ఇంటర్నెట్ కస్టమర్ల వాటా పెంపు లక్ష్యం
యునినార్ సర్కిల్ హెడ్ శ్రీనాథ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ యునినార్‌కు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లలో 24 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. 2017 నాటికి ఈ సంఖ్యను 50 శాతానికి చేర్చాలని సంస్థ లక్ష్యంగా చేసుకుందని యునినార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు.
డిజిటల్ విన్నర్స్..: ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు డిజిటల్ విన్నర్స్ పేరుతో ఒక పోటీని (కాంటెస్ట్) యునినార్ ఆవిష్కరించింది. ఎడ్యుకేషన్ ఈ ఏడాది కాంటెస్ట్ థీమ్. సామాజికంగా మార్పును తీసుకొచ్చేలా మొబైల్ యాప్స్‌ను రూపొందించిన డెవలపర్లు పోటీలో పాల్గొనవచ్చు. అందరికీ విద్య అందించడంలో ఉన్న సవాళ్లను కొంతైనా పరిష్కరించే ఐడియాలు ఈ వేదిక ద్వారా వస్తాయని ఎక్స్‌టర్నల్ కమ్యూనికేషన్స్ హెడ్ అనురాగ్ ప్రసాద్ అన్నారు. భారత్ నుంచి ఎంపికైన విజేతలు అక్టోబరులో ఓస్లోలో జరిగే డిజిటల్ విన్నర్స్ సదస్సులో తమ ఐడియాను తెలియజేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. విజేత సుమారు రూ.8 లక్షలు గెల్చుకోవచ్చు.