ఊపందుకున్న జీడీపీ వృద్ధి రేటు
న్యూఢిల్లీ : భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు పెరిగింది. మార్చి త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు 7.9 శాతంగా నమోదైందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గత త్రైమాసికంలో ఈ రేటు 7.2 శాతంగా నమోదైంది. అదేవిధంగా మార్చి నెలతో ముగిసిన 2015-16 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదైందని ప్రభుత్వం గణాంకాలు ప్రకటించాయి. గత 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7.2 శాతంగానే ఉంది. అంచనావేసిన దానికంటే ఎక్కువగానే జీడీపీ వృద్ది రేటు ఊపందుకుందని ఆర్థిక నిపుణులు తెలిపారు.
కోర్ రంగ జోరు.. అదేవిధంగా కోర్ రంగ ఉత్పత్తి వరుసగా ఐదు నెల కూడా పెరిగింది. ఏప్రిల్ లో నెలల్లో ఈ రంగం 8.5శాతం వృద్ధి నమోదుచేసిందని వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.. మార్చి నెలల్లో ఈ రంగ వృద్ధి 6.4 శాతంగా నమోదైంది. అయితే గతేడాది ఇదే నెలలో ఈ రంగ వృద్ది 0.2 శాతం పడిపోయింది. ఎనిమిది పరిశ్రమ రంగాలు కోల్, క్రూడ్ ఆయిల్, నాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్ లు, ఫెర్టిలైజర్లు, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ లతో కోర్ సెక్టార్ ఇండెక్స్ ను కొలుస్తారు. పరిశ్రమ ఉత్పత్తిలో వీటి వాటా 38 శాతంగా ఉంటుంది. ఈ ఎనిమిది రంగాల్లో ఐదు రంగాలు పాజిటివ్ వృద్దినే నమోదుచేయడంతో ఏప్రిల్ నెలలో కోర్ రంగ వృద్ధి గత నెలకంటే 2.7శాతం పెరిగిందని గణాంకాలు తెలిపాయి.