రెండు కొత్త విమాన నర్వీసులు ప్రారంభించిన జెట్ ఎయిర్‌వేస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జెట్ ఎయిర్‌వేస్ 2 కొత్త విమాన సర్వీసులను ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు పుణే మీదుగా, అహ్మదాబాద్ నుంచి భోపాల్/ఇండోర్‌కు రెండు సర్వీసులను ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం మినహా మిగతా రోజుల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 9డబ్ల్యూ 2822 జెట్ ఎయిర్‌వేస్ విమానం హైదరాబాద్‌లో ఉదయం 5:45 గంటలకు ప్రారంభమై.. ఉదయం 7:20 గంటలకు పూణె చేరుకుంటుంది.
అక్కడ తిరిగి ఉదయం 7:50 గంటలకు ప్రారంభమై.. అహ్మదాబాద్‌కు ఉదయం 9:40 గంటలకు చేరుకుంటుంది. అలాగే 9డబ్ల్యూ 2821 విమానం సాయంత్రం 5:15కు ప్రారంభమై.. పూణెకు సాయంత్రం 6:55కు చేరుకుంటుంది. తిరిగి ఇక్కడ రాత్రి 7:35కు ప్రారంభమై.. హైదరాబాద్‌కు రాత్రి 9:25కు చేరుకుంటుంది. 9డబ్ల్యూ 2516 జెట్ ఎయిర్ విమానం అహ్మదాబాద్‌లో ఉదయం 10:15 గంటలకు ప్రారంభమై.. ఉదయం 11:40 గంటలకు భోపాల్‌కు చేరుకుంటుంది.
ఇక్కడి నుంచి మధ్యాహ్నం 12:10 గంటలకు ప్రారంభ మై.. ఇండోర్‌కు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటుంది. అలాగే 9డబ్ల్యూ 2516 విమానం ఇండోర్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమై అహ్మదాబాద్‌కు మధ్యాహ్నం 2:50 గంటలకు చేరుకుంటుంది.
హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు..
Published Tue, Apr 28 2015 1:22 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM
Advertisement
Advertisement