టూడెంట్స్‌కి కాదు ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే అది చేసి చూపించాలనేది నా పద్ధతి. అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పారు గుప్తా. హైట్ 5.5, బరువు 85 కిలోల పైనే. పొట్ట తగ్గించుకోవాలని ముంబయిలో అనిల్ అంబానీకి ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేసే మాథ్యూ దగ్గర నుంచి అమీర్‌ఖాన్ ట్రైనర్ సత్య దాకా పలువురు ట్రైనర్ల సూచనల్ని ఫాలో అయినా ఫలితం కనిపించలేదు. హైదరాబాద్‌లోని ‘సోల్’ జిమ్‌లో సిక్స్‌ప్యాక్ స్పెషలిస్ట్‌గా పేరున్న వెంకట్‌ను కలిశా. ‘సిక్స్‌ప్యాక్’ చేద్దామా?అని అడిగాడు. తొలుత జంకినా అంతకు ఎయిమ్ చేస్తే కనీసం పొట్ట తగ్గకపోతుందా? అని ఓకే చెప్పేశాను.’ ఇరవై ఏళ్లు వెనక్కెళ్లా... జీవితంలో అన్ని విధాలా ముందుకు వెళుతుంటే వచ్చే ఆనందాన్ని ముందుకెళ్లే వయసు మింగేస్తుంది. అయితే ఎక్సర్సైజ్ పుణ్యమాని 20 ఏళ్లు వయసు తగ్గినట్టుంది. చూసినవాళ్లు కూడా అదే అంటున్నారు. ఆస్తులు.. అంతస్తులు, హోదాలు ఎన్ని ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృథా అనే ది నిస్సందేహం. సిక్స్‌ప్యాక్ అనేది కేవలం ఒక సరదా తప్ప... దానిని సాధించడం వెనుక నా ఉద్ధేశం... హెల్త్‌ని ప్రమోట్ చేయడమే... ఇదీ ఒక ఎడ్యుకేషనే... నిజం చెప్పాలంటే... అన్నింటికన్నా చాలా విలువైన, అవసరమైన ఎడ్యుకేషన్. వయసంటే ఇప్పుడు కేవలం మానసిక భావనే. దాన్ని చూసి భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. పొట్ట చెక్కలైందిలా... వెంకట్ స్వస్థలం కూడా విజయవాడే కావడం నాకు కలిసొచ్చింది. మిగిలిన రోజుల్లో ఇక్కడ జిమ్‌లో ఆయన సూచనలకు అనుగుణంగా చేస్తుంటే... వారాంతాల్లో తన ఫ్యామిలీని కలవడానికి వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి ట్రైన్ చేసేవాడు. స్ట్రిక్ట్ డైట్, వర్కవుట్స్‌తో 2నెలల్లోనే బరువు తగ్గాను. చూసినవారి ప్రశంసలతో మరింత ఉత్సాహం వచ్చింది. రోజూ ఉదయం రెండున్నర గంటలు సాయంత్రం గంటన్నర సమయం కేటాయించాను. ఫ్యాట్ పెంచే ఆహారం బదులు ఎనర్జీ డ్రింక్స్, అత్యధిక ప్రొటీన్లు అందించే విదేశీ రైస్ వినియోగం హెల్ప్ చేశాయి. ఒక నెలపాటు వెంకట్ జిమ్‌లో చేయడానికి రోజూ హైదరాబాద్ అప్ అండ్ డవున్ చేస్తూ సిక్స్‌ప్యాక్ సాధించాను. అయితే సిక్స్‌ప్యాక్ జీవితకాలం చాలా స్వల్పమని, ఏళ్ల తరబడి నిలవదని తెలుసు. అందుకే సాధించిన సిక్స్‌ను స్వీట్ మెమొరీగా ఫొటోషూట్ తో పాటు వీడియో తీయించుకున్నాను. ఇక ఇప్పుడున్న షేప్‌ను నిలబెట్టుకుంటే చాలు. దీని కోసం ట్రైనర్ సూచించిన విధంగా రోజుకు 45 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ సరిపోతోంది. ఓవర్ వెయిట్ విషయంలో నా దగ్గరకు వచ్చి బాధపడిన స్టూడెంట్‌కి నా ఫొటోలు, వీడియో పంపాను. అవి అతన్ని ఎంత ఇన్స్పైర్ చేయాలో అంతా చేశాయి. వయసుతో సంబంధం లేదు... ఎక్సర్సైజ్ ఏ వయసు వారైనా చేయవచ్చు. అలాగే సిక్స్‌ప్యాక్ కూడా. అయితే డైట్, వర్కవుట్, లైఫ్‌స్టైల్... ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హెవీ వెయిట్‌ను మోస్తూ అది తెచ్చే సమస్యలను ఆహ్వానించడం కన్నా... కొంత శ్రమపడితే జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. మరెంతో కాలం పాటు మజిల్స్‌ను ఫిట్‌గా ఉండేలా చేసుకోవచ్చు. - ఎమ్. వెంకట్, ట్రైనర్. -
ఏజెంట్ల తప్పులకు బీమా సంస్థలదే బాధ్యత
న్యూఢిల్లీ: ఏజెంట్లు చేసే తప్పొప్పులన్నింటికీ బీమా కంపెనీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ స్పష్టం చేసింది. ఒకవేళ ఏజెంట్లు నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో బీమా కంపెనీ రూ. 1 కోటి దాకా జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ల నియామకానికి సంబంధించి మంగళవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఐఆర్డీఏ ఈ విషయాలు పేర్కొంది. ఈ మార్గదర్శకాల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా బీమా ఏజెంట్ల కింద వ్యవహరించే వ్యక్తులపై రూ. 10,000 దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ఎవరైనా సరే జీవిత బీమా, సాధారణ బీమా, వైద్య బీమా విషయంలో ఒకటికి మించి కంపెనీలకు ఏజెంట్లుగా వ్యవహరించకూడదు. బీమా కంపెనీలు నియమించుకున్న ఏజెంట్లందరి వివరాలతో కూడిన ఒక జాబితా ఉండాల్సిన అవసరం ఉంది. -
జీవన్ సరళ్ సరెండర్ చేయాలా?
నా కొడుకు వయస్సు 24 సంవత్సరాలు. ఇటీవలనే ఉద్యోగంలో చేరాడు. అతనికి సంబంధించిన పీపీఎఫ్, టర్మ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధిత ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ నేను చూస్తున్నాను. తన పొదుపు సొమ్ములను మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ స్మాల్-క్యాప్ ఫండ్లను ఎంపిక చేశాను. మూడో ఫండ్‌గా ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీని పరిశీలిస్తున్నాను. కానీ ఈ ఫండ్ రేటింగ్ ఇటీవల పడిపోయింది. మీరేమంటారు? - మహ్మద్ ఇజాజ్, హైదరాబాద్ ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ... మంచి రాబడులనిస్తున్న ఫండ్ అనే చెప్పవచ్చు. మీ అబ్బాయి కెరీర్ పొదుపులు, ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ప్రారంభం కావడం సంతోషించదగ్గ విషయం. మీ అబ్బాయి కోసం మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ బావుంది. అయితే ఒక పెద్ద మార్పు సూచిస్తాను. మీ అబ్బాయి వయస్సు చిన్నది. పీపీఎఫ్ అకౌంట్లో 20-30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం కంటే, ఒక మంచి ఫండ్‌ను ఎంచుకొని దాంట్లో క్రమం తప్పకుండా 15-20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇలా చేస్తే పీపీఎఫ్‌లో కన్నా అధిక రాబడులు పొందవచ్చు. మరొక మార్పు ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టే వాళ్లు, మొదటగా ట్యాక్స్-సేవింగ్స్ ఫండ్‌తో ప్రారంభించాలి. ఇది మీ అబ్బాయి అనుసరిస్తే తన ఆదాయంపై పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం అతడికి లభిస్తుంది. అందుకని పీపీఎఫ్ అకౌంట్లో తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ, కొద్ది మొత్తాన్ని కొన్ని ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మూడేళ్ల క్రితం ఎల్ఐసీ జీవన్ సరళ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాను. ఇప్పటివరకూ రూ.54,000 ప్రీమియమ్గా చెల్లించాను. ఈ ప్లాన్ ప్రస్తుత సరెండర్ వేల్యూ రూ.30,000గా ఉంది. ఇన్సూరెన్స్‌కు ఇది సరైనదేనా? దీనిని కొనసాగించమంటారా ? లేదా మరొక దాంట్లో ఇన్వెస్ట్ చేయమంటారా? కల్పన, తిరుపతి ఎల్ఐసీ జీవన్ సరళ్ అనేది ఎండోమెంట్ పాలసీ. అన్ని ఎండోమెంట్ పాలసీల్లాగే ఇది కూడా వ్యయాల విషయమై పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఇలాంటి ప్లాన్లతో ఉండే ప్రధానమైన సమస్యే ఇది. ఈ పాలసీ పదవ సంవత్సరం తర్వాత నుంచి లాయల్టీ ఆడిషన్స్ లభిస్తాయి. మీరు ఇప్పటివరకూ రూ.54,000 ప్రీమియంగా చెల్లించారు. ఈ ప్లాన్ సరెండర్ వేల్యూ రూ.30,000గా ఉంది. మీ నష్టాలను కనిష్టం చేసుకోవాలంటే మీరు ఈ ప్లాన్‌ను సరెండర్ చేయడమే ఉత్తమం. ఈ పాలసీ నుంచి వైదొలగి మంచి రాబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీరు ఈ ప్లాన్ నుంచి వైదొలిగితే మీకు బీమా రక్షణ ఉండదు. అందుకని ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మిగిలిన మొత్తాన్ని మంచి రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీ ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు, వనరులు ఆధారంగా, మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి తగిన మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 60 సంవత్సరాలు. త్వరలో నా నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) అకౌంట్ మెచ్యూర్ కాబోతోంది. 40% మొత్తాన్ని ఎల్ఐసీ నుంచి పెన్షన్ కోసం(జీవన్ ఆక్షయ్ సిక్స్త్) ఎంచుకున్నాను. 60% మొత్తం నా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అయ్యేలా ఎంపిక చేసుకున్నాను. ఈ 60% మొత్తంపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందా? ఇండెక్సేషన్ ప్రయోజనాలు లభిస్తాయా?- మురళీ వైజాగ్ నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) మెచ్యూర్ అయితే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఎన్పీఎస్ మొత్తంలో 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. కనీసం 40 శాతం మొత్తాన్ని యాన్యూటీ కొనుగోలు కోసం వెచ్చించాల్సి ఉంటుంది. మీరు విత్‌డ్రా చేసుకునే 60 శాతం మొత్తంపై మీ ఆదాయపు పన్ను స్లాబుననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్ ప్రయోజనాలు వర్తించవు. అంతేకాకుండా మాన్యుటీ ప్లాన్ ద్వారా నెలవారీ మీరు పొందే మొత్తాలపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
ఆరోగ్యానికి డబుల్ ధీమా
పెరుగుతున్న వైద్య చికిత్స వ్యయానికి తోడు, వైద్య బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండటంతో దేశంలో ఆరోగ్య బీమాపాలసీల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు చాలామంది ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య పాలసీలు కలిగి ఉండటం అనేది సర్వసాధారణమైంది. ఇటువంటి కేసుల్లో అత్యధికంగా కంపెనీ ఇస్తున్న ఆరోగ్య పాలసీకి అదనంగా వ్యక్తిగత పాలసీలు తీసుకునే వారే ఉంటున్నారు. ఒకవిధంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కేవలం కార్పొరేట్ పాలసీపై ఆధారపడకుండా వ్యక్తిగతంగా కలిగి ఉండటం ద్వారా ఉద్యోగం మారే సమయాల్లో, లేదా ఉద్యోగం పోయిన సందర్భాల్లో వ్యక్తిగత పాలసీలు అక్కరకు వస్తాయి. అంతేకాదు చిన్న వయసులోనే వ్యక్తిగత పాలసీలు తీసుకుంటే అప్పటికే ఏమైనా వ్యాధులు ఉంటే వాటి వెయిటింగ్ పీరియడ్ తొందరగా ముగిసిపోతుంది. అన్నీ చెప్పాలి ఒకటి కంటే ఎక్కువ వ్యక్తిగత ఆరోగ్య పాలసీలు తీసుకుంటున్నప్పుడు బీమా కంపెనీలకు వివరాలన్నీ తెలియచేయాలి. కొత్తగా ఏమైనా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటికే కలిగి ఉన్న పాలసీ వివరాలు చెప్పాలి. ఈ పాలసీలకు ప్రీమియం మీరు చెల్లిస్తుంటేనే చెప్పాల్సి ఉంటుంది. అలాకాకుండా ప్రీమియంలు కంపెనీలు చెల్లిస్తుంటే ఆ పాలసీ వివరాలను కొత్త పాలసీ తీసుకునేటప్పుడు తెలియచేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అప్పటికే పాలసీ కలిగి ఉండి ఆ వివరాలను మరో పాలసీ తీసుకునేటప్పుడు తెలియచేయకపోతే అది బీమా కంపెనీల నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. ఇలాంటి సమయంలో క్లెయిమ్‌ల సమయంలో సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇలా క్లెయిమ్ చేయాలి ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉన్నప్పుడు వాటిని ముఖ్యంగా క్లెయిమ్‌ల సమయంలో చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. క్లెయిమ్‌ల నిబంధనల్లో ఐఆర్డీఏ సవరణలు చేయడంతో పాలసీదారులు ఈ విషయంలో చాలా అయోమయానికి గురవుతున్నారు. గతంలో ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉన్న వారి క్లెయిమ్‌ల విషయంలో బీమా రక్షణ మొత్తం ఆధారంగా క్లెయిమ్ మొత్తాన్ని పంచుకోవాలని ఐఆర్డీఏ నిబంధనలు సూచించేవి. ఈ విధానం కొద్దిగా క్లిష్టతరమైనది కావడంతో దీన్ని సవరిస్తూ మరింత సులభంగా క్లెయిమ్ విధానాన్ని ఐఆర్డీఏ ప్రవేశపెట్టింది. తీసుకున్న పాలసీ మొత్తం కంటే క్లెయిమ్ మొత్తం చిన్నదైతే, ఈ క్లెయిమ్ మొత్తాన్ని అన్ని బీమా కంపెనీలు పంచుకోవాలన్న నిబంధన వర్తించదు. తీసుకున్న పాలసీ కంటే క్లెయిమ్ మొత్తం అధికమైతే అప్పుడు ఈ మొత్తాన్ని ఇతర బీమా కంపెనీలూ పంచుకుంటాయి. ఏ బీమా కంపెనీ పాలసీని క్లెయిమ్‌కు వినియోగించుకోవాలన్న విషయంలో పాలసీదారునికి పూర్తి స్వేచ్ఛ ఉంది. క్లెయిమ్ మొత్తం తక్కువగా ఉంటే.. ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య పాలసీలు ఉండి, క్లెయిమ్ మొత్తం తీసుకున్న పాలసీ బీమా రక్షణ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని ఒకే కంపెనీ నుంచి పొం దచ్చు. ఇటువంటి సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు పరిశీలిద్దాం... * హాస్పిటల్లో చేరిన వెంటనే ఆ విషయాన్ని బీమా కంపెనీకి తెలియచేయాలి * రీ-యింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ ఫామ్ పూర్తి చేసి, దానికి అన్ని బిల్లులు, డాక్యుమెంట్లు జత చేయండి. * క్లెయిమ్‌కు దాఖలు చేసిన తర్వాత టీపీఏతో కాని, బీమా కంపెనీకి కాని అందుబాటులో ఉండాలి. వారు ఏమైనా అదనపు సమాచారం అడిగితే వాటిని ఇవ్వాలి. * గరిష్టంగా 30-40 రోజుల్లో క్లెయిమ్ మొత్తం మీ చేతికి అందుతుంది. రెండు మూడు కంపెనీలతో అయితే.. క్లెయిమ్ మొత్తం అధికంగా ఉంటే ఈ మొత్తాన్ని కేవలం ఒక కంపెనీ కాకుండా ఇతర కంపెనీలు కూడా పాలు పంచుకుంటాయి. ఇటువంటి సమయంలో ఈ జాగ్రత్తలు పాటించడం మర్చిపోవద్దు. * హాస్పిటల్లో చేరిన వెంటనే ఈ విషయాన్ని మీరు పాలసీ తీసుకున్న అన్ని కంపెనీలకు తెలియచేయాలి. * మొదట ఏ కంపెనీ నుంచి క్లెయిమ్ పొందాలనుకుంటున్నారో అది మీరే ఎంచుకోవచ్చు. * క్లెయిమ్ ఫామ్ పూర్తి చేసి దానికి అవసరమైన అన్ని బిల్లులు, కాగితాలు ఒరిజినల్స్ జతపర్చండి. * ఈ బిల్లు కాగితాలను జిరాక్స్ తీసుకొని వాటిని అటెస్ట్ చేయించి మిగిలిన బీమా కంపెనీలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంచుకోండి * మొదటి కంపెనీ నుంచి క్లెయిమ్ పూర్తయిన తర్వాత ఈ క్లెయిమ్ కాపీని జత చేసి రెండో కంపెనీకి క్లెయిమ్ దరఖాస్తు చేసుకోవాలి. * మొదటి కంపెనీ నుంచి క్లెయిమ్ మొత్తాన్ని పొందినట్టు దానికి సంబంధించిన కాగితాలను జత చేసినట్లు తెలియచేస్తూ ఒక కవరింగ్ లెటర్ రాయండి. * మూడో కంపెనీకి కూడా క్లెయిమ్ చేయాల్సి వస్తే.. పై విధానాన్నే అనుసరించండి. -
ఆరోగ్య బీమా.. జాగ్రత్త సుమా
ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది మనకు బీమా అవసరం రాకముందుగానే పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. మనకు అవసరం పడినప్పుడు వైద్య బీమా లభించకపోవచ్చు. కనుక.. యుక్త వయసులో, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వైద్య బీమా పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియానికే అధిక కవరేజి లభిస్తుంది. వయసు మీద పడ్డ తర్వాత కన్నా యుక్త వయసులో పాలసీ తీసుకున్నప్పుడు విస్తృతమైన కవరేజి లభిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ.. ప్రీమియంలు పెరుగుతాయి. ఒకవేళ అప్పటికే ఏదైనా అనారోగ్యం బారిన పడిన పక్షంలో, సదరు అనారోగ్యానికి కవరేజి లభించదు. ఫలితంగా మొత్తం పాలసీనే నిరర్థకమవుతుంది. చాలా కంపెనీల హెల్త్ ప్లాన్లకు నిర్దిష్టమైన ఎంట్రీ వయసుపై పరిమితి ఉంటుంది. అంటే, రిటైర్మెంట్ దగ్గరపడుతున్న కొద్దీ కవరేజీ పరిధి తగ్గిపోతుంటుంది. మరో విషయం.. ఏదైనా సంవత్సరంలో క్లెయిము చేయకపోయిన పక్షంలో పాలసీని రెన్యువల్ చే సుకునేటప్పుడు నో క్లెయిమ్ బోనస్ కూడా లభిస్తుంది. పన్ను ప్రయోజనాలు ఉంటాయి..కానీ.. వైద్య బీమా కోసం కట్టే ప్రీమియంల మీద పన్నుపరమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80డీ కింద ఈ ప్రీమియాలకు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. మీ వయసు 65 ఏళ్ల కన్నా తక్కువ ఉంటే.. మీకు, మీ జీవిత భాగస్వామి, పిల్లలు, మీ తల్లిదండ్రుల కోసం కట్టే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద రూ. 15,000 దాకా మినహాయింపులను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అంతే కాదు.. తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయి ఉండి, వారికీ కవరేజీ ఉండేలా తీసుకున్న పక్షంలో గరిష్టంగా రూ. 20,000 దాకా పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, కేవలం పన్ను ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకూడదు. మీకెంత కవరేజీ అవసరమవుతుందో ముందు అంచనా వేసుకోవాలి. ఇందుకోసం కావాలంటే బీమా సలహాదారు సహాయం తీసుకోవడం మంచిది. హెల్త్ ఇన్సూరెన్స్‌లో వివిధ రకాల కవరేజీలు ప్రధానంగా రెండు రకాల వైద్య బీమా కవరేజీలు ఉన్నాయి. అవి.. వ్యక్తిగత వైద్య బీమా ఇది చాలా సింపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం. పాలసీదారు ఆస్పత్రి పాలైనప్పుడు సమ్ అష్యూర్డ్ పరిమితి దాకా బీమా కవరేజి లభిస్తుంది. ఉదాహరణకు.. నలుగురు సభ్యులున్న కుటుంబంలో ఒక్కొక్కరు విడిగా రూ. 3 లక్షలకు వైద్య బీమా తీసుకున్నారనుకుందాం. అప్పుడు చికిత్సా వ్యయం రూ.3 లక్షలు దాటినా కవరేజ్ కేవలం సమ్ అష్యూర్డ్ రూ.3 లక్షల వరకే లభిస్తుంది. అంతేకాని నలుగురుకి కలిపి రూ.12 లక్షల వరకు బీమా ఉన్నా దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేము. అలా కాకుండా కుటుంబంలోని నలుగురు సభ్యులు ఒకేసారి ఆసుపత్రిపాలైతే మాత్రం ఒక్కొక్కరు వ్యక్తిగతంగా రూ. 3 లక్షలు చొప్పున మొత్తం రూ.12 లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్.. హెల్త్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఇది మరింత మెరుగైన పథకం. ఇది కుటుంబ సభ్యులందరికీ కూడా కవరేజీని అందిస్తుంది. సమ్ అష్యూర్డ్ పరిమితి దాకా మొత్తం కుటుంబానికి కవరే జీ లభిస్తుంది. ఒక్కొక్కరికీ ఒక్కో పథకం తీసుకున్న దానికన్నా అందరికీ కలిపి వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుంటే ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు.. మీ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారనుకుందాం. అందరికీ కలిపి రూ. 5 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్‌ను తీసుకోవచ్చు. ఇప్పుడు కుటుంబంలోని ఒక్కొక్కరికీ గరిష్టంగా రూ. 5 లక్షల దాకా కవరేజీ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఆస్పత్రి పాలై, వైద్య ఖర్చులు రూ. 3 లక్షలు అయ్యాయనుకుంటే.. ఆ మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. మొత్తం కుటుంబం గురించి ఆలోచించినప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే, తక్కువ ప్రీమియంతో ఒకే ప్లాన్ ద్వారా అందరికీ పెద్ద ఎత్తున కవరేజీ లభిస్తుంది. పైగా.. అంతా ఒకేసారి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి, ఇది మరింత లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి, మీకు అనువైన హెల్త్ పాలసీని సాధ్యమైనంత త్వరగా తీసుకోవడం ఉత్తమం. మీకు అవసరం రాక ముందే పాలసీ కొనుక్కోండి.. అదీ యుక్తవయసులోనే తీసుకోండి. గ్రూప్ మెడిక్లెయిమ్.. ఎంత ఉపయోగం.. ప్రస్తుతం చాలా సంస్థలు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని కల్పిస్తున్నాయి. అయినప్పటికీ.. మీరు వ్యక్తిగతంగా వైద్య బీమా తీసుకుని ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే .. గ్రూప్ మెడిక్లెయిమ్ కింద కంపెనీ నుంచి బీమా కవరేజి లభించినప్పటికీ.. ఇలాంటి పాలసీల్లో సమ్ అష్యూర్డ్ పరిమాణం తక్కువగానే ఉంటుంది. వైద్య బీమా ఖర్చులు ఏటా పెరిగిపోతున్న నేపథ్యంలో తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఈ కవరేజీ సరిపోకపోవచ్చు. ఒకవేళ మీ కంపెనీ గానీ బీమా పాలసీల వ్యయాలను తగ్గించుకోవాలనుకున్న పక్షంలో మొత్తానికే కవరేజీ లేకుండా పోవచ్చు. పలు గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీల్లో ఉండే నిర్దిష్ట నిబంధనల వల్ల కొన్ని సందర్భాల్లో పాలసీదారు సొంత జేబు నుంచి కొంత కట్టుకోవాల్సి కూడా రావొచ్చు. ప్రీమియం విషయంలో వయసు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వయసు పెరిగిన కొద్దీ.. ప్రీమియం పెరుగుతూ పోతుంది. కాబట్టి.. పర్సనల్ హెల్త్ పాలసీ ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది. -
'బీమా జాబితాలో జబ్బు లేదని.. రీయింబర్స్మెంట్ నిరాకరించొద్దు'
వైద్య బీమా విషయంలో బీమా కంపెనీలు అనుసురిస్తున్న విధానంపై మద్రాస్ హైకోర్టు తలంటేసింది. బీమా జాబితాలో జబ్బు లేనంత మాత్రాన.. బీమా చేయించుకున్నవారికి చికిత్స ఖర్చులు నిరాకరించడానికి వీల్లేదని రూలింగ్ ఇచ్చింది. ఎవరైనా వ్యక్తికి తగిన వైద్య బీమా పాలసీ ఉండి.. వాళ్లు గుర్తింపు ఉన్న ఆస్పత్రిలోనే చికిత్స పొందినప్పుడు, వాళ్లకు ఖర్చులు తిరిగి ఇవ్వడానికి నిరాకరించకూడదని జస్టిస్ టి.రాజా స్పష్టం చేశారు. చెన్నై అన్నామంగళం ప్రాంతానికి చెందిన లిటిల్ ఫ్లవర్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో అసిస్టెంటుగా పనిచేస్తున్న జి.సైమన్ క్రిస్టూడస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది. బీమా జాబితాలో ఆయనకున్న వ్యాధి కవర్ కాదన్న కారణంతో జిల్లా విద్యా శాఖాధికారి ఖర్చులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించినట్లు బాధితుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కంటి నరాలపై ఒత్తిడి పెరగడం వల్ల చూపు తగ్గడంతో శస్త్రచికిత్స చేయించుకోగా దానికి 1.17 లక్షల రూపాయల ఖర్చయింది. కానీ ఆ వ్యాధి లేదన్న కారణంతో సైమన్ బిల్లులను చెల్లించేందుకు డీఈవో నిరాకరించారు. దీన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. 8 శాతం వడ్డీతో సహా బిల్లు మొత్తాన్ని సైమన్‌కు చెల్లించాలని ఆదేశించారు.