న్యూఢిల్లీ: ఎగుమతులు క్షీణబాట వీడలేదు. వరుసగా మూడవనెల మేలో మైనస్ 36.47 శాతం క్షీణించాయి (2019 మే నెల ఎగుమతుల విలువతో పోల్చి). 19.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే ఇక్కడ ఏప్రిల్‌తో (–60.28 శాతం) పోల్చితే క్షీణ రేటు మెరుగుపడ్డమే ఊరటనిచ్చే అంశం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం ఈ గణాంకాలను ఆవిష్కరించింది. కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
► పెట్రోలియం ఉత్పత్తులు (–68.46 శాతం) జౌళి (–66.19 శాతం), ఇంజనీరింగ్ (–24.25 శాతం), రత్నాలు–ఆభరణాల (–68.83 శాతం), తోలు (–75 శాతం) ఎగుమతులు క్షీణతను నమోదుచేసుకున్నాయి. ► మేలో దిగుమతులు మైనస్ 51% క్షీణతను నమోదుచేసుకుని, 22.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
► దీనితో ఎగుమతి–దిగుమతిల మధ్య నికర వ్యత్యాసం... వాణిజ్యలోటు 3.15 బిలియన్ డాలర్లుగా ఉంది. 2019 ఇదే నెల్లో 15.36 బిలియన్ డాలర్లు.
► మేలో ఒక్క చమురు దిగుమతుల విలువ మైనస్ 71.98 శాతం పతనమై, 3.49 బిలియన్ డాలర్లుగా ఉంది. 2019 మే నెలలో 12.44 బిలియన్ డాలర్లు. కాగా చమురుయేతర దిగుమతుల విలువ మైనస్ 43.13 శాతం క్షీణించి 18.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
► పసిడి దిగుమతులు 98.4% క్షీణించి 76.31 మిలియన్ డాలర్లకు దిగజారాయి.
ఏప్రిల్–మే చూస్తే...: 2020 ఏప్రిల్, మే నెలల్లో ఎగుమతులు మైనస్ 47.54% క్షీణించి, 29.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు మైనస్ 5.67% క్షీణించి 39.32 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 9.91 బిలియన్ డాలర్లుగా ఉంది.
శుభ సంకేతం...
మేలో దేశం మొత్తం దాదాపు లాక్‌డౌన్‌లో ఉన్న నేపథ్యంలోనూ ఎగుమతులు తక్కువగా క్షీణించడం (ఏప్రిల్‌తో పోల్చితే) శుభసంకేతం. జూన్ మొదటివారంలో ఎగుమతుల డేటా మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. 2019 ఇదే కాలంతో పోల్చితే జూన్ మొదటివారం ఎగుమతులు కేవలం మైనస్ 0.76 శాతం క్షీణతతో 4.94 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
– పియూష్ గోయెల్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి
ఎగుమతులు.. మూడోనెలా రివర్స్
Published Tue, Jun 16 2020 6:51 AM | Last Updated on Tue, Jun 16 2020 6:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment