ఇన్ఫోసిస్ బైబ్యాక్ దిశగా తొలి అడుగు!
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ కంపెనీ షేర్ల బైబ్యాక్‌కు వీలుగా తొలి అడుగు పడింది. ఇందుకు వీలుగా నూతన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏఓఏ)లో నిబంధనల మార్పు ప్రతిపాదనకు వాటాదారులు పోస్టల్ బ్యాలట్ విధానంలో ఆమోదం తెలిపినట్టు ఇన్ఫోసిస్ కంపెనీ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అలాగే, కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, హోల్‌టైమ్ డైరెక్టర్ యూబీ ప్రవీణ్‌రావు పారితో షికం పెంపునకు కూడా వాటాదారులు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది.
నూతన ఏఓఏ ప్రకారం ఇన్ఫోసిస్ సొంత కంపెనీ ఈక్విటీ షేర్లను లేదా సెక్యూరిటీలను బైబ్యాక్ విధానంలో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని కంపెనీ వివరించింది. ఇన్ఫోసిస్ వద్ద రూ.35,697 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. రూ.12,000 కోట్ల మేర విలు వైన షేర్ల బైబ్యాక్ నిర్ణయాన్ని ఇన్ఫోసిస్ ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.