సాక్షి, ముంబై: దేశీయ ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐకు వరుస షాక్‌లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. దేశీయ ఎలక్ట్రానిక్స్ సంస్థ వీడియోకాన్‌కు మంజూరు చేసిన రుణాలకు సంబంధించి కేసు నమోదు, సీబీఐ ప్రాథమిక దర్యాప్తు నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఐసీఐసీఐ షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దాదాపు 6శాతం (5.6) పతనాన్ని నమోదు చేసింది. దీనికితోడు సెక్యూరిటీ విక్రయాల అంశంలో నియమాలను పాటించని కారణంగా ఆర్‌బీఐ విధించిన 58.9 కోట్ల రూపాయల జరిమానా కూడా ఐసీఐసీఐసీ బ్యాంకు నెత్తిన పిడుగులా పడింది. మరోవైపు దివాళా బాటలో వీడియోకాన్ షేరు సైతం 5 శాతంనష్టపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకడం గమనార్హం.
కాగా వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేసిన అంశంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ పాత్రపై సీబీఐ విచారణ చేపట్టింది. వీడియోకాన్ గ్రూప్‌నకు వేలకోట్ల రుణాలిచ్చినందుకు గాను భారీ లబ్ది పొందారన్న ఆరోపణల నేపథ్యంలో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూతపై సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ(పీఈ) చేపట్టింది. వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలు విడుదల చేయడంలో క్విడ్‌ప్రో కో జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment