i10
-
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ ప్రీమియమ్ హ్యాచ్‌బాక్, గ్రాండ్ ఐ10 నియోస్‌లో రెండు కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చింది. ఈ వేరియంట్లను 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో, బీఎస్–సిక్స్ ప్రమాణాలతో రూపొందించామని కంపెనీ తెలిపింది. స్పోట్జ్ వేరియంట్ ధర రూ.7.68 లక్షలని. స్పోట్జ్(డ్యుయల్ టోన్) వేరియంట్ ధర రూ.7.73 లక్షలు (ఈ రెండు ధరలు ఎక్స్ షోరూమ్) అని పేర్కొంది. ఈ కంపనీ ఈ మోడల్‌ను పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్లలలో విక్రయిస్తోంది. -
హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది
గౌహతి: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘హ్యుందాయ్’ అతిత్వరలో తన సరికొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ‘కోనా’ పేరుతో ఈ కారు జూలైలో విడుదలకు సిద్ధంగా ఉంది. చెన్నైలోని ఉత్పత్తి ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ కారు అసెంబ్లింగ్ జరుగుతోందని ఇక్కడి అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) బుధవారం ఒక ప్రకటన చేసింది. ఈ అంశంపై మాట్లాడిన సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్, గ్రూప్ హెడ్ (మార్కెటింగ్) పునీత్ ఆనంద్.. ‘భారత రోడ్లపై హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు దూసుకురానుంది. మరోవైపు పండుగ సీజన్లో గ్రాండ్ ఐ10 నూతన మోడల్‌ను ప్రవేశపెట్టనున్నాం. కాంపాక్ట్ ఎస్యూవీ ‘వెన్యూ’ కారుకు 20,000 బుకింగ్స్ పూర్తయ్యాయి. ఈ కారు నిరీక్షణ కాలం 3–4 నెలలుగా ఉంది. చెన్నై ప్లాంట్‌లో నెలకు 7,000 వెన్యూ కార్ల ఉత్పత్తి జరుగుతుండగా.. దీనిని 10,000కు పెంచనున్నాం’ అని చెప్పారు. -
హ్యుందాయ్ ఐ10 కార్ల తయారీకి బ్రేక్
-
హ్యుందాయ్ ఐ10 కార్ల తయారీకి బ్రేక్
న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ ఐ10 కార్ల తయారీని ఆపేసింది. ధర అధికంగా ఉన్న, అధునాతన కార్ల మోడళ్లపై దృష్టి సారిస్తున్నందున ఐ10 కార్లను ఇక తయారు చేయబోమని హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఈ చిన్న కారును హ్యుందాయ్ కంపెనీ 2007లో మార్కెట్లోకి తెచ్చింది. దేశీయంగానూ, విదేశాల్లోనూ ఇప్పటిదాకా 16.95 లక్షల హ్యుందాయ్ ఐ10 కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లో హ్యుందాయ్ స్థానాన్ని సుస్థిరం చేయడంలో ఐ10 కారుది కీలకపాత్ర. -
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10.. కొత్త వేరియంట్
• పెట్రోల్ కార్ల ధరలు రూ.4.58– రూ.6.82 లక్షల రేంజ్లో • డీజిల్ కార్ల ధరలు రూ.5.68– రూ.7.32 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ గ్రాండ్ ఐ10లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్లో పెట్రోల్ ఇంజిన్ కార్ల ధరలు రూ.4.58 లక్షల నుంచి రూ.6.82 లక్షల రేంజ్లో, డీజిల్ ఇంజిన్ కార్ల ధరలు రూ.5.68 లక్షల నుంచి రూ.7.32 లక్షల రేంజ్(అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. భారత్‌లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా గ్రాండ్ ఐ10 కార్లు 5.5 లక్షలకు పైగా అమ్ముడయ్యాయని కంపెనీ ఎండీ, సీఈఓ వై.కె. కూ చెప్పారు. ఈ తాజా వేరియంట్లో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, కొత్త అలాయ్ వీల్స్, ముందు వైపు ఎయిర్ కర్టెన్స్, వెనక ఏసీ వెంట్స్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ తదితర ఫీచర్లున్నాయని వివరించారు.