సాక్షి, చెన్నై: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఒబి) రుణాలపై వడ్డీరేట్టు తగ్గించింది. సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు ఊరట కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ కేటగిరీల్లో వడ్డీ రేట్లను 15-90 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంతేకాదు, బ్యాంకు లెటర్ ఆఫ్ క్రెడిట్ , బ్యాంక్ గ్యారంటీలపై కూడా కమిషన్‌ను తగ్గించినట్టు తగ్గించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
25 లక్షల రూపాయల నుంచి రూ.2 కోట్ల వరకు రుణాలపై వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గించగా. రూ.2 కోట్లకు పైన రుణాలపై ఆ యూనిట్ల రేటింగ్ ఆధారంగా వడ్డీరేటు 15 నుంచి 90 బేసిస్ పాయింట్లకు తగ్గించినట్టు పేర్కొంది. ఏప్రిల్ 1, 2018 నుంచి ఈ సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. తద్వారా దేశవ్యాప్తంగా 120మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తూ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న ఎంఎస్‌ఎంఈలకు మద్దుతుగా నిలిచింది. కాగా ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఐవోబీని చెన్నైలో 1937 లో స్థాపించారు. డిసెంబరు 2017 నాటికి 3342 శాఖలు , 3278 ఎటిఎంలతో సేవలను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment