executive members group
-
నూతనంగా ఎర్పాటైన ఆటా బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. లాస్ వేగాస్లోని ది మిరాగ్ లో శనివారిం జరిగిన ఆటా బోర్డు మీటింగ్ లో ప్రస్తుత అధ్యక్షులు భువనేశ్ భూజల చేతుల మీదుగా మధు బొమ్మినేని నూతన అధ్య క్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశానికి యూఎస్ లోని అన్ని ప్రాంతాల నిండి ఆటా డైరెక్టర్లు, సలహాదారులు, మాజీ అధ్యక్షులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. నార్తు కరోలినా ప్రాంతానికి చెందిన మధు బొమ్మినేని 2004 నిండి ’ఆటా’ లో చురుగ్గా ఉిండడంతో పాటు, ఆటా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి అనేక పదవుల్లో సేవలందించారు. 2023 జనవరిలో ఆటాలోని 16 బోర్తుఆఫ్ ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు జరిగాయ. ఎన్నికైన సభ్యులు నాలుగేండ్లు పాటు పదవిలో కొనసాగుతున్నారు. అనిల్ బొదిరెడ్డి, సన్నిరెడ్డి, కిరణ్ పాశం, కిషోర్ గూడూరు, మహీదర్ ముస్కుల, నర్సిరెడ్డి గడి కొప్పుల, రామకృష్ణారెడ్డి అల, రాజు కక్కెర్ల, సాయి సుధిని, శ్రీకాంత్ గుడిపాటి, నర్సింహారెడ్డి ధ్యాసాని, రఘవీర్ మరిపెద్ది, సాయినాథ్ బోయపల్లి, సతీష్‌రెడ్డి, శ్రీనివాస్ దర్గుల, వినోద్ కోడూరు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆటా బోర్డు ఏకగ్రీవంగా జయింత్ చల్లాను కాబోయే ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంది. ఆటా బోర్డు 2023, 2024 టర్మ్‌కి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి అల (కార్యదర్శి), సతీష్ రెడ్డి (కోశాధికారి), తిరుపతి రెడ్డి యర్రంరెడ్డి ( జాయింట్ సెక్రటరీ), రవీందర్ గూడూరు (జాయింట్ ట్రెజరర్), హరి ప్రసాద్ రెడ్డి లింగాల (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)గా ఎన్నికయ్యారు. -
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ‘చాడ’
మంకమ్మతోట(కరీంనగర్) : సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులుగా జిల్లాకు చెందిన చాడ వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేరళ రాష్ట్రం కొల్లంలో జరుగుతున్న పార్టీ జాతీయ మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. ఈనెల 25 నుంచి 29వరకు సీపీఐ జాతీయ మహాసభలు నిర్వహించిన విషయం తెల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీపీఐ ప్రథమ మహాసభలను 2015 మార్చిలో ఖమ్మంలో ఏర్పాటు చేసింది. ఆ సమయంలో రాష్ట్ర కార్యదర్శిగా మొదటిసారిగా ప్రతినిధుల సమక్షంలో ఏకగ్రీవమయ్యారు. అలాగే 2016 నవంబర్‌లో వరంగల్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర నిర్మాణ మహాసభలో చాడను ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. 2018 ఏప్రిల్ 1 నుంచి 4 వరకు హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రెండో రాష్ట్ర మహాసభల్లో రెండోసారి కూడా రాష్ట్ర కార్యదర్శిగా చాడను ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. రాజకీయ ప్రస్థానం.. చాడ వెంకటరెడ్డి స్వగ్రామం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి జిల్లాలోని రేకొండ. 40 ఏళ్లుగా ఆయన రాజకీయంలో కొనసాగుతున్నారు. 1981లో రేకొండ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1987 నుంచి వరుసగా మూడుసార్లు చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. అదేమండలం నుంచి ఒక్కసారి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. సీపీఐ తాలుకా కార్యదర్శి నుంచి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీ తరఫున శాసనసభపక్ష నేతగా వ్యవహరించారు. ప్రస్తుతం.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూనే.. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. చాడ ఎన్నికపట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. -
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చాడ
హుస్నాబాద్ (సిద్దిపేట): సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చాడ వెంకట్‌రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. కేరళ రాష్ట్రంలోని కొల్లంలో సీపీఐ 23వ జాతీయ మహాసభలు ఈ నెల 25 నుంచి 29 వరకు నిర్వహించారు. ఈ మహాసభల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నిక కావడం ఇది రెండోసారి. 2014లో మొదటిసారిగా చాడ వెంకట్‌రెడ్డిని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 2018 ఏప్రిల్ 1 నుంచి 4 వరకు హైదరాబాద్‌లో జరిగిన సీపీఐ మహాసభల్లో తిరిగి రెండోసారి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. చాడ వెంకట్‌రెడ్డి ఎన్నికపై సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బద్దిపడిగ రాజిరెడ్డి, గురాల హన్మిరెడ్డి, ఎనగందుల లక్ష్మీనారాయణ, నాయకులు దుర్గేశం, పొదిల కుమారస్వామి, మాడిశెట్టి శ్రీధర్, సంజీవరెడ్డి, రాంరెడ్డి, మల్లారెడ్డి, రాజ్‌కుమార్, కర్ణకంటి నరేష్‌లు హర్షం వ్యక్తం చేశారు. -
హైసియా కార్యవర్గం ఎంపిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హై సియా) ఐదుగురు కార్యవర్గం సభ్యుల బృందం ఎంపికైంది. గురువారమిక్కడ జరిగిన తొలి సమావేశంలో 2016-18 రెండేళ్ల కాల పరమితి గల ఈ బృందాన్ని ఎంపిక చేసినట్లు హైసియా ప్రెసిడెంట్‌గా ఇటీవలే కొత్తగా ఎంపికైన రంగా పోతుల ఒక ప్రకటనలో తెలిపారు. వైస్ ప్రెసిడెంట్లుగా జెన్‌క్యూ సీఈఓ మురళీ బొల్లు, ఎస్‌బీయూ (ఇండియా) మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ హెడ్ హెచ్ ఆర్ శ్రీనివాస్‌రావులు, సెక్రటరీగా బట్లర్ అమెరికా ఇండియా ఆపరేషన్ అండ్ గ్లోబల్ ఐటీ/బీపీఓ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ భరణి కే ఆరోల్, ట్రెజరర్‌గా సీ3ఐ సపోర్ట్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ పద్మజా చౌదరి, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కే హరికుమార్లున్నారు.