న్యూఢిల్లీ: సులభతర వ్యాపార నిర్వహణ(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో భారత్ సత్తా చాటింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి ఈ ఏడాది ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన జాబితాలో భారత్ 77వ ర్యాంక్ సొంతం చేసుకుంది. గతేడాదితో పోల్చితే భారత్‌తీ ఏడాది 23 స్థానాలు ఎగబాకింది. గతేడాది కూడా భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 100వ స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా వాణిజ్య రంగంలో అమలవుతున్న సంస్కరణల ఫలితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఈ ర్యాకింగ్స్‌కు ప్రపంచ బ్యాంక్ 10 అంశాలను పరిగణలోకి తీసుకుంటుండగా.. వాటిలో 6 అంశాల్లో భారత్ వృద్ధి కనబరిచింది.
గతేడాదిలాగే, ఈ సంవత్సరం కూడా భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వృద్ధి సాధిస్తున్న టాప్ 10 దేశాల్లో స్థానం దక్కించుకుంది. అదే విధంగా దక్షిణాసియా దేశాల్లో నంబర్ వన్ స్థానాన్ని సాధించింది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఆ దిశలో పలు సంస్కరణలు కూడా ప్రవేశపెట్టారు. అయితే, గడిచిన కొద్ది రోజులుగా పెట్రోలు, డిజీల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడంతో ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర‍్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం విఫలం అయిందని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న వేళ.. ఈ అంశం మోదీ సర్కార్‌కు కొంత ఊరట కలిగించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment