
న్యూఢిల్లీ: దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ భారీస్థాయిలో అమెరికా పౌరులకు ఉద్యోగాలను కల్పించింది. 2017 మార్చి నుంచి ఇప్పటి వరకు తమ సంస్థలో 4,700 మంది యూఎస్ పౌరులను నియమించుకున్నట్లు ప్రకటించింది. వీరిలో 500 మంది ఉత్తర కరొలినా రాజధాని రాలీగ్‌లో ఉన్నటువంటి ప్రాంతీయ సాంకేతిక కేంద్రంలో నియమితులైనట్లు తెలిపింది.
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), క్లౌడ్, బిగ్ డేటా, డిజిటల్ టెక్నాలజీస్, యూజర్ అనుభవం, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ టెక్నాలజీలపై మరింత దృష్టిసారించడంలో భాగంగా బహుళ సాంకేతికత, ఆవిష్కరణ కేంద్రాలను అమెరికాలో ఏర్పాటు చేస్తున్న ఇన్ఫోసిస్.. ప్రత్యేకించి ఈ కార్యాచరణ కోసమే అక్కడి ఉద్యోగుల సంఖ్యను పెంచుతోంది. ఇందుకోసం 10,000 మంది అమెరికన్లను నియమించుకుంటున్నట్లు కిందటి ఏడాదిలోనే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment