
ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్, ఇండియామార్ట్ ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’... ఆమోదం తెలిపింది. ఈ కంపెనీతో పాటు అవన లాజిస్టెక్ కంపెనీ ఐపీఓకు కూడా సెబీ పచ్చజెండా ఊపింది. ఐపీఓలో భాగంగా ఇండియామార్ట్ కంపెనీ 42.88 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.600 కోట్లు సమీకరిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎడిల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జెఫరీస్ ఇండియాలు వ్యవహరిస్తాయి.
అవన లాజిసిస్టెక్ ఐపీఓ...
అవన లాజిస్టెక్ కంపెనీ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) మార్గంలో 43 లక్షల షేర్లను విక్రయించనున్నది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, కోల్డ్ స్టోరేజ్‌లు, గిడ్డంగిల నిర్మాణానికి, కంటైనర్ల కొనుగోళ్లకు వినియోగించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్ కంపెనీలు వ్యవహరిస్తాయి. ఈ రెండు కంపెనీల ఐపీఓలకు ఆమోదంతో ఈ ఏడాది సెబీ ఆమోదం తెలిపిన ఐపీఓల సంఖ్య 50కు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment