top level
-
‘టాప్’ లెవెల్లో డేం‘జర్నీ’
‘సురక్షితం, సుఖవంతం’.. ఇది ఆర్టీసీ నినాదం. అయితే ఈ చిత్రం చూస్తుంటే ఆ సంస్థ తన నినాదాన్ని తానే గౌరవించడం లేదనిపించక మానదు. ఆటోలు, జీపుల వంటి ప్రైవేట్ వాహనాల వారికి ప్రయాణికుల భద్రతకు సంబంధించి అణుమాత్రం స్పృహ కనిపించదు. వాహనాల సామరŠాథ్యనికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. లోపల ఖాళీ లేకపోతే.. కొందరు కమ్మీలను పట్టుకుని వేలాడుతుండగానో, టాపులపై కూర్చుండగానో వాహనాలను నడిపేస్తుంటారు. సోమవారం భద్రాచలం నుంచి రావులపాలెం వెళుతున్న రావులపాలెం డిపోకు చెందిన ఏపీ29జెడ్ 3387 నంబర్ బస్సు లోపల మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. మారేడుమిల్లిలో ఓ యువకుడు బస్సుటాపుపైకి ఎక్కాడు. పలుచోట్ల విద్యుత్వైర్లు అతడు నిలబడితే తగిలేంత ఎత్తులోనే ఉన్నాయి. ‘ఆ యువకుడు టాపుపైకి మీకు తెలిసే ఎక్కాడా? తెలియకుండానా?’ అని డ్రైవర్, కండక్టర్లను అడిగితే పట్టించుకోకుండానే బస్సును లాగించేశారు. బస్సు పరుగందుకుంటుండగా ఆ యువకుడు సెల్ఫీ తీసుకోవడం కొసమెరుపు. – మారేడుమిల్లి -
ప్రపంచంలో టాప్ విద్యుదుత్పత్తి కంపెనీ ఎన్టీపీసీ
హైదరాబాద్: ఎన్టీపీసీ సంస్థ గత ఏడాది ప్రపంచంలోనే అగ్ర శ్రేణి విద్యుదుత్పత్తి సంస్థ(ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్-ఐపీపీ)గా అవతరించింది. ప్లాట్స్ సంస్థ రూపొందించిన నివేదికలో తాము ఈ ఘనత సాధించామని ఎన్టీపీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 10 నాటికి తమ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 45,548 మెగావాట్లకు చేరిందని, భారత్లో స్థాపిత, విద్యుదుత్పత్తి సామర్థ్యాల్లో అగ్రస్థానం తమదేనని పేర్కొంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాదికి రూపొందించిన గ్లోబల్ 2000 కంపెనీల జాబితాలో తమ స్థానం 431 అని తెలిపింది. 2032 కల్లా 128 గిగావాట్ల విద్యుదుత్పత్తి సాధించడం లక్ష్యమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.75,362 కోట్ల ఆదాయాన్ని, రూ.10,291 కోట్ల నికర లాభాన్ని ఆర్జించామని తెలిపింది. ఈ ఏడాది మార్చి 31నాటికి రూ.1,97,000 కోట్ల ఆస్తులున్నాయని వివరించింది. గత 22 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా డివిడెండ్లు చెల్లిస్తున్నామని పేర్కొంది.