న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధిరేటు మార్చిలో 4.4 శాతంగా నమోదయ్యింది. గడచిన ఐదు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి నమోదుకాలేదు. క్యాపిటల్ గూడ్స్, మైనింగ్ పనులు తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఏప్రిల్‌లో ఈ రేటు 4.4 శాతంకాగా, గత ఏడాది ఇదే నెల్లో 4.4%ఉండటం గమనార్హం. ముఖ్యాంశాలివీ...
♦ సూచీలో దాదాపు 77 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి రేటు మార్చిలో 3.3 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగింది.
♦ ఇదే నెలలో మైనింగ్ రంగం వృద్ధి రేటు 10.1% నుంచి 2.8 శాతానికి పతనమైంది.
♦ ఇక విద్యుత్ రంగంలో వృద్ధి 6.2 శాతం నుంచి 5.9 శాతానికి పడిపోయింది.
♦ భారీ ఉత్పత్తుల తయారీ, డిమాండ్‌కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 9.4% నుంచి 1.8 శాతానికి పడింది.
♦ ఫ్రిజ్‌లు, టీవీల వంటి కన్జూమర్ డ్యూరబు ల్స్ వృద్ధి 0.6% నుంచి 2.9%కి పెరిగింది.
♦ సబ్బులు, టూత్‌పేస్టుల వంటి ఎఫ్‌ఎంసీజీ విభాగంలో వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 10.9 శాతానికి పెరిగింది.
ఆర్థిక సంవత్సరంలోనూ తగ్గిన వృద్ధి
2017–18 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 4.6 శాతం (2016–17) నుంచి 4.3 శాతానికి పడిపోయింది. 2017–18 మొత్తంగా చూస్తే, తయారీ రంగం వృద్ధి రేటు 4.4 శాతం నుంచి 4.5 శాతానికి పెరిగింది. మైనింగ్ రంగంలో వృద్ధిరేటు 5.3% నుంచి 2.3 శాతానికి తగ్గింది.
ఐదు నెలల దిగువకు పారిశ్రామిక ఉత్పత్తి
Published Sat, May 12 2018 1:38 AM | Last Updated on Sat, May 12 2018 8:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment