హైసియా కార్యవర్గం ఎంపిక | hysea chosen executive members group | Sakshi
Sakshi News home page

హైసియా కార్యవర్గం ఎంపిక

Published Fri, Jun 10 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

హైసియా కార్యవర్గం ఎంపిక

హైసియా కార్యవర్గం ఎంపిక

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హై సియా) ఐదుగురు కార్యవర్గం సభ్యుల బృందం ఎంపికైంది. గురువారమిక్కడ జరిగిన తొలి సమావేశంలో 2016-18 రెండేళ్ల కాల పరమితి గల ఈ బృందాన్ని ఎంపిక చేసినట్లు హైసియా ప్రెసిడెంట్‌గా ఇటీవలే కొత్తగా ఎంపికైన రంగా పోతుల ఒక ప్రకటనలో తెలిపారు. వైస్ ప్రెసిడెంట్లుగా జెన్‌క్యూ సీఈఓ మురళీ బొల్లు, ఎస్‌బీయూ (ఇండియా) మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ హెడ్ హెచ్ ఆర్ శ్రీనివాస్‌రావులు, సెక్రటరీగా బట్లర్ అమెరికా ఇండియా ఆపరేషన్ అండ్ గ్లోబల్ ఐటీ/బీపీఓ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ భరణి కే ఆరోల్, ట్రెజరర్‌గా సీ3ఐ సపోర్ట్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ పద్మజా చౌదరి, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కే హరికుమార్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement