
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10.. కొత్త వేరియంట్
• పెట్రోల్ కార్ల ధరలు రూ.4.58– రూ.6.82 లక్షల రేంజ్‌లో
• డీజిల్ కార్ల ధరలు రూ.5.68– రూ.7.32 లక్షల రేంజ్‌లో
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ గ్రాండ్ ఐ10లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్‌లో పెట్రోల్ ఇంజిన్ కార్ల ధరలు రూ.4.58 లక్షల నుంచి రూ.6.82 లక్షల రేంజ్‌లో, డీజిల్ ఇంజిన్ కార్ల ధరలు రూ.5.68 లక్షల నుంచి రూ.7.32 లక్షల రేంజ్(అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది.
భారత్‌లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా గ్రాండ్ ఐ10 కార్లు 5.5 లక్షలకు పైగా అమ్ముడయ్యాయని కంపెనీ ఎండీ, సీఈఓ వై.కె. కూ చెప్పారు. ఈ తాజా వేరియంట్‌లో ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, కొత్త అలాయ్ వీల్స్, ముందు వైపు ఎయిర్ కర్టెన్స్, వెనక ఏసీ వెంట్స్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ తదితర ఫీచర్లున్నాయని వివరించారు.