ప్రపంచంలో టాప్ విద్యుదుత్పత్తి కంపెనీ ఎన్‌టీపీసీ | In world power generation company NTPC top | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో టాప్ విద్యుదుత్పత్తి కంపెనీ ఎన్‌టీపీసీ

Published Tue, Sep 22 2015 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM

ప్రపంచంలో టాప్ విద్యుదుత్పత్తి కంపెనీ ఎన్‌టీపీసీ

ప్రపంచంలో టాప్ విద్యుదుత్పత్తి కంపెనీ ఎన్‌టీపీసీ

హైదరాబాద్: ఎన్‌టీపీసీ సంస్థ గత ఏడాది ప్రపంచంలోనే అగ్ర శ్రేణి విద్యుదుత్పత్తి సంస్థ(ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్-ఐపీపీ)గా అవతరించింది. ప్లాట్స్ సంస్థ రూపొందించిన నివేదికలో తాము ఈ ఘనత సాధించామని ఎన్‌టీపీసీ ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ ఏడాది సెప్టెంబర్ 10 నాటికి తమ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 45,548 మెగావాట్లకు చేరిందని, భారత్‌లో స్థాపిత, విద్యుదుత్పత్తి సామర్థ్యాల్లో అగ్రస్థానం తమదేనని పేర్కొంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాదికి రూపొందించిన గ్లోబల్ 2000 కంపెనీల జాబితాలో తమ స్థానం 431 అని తెలిపింది. 2032 కల్లా 128 గిగావాట్ల విద్యుదుత్పత్తి సాధించడం లక్ష్యమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.75,362 కోట్ల ఆదాయాన్ని, రూ.10,291  కోట్ల నికర లాభాన్ని ఆర్జించామని తెలిపింది. ఈ ఏడాది మార్చి 31నాటికి రూ.1,97,000 కోట్ల ఆస్తులున్నాయని వివరించింది. గత 22 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా డివిడెండ్‌లు చెల్లిస్తున్నామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement