వృద్ధి రేటు 4.3 శాతానికి డౌన్
2023 ఇదే నెల్లో పురోగతి 7.9%
న్యూఢిల్లీ: ఎనిమిది ప్రధాన మౌలిక రంగాల గ్రూప్ ఉత్పత్తి వృద్ధి రేటు నవంబర్‌లో 4.3 శాతంగా నమోదయ్యింది. గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 7.9 శాతం వృద్ధితో పోలిస్తే ఈ రేటు తగ్గుదల నమోదుకావడం గమనార్హం. అయితే 2024 అక్టోబర్ 3.7 శాతం వృద్ధితో పోలిస్తే ఇది మెరుగైన ఫలితం.
సిమెంట్ మినహా (13 శాతం వృద్ధి), బొగ్గు (7.5 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (2.9 శాతం), ఎరువులు (2.0 శాతం), ఉక్కు (4.8 శాతం), విద్యుత్ (3.8 శాతం) రంగాలు 2023 నవంబర్‌తో పోల్చితే వృద్ధి రేట్లు తగ్గాయి. చమురు, సహజవాయువు రంగాల్లో వృద్ధి లేకపోగా క్షీణరేట్లు నమోదయ్యాయి.
ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య..
ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో (2024 ఏప్రిల్–నవంబర్) మౌలిక రంగం గ్రూప్ వృద్ది రేటు 4.2 శాతంగా నమోదయ్యింది. 2023 ఇదే కాలంతో పోల్చితే (8.7 శాతం) వృద్ధి రేటు సగానికిపైగా పడిపోవడం గమనార్హం. మొత్తం పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా 40.27 శాతం కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment