ఆమ్ ఆద్మీ ఫ్లైట్ ఎగిరేది రేపే...
ఆమ్ ఆద్మీ ఫ్లైట్ ఎగిరేది రేపే...
Published Wed, Apr 26 2017 7:17 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలల విమానం రేపే ఎగురబోతుంది. 'ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్' (ఉడాన్) పేరుతో సామాన్యుడికి సైతం విమాయయోగం కల్పించాలని ఉద్దేశించి తీసుకొస్తున్న తొలి విమానాన్ని రేపు ప్రధాని ప్రారంభించబోతున్నారు. సిమ్లా నుంచి ఢిల్లీ మధ్య ప్రయాణాలకు ఈ విమాన పథకాన్ని ప్రధాని ప్రారంభించబోతున్నారని ఏవియేషన్ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఆర్సీఎస్ కింద తొలి ఉడాన్ విమానాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2017 ఏప్రిల్ 27న ప్రారంభించబోతున్నారని, ఈ కార్యక్రమంలో భాగంగానే కడప-హైదరాబాద్, నందేడ్-హైదరాబాద్ సెక్టార్లలోనూ ఉడాన్ విమానాలకు పచ్చ జెండా ఊపనున్నారని పీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ విమానంలో గంట జర్నీకి టిక్కెట్ ధర రూ.2500గా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రూట్లను బట్టి, విమాన ప్రయాణ వ్యవధి బట్టి టిక్కెట్ ధరలు మారుతుంటాయని పీఎంఓ పేర్కొంది. మార్కెట్ ఆధారిత మెకానిజంతో స్థానిక ప్రాంతాలకు కనెక్టివిటీ అందజేయడానికి గ్లోబల్ గా ప్రారంభించన తొలి విమానం ఉడానేనని పీఎంఓ ట్వీట్ చేసింది. 2016 అక్టోబర్ లో ఈ స్కీమ్ ను ఏవియేషన్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. 2016 జూన్ 15న విడుదల చేసిన నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీలో ఉడాన్ స్కీమ్ ఓ కీలక కాంపొనెంట్ అని ప్రభుత్వం పేర్కొంది. ఈ స్కీమ్ ను సిమ్లాలో మోదీ ప్రారంభిస్తారు. సిమ్లా పర్యటనలో భాగంగా చారిత్రక రిట్జ్ మైదాన్లో ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని అయ్యాక మోదీ తొలిసారి సిమ్లాలో పర్యటించనున్నారు. 2003లో హిమాచల్ ప్రదేశ్ ను మోదీ పర్యటించినప్పటికీ, అప్పుడు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నారు.
Advertisement