కస్టమర్‌ సర్వీసుకే భారతీయుల ప్రాధాన్యం | Indians most savvy about using customer support tech | Sakshi
Sakshi News home page

కస్టమర్‌ సర్వీసుకే భారతీయుల ప్రాధాన్యం

Published Thu, Mar 23 2017 1:25 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

కస్టమర్‌ సర్వీసుకే భారతీయుల ప్రాధాన్యం - Sakshi

కస్టమర్‌ సర్వీసుకే భారతీయుల ప్రాధాన్యం

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2017 సర్వే
న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులు .. అత్యుత్తమ కస్టమర్‌ కేర్‌ సర్వీసులు అందించే సంస్థలకే పెద్ద పీట వేస్తారని ఆర్థిక సేవల సంస్థ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మెరుగైన సేవలు అందించే సంస్థల ఉత్పత్తులు, సర్వీసులు కొనుగోలు చేసేందుకు కాస్త ఎక్కువ మొత్తం వెచ్చించడానికి కూడా భారతీయులు వెనుకాడరని.. వీలైతే వాటి గురించి నలుగురికీ కాస్త మంచిగా చెప్పడం ద్వారా ప్రచారం కూడా ఇస్తారని సర్వే నివేదిక పేర్కొంది.

భారత్, అమెరికా, బ్రిటన్‌లతో పాటు తొమ్మిది దేశాల్లో నిర్వహించిన 2017 గ్లోబల్‌ కస్టమర్‌ సర్వీస్‌ బారోమీటర్‌ సర్వే వివరాలను అమెరికా ఎక్స్‌ప్రెస్‌ విడుదల చేసింది. భారత్‌లో వ్యాపార సంస్థలు నిలదొక్కుకోవాలంటే  మంచి ఉత్పత్తులతో పాటు కొనుగోలు అనంతర సేవలు అవసరమని వివరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement