భారత్ టాప్ కంపెనీ ఆయనదే!
న్యూయార్క్ : ముఖేశ్ అంబానీ రిలయన్స్ పరిశ్రమలే భారత్ లో మరోసారి అత్యంత శక్తివంతమైన పబ్లిక్ కంపెనీలుగా నిలిచాయి. ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన 2,000 పబ్లిక్ కంపెనీల వార్షిక జాబితాలో 56 భారత కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. 586 కంపెనీలతో అమెరికా మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాపార ప్రకృతిలో అమెరికా, చైనాలే ఆధిప్యత స్థానంలో ఉన్నాయని ఫోర్బ్స్ తెలిపింది. జపాన్ టయోటా మోటార్ 10వ స్థానాన్ని మినహాయిస్తే మిగతా టాప్-10 స్థానాలన్నీ ఈ దేశాలే కలిగి ఉండి క్లీన్ స్వీప్ చేశాయని పేర్కొంది.
అయితే గతేడాది కంటే ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ జాబితాలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుందని ప్రకటించింది. గతేడాది 142గా ఉన్న రిలయన్స్ ర్యాంకు ఈ ఏడాది 121గా నమోదైంది. 5060 కోట్ల డాలర్ల మార్కెట్ విలువ, 915 కోట్ల ఆస్తులు కలిగి ఉండి, భారత్ లో ఇదే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన కంపెనీగా నిలిచిందని తెలిపింది. 2330 కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో రిలయన్స్ తర్వాతి స్థానాన్ని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా దక్కించుకుంది.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్(220), ఐసీఐసీఐ బ్యాంకు(266), ఇండియన్ ఆయిల్(371), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(385), ఎన్టీపీసీ(400), భారతీ ఎయిర్ టెల్(453), కోల్ ఇండియా(465) యాక్సిస్ బ్యాంకు(484), లార్సన్ అండ్ టర్బో(505), ఇన్ఫోసిస్(590), భారత్ పెట్రోలియం(650), విప్రో(755), ఐటీసీ(781), కొటక్ మహీంద్రా(899), మహింద్రా అండ్ మహింద్రా(901), హెచ్సీఎల్ టెక్నాలజీస్(943), టాటా స్టీల్(1178), అదానీ ఎంటర్ ప్రైజెస్(1993) కంపెనీలు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
అమెరికాలో అతిపెద్ద పబ్లిక్ కంపెనీలుగా వారెన్ బఫెట్ బెర్క్ సైర్ హాత్వే మొదటిస్థానంలో ఉండగా... టెక్నాలజీ దిగ్గజం యాపిల్ 8వ స్థానాన్ని, బ్యాంకు ఆఫ్ ఇండియా 11వ స్థానాన్ని, వాల్ మార్ట్ 15వ స్థానం, మైక్రోసాప్ట్ 23 వస్థానం దక్కించుకున్నాయి.