Uninor
-
చాపచుట్టేస్తున్న టెలికాం కంపెనీలు
-
యూనినార్.. ఇక టెలినార్
- బ్రాడింగ్కు రూ.100 కోట్ల వ్యయం - కొనసాగనున్న సబ్సే సస్తా పథకాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం సేవల రంగంలో ఉన్న యూనినార్ పేరు మారింది. ఇక నుంచి ‘టెలినార్’ బ్రాండ్ పేరుతో సేవలు అందించనుంది. నార్వేకు చెందిన టెలినార్ గ్రూప్ భారత్‌లో 2009లో యూనినార్ను ప్రారంభించింది. టెలివింగ్స్ ఇండియాగా ఉన్న కంపెనీ పేరు సైతం టెలినార్ ఇండియా కమ్యూనికేషన్స్‌గా మార్చారు. బ్రాండింగ్‌కు కంపెనీ దేశవ్యాప్తంగా రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోసహా దేశంలో 6 సర్కిళ్లలో కంపెనీ టెలికం సేవలు అందిస్తోంది. చందాదారుల సంఖ్య పరంగా దేశంలో నాల్గవ అతిపెద్ద ఆపరేటర్‌గా నిలిచింది. విస్తరణలో భాగంగా స్పెక్ట్రం షేరింగ్, స్పెక్ట్రం ట్రేడింగ్‌తోపాటు కంపెనీల కొనుగోళ్లకు సిద్ధమని టెలినార్ ఇండియా సీఈవో వివేక్ సూద్ తెలిపారు. మరింత స్పెక్ట్రం కొనుగోలుకు వేలంలో పాల్గొంటామన్నారు. 3జీ, 4జీ సేవలవైపు త్వరగా మళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2016 జూన్‌కల్లా ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించారు. సబ్సే సస్తా కొనసాగుతుంది.. మాస్ మార్కెట్‌ను అమితంగా ఆకట్టుకుంటున్న సబ్సే సస్తా పథకాలు కొనసాగుతాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. పేరు మారినప్పటికీ ఇతర ఆపరేటర్ల కంటే తక్కువకే వాయిస్, డేటా ప్యాక్‌లను అందిస్తామన్నారు. ధరల విషయంలో పారదర్శక విధానాన్ని పాటిస్తున్నట్టు చెప్పారు. ‘13 దేశాల్లో టెలినార్ బ్రాండ్ సుపరిచితం. అంతర్జాతీయ గుర్తింపులో భాగంగానే యూనినార్ పేరును టెలి నార్గా మార్చాం. టెలినార్ సేవలందిస్తున్న ఆరు సర్కిళ్లలో పరిశ్రమ ఆదా యం వృద్ధి 8-9% మాత్రమే. టెలినార్ 38% వృద్ధి చెందింది. పరిశ్రమ కంటే మూడు రెట్ల వృద్ధి నమోదు చేస్తాం’ అని అన్నారు. 4జీ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అధిక ఫీచర్లతో కూడిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏడాదిలో ప్రారంభం అవుతాయన్నారు. కాల్ డ్రాప్ అయితే.. వినియోగదార్లు ఫోన్ మాట్లాడుతున్న సమయంలో కాల్ కట్ అయితే.. కస్టమర్ ఖాతాలో ఒక నిమిషం టాక్‌టైమ్‌ను కంపెనీ జమ చేస్తోంది. ఎస్టీడీ, ఐఎస్డీ కాల్స్‌కు సైతం ఈ సౌకర్యాన్ని విస్తరించినట్టు శ్రీనాథ్ తెలిపారు. కస్టమర్లు చేసే వ్యయానికి మరింత విలువను జోడిస్తామన్నారు. టెలినార్ కస్టమర్లు హై స్పీడ్ ఇంటర్నెట్ను త్వరలో పొందనున్నారు. మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరకే ఈ సేవలను అందించేందుకు నెట్‌వర్క్‌ను పూర్తిగా నూతన టెక్నాలజీతో కంపెనీ ఆధునీకరిస్తోంది. ఇందుకోసం హువావె టెక్నాలజీస్‌కు రూ.1,300 కోట్లకుపైగా విలువ చేసే కాంట్రాక్టును టెలినార్ అప్పగించింది. ఆరు సర్కిళ్లలో 24,000 సైట్స్‌ను ఆధునీకరిస్తారు. సాఫ్ట్‌వేర్‌ను జోడించడం ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ ఆఫర్ చేసేందుకు ఈ టెక్నాలజీతో వీలవుతుంది. -
ఇంటర్నెట్ కస్టమర్ల వాటా పెంపు లక్ష్యం
యునినార్ సర్కిల్ హెడ్ శ్రీనాథ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ యునినార్‌కు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లలో 24 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. 2017 నాటికి ఈ సంఖ్యను 50 శాతానికి చేర్చాలని సంస్థ లక్ష్యంగా చేసుకుందని యునినార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు. డిజిటల్ విన్నర్స్..: ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు డిజిటల్ విన్నర్స్ పేరుతో ఒక పోటీని (కాంటెస్ట్) యునినార్ ఆవిష్కరించింది. ఎడ్యుకేషన్ ఈ ఏడాది కాంటెస్ట్ థీమ్. సామాజికంగా మార్పును తీసుకొచ్చేలా మొబైల్ యాప్స్‌ను రూపొందించిన డెవలపర్లు పోటీలో పాల్గొనవచ్చు. అందరికీ విద్య అందించడంలో ఉన్న సవాళ్లను కొంతైనా పరిష్కరించే ఐడియాలు ఈ వేదిక ద్వారా వస్తాయని ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్స్ హెడ్ అనురాగ్ ప్రసాద్ అన్నారు. భారత్ నుంచి ఎంపికైన విజేతలు అక్టోబరులో ఓస్లోలో జరిగే డిజిటల్ విన్నర్స్ సదస్సులో తమ ఐడియాను తెలియజేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. విజేత సుమారు రూ.8 లక్షలు గెల్చుకోవచ్చు. -
4జీ సేవల్లోకి యునినార్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ యునినార్ 4జీ రంగంలోకి అడుగు పెడుతోంది. సబ్సే సస్తా పేరుతో ఇతర టెల్కోల కంటే తక్కువ ధరకే సర్వీసులను ఆఫర్ చేస్తున్న యునినార్.. 4జీలోనూ ఇదే పంథా కొనసాగిస్తామని చెబుతోంది. ఇదే నిజమైతే భారత టెలికం రంగంలో సంచలనమేనని చెప్పొచ్చు. అయితే ఈ ఏడాది 4జీ పరీక్షల వరకే కంపెనీ పరిమితమవుతోంది. 4జీ మొబైల్ ఫోన్ల ధరలు ఖరీదుగా ఉండడం, మోడళ్లు పరిమితంగా ఉండడమే ఇందుకు కారణమని యునినార్ సీఈవో మోర్టెన్ కార్ల్సన్ సోర్బీ తెలిపారు. సెల్ఫ్ కేర్ టూల్ ను గురువారమిక్కడ ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 4జీ మొబైల్ ఫోన్లు..! అందుబాటు ధరలో 4జీ మొబైల్ ఫోన్లను అందించేందుకు శాంసంగ్, మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలతో యునినార్ చర్చిస్తోంది. బండిల్ ఆఫర్ కింద మొబైల్ ఫోన్లు, డాటా అందించాలన్నది ప్రణాళిక అని సోర్బీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఇటీవలే బండిల్ ఆఫర్లో మొజిల్లా ఫోన్లను ప్రవేశపెట్టి విజయవంతం అయ్యామని చెప్పారు. ‘3జీ సేవల్లోకి కూడా ప్రవేశించే ఆలోచన ఉందన్నారు. -
సిమ్ రీచార్జ్‌తో రెండో సిమ్‌కూ టాక్‌టైం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో క్రియాశీల మొబైల్ కనెక్షన్ల సంఖ్య దాదాపు 80 కోట్లు. వీరిలో మహిళా చందాదారుల సంఖ్య 30-35 శాతం ఉండొచ్చని అంటోంది టెలికం రంగ సంస్థ యునినార్. ఈ అంతరాన్ని తొలగించేందుకు తనవంతుగా ‘బంధన్’ పేరుతో రెండు సిమ్‌లతో కూడిన ప్యాక్‌ను త్వరలో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనుంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో 87 గ్రామాల్లో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద ఈ ప్యాక్‌ను పరిచయం చేసింది. మొదటి సిమ్‌కు ఎంత మొత్తమైతే రీచార్జ్ చేస్తారో అన్ని నిముషాల టాక్‌టైం రెండో సిమ్‌కు వచ్చి చేరడం దీని ప్రత్యేకత. ఉదాహరణకు రూ.50 రీచార్జ్ చేస్తే రెండో సిమ్‌కు 50 నిముషాల టాక్‌టైం జమవుతుంది. జీఎస్ఎం ఆపరేటర్ల ప్రపంచ సమాఖ్య.. జీఎస్‌ఎంఏతో కలిసి యునినార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్పందన అనూహ్యం.. మొబైల్ ఫోన్ వాడని మహిళలు భారత్‌లో కోట్లలోనే ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. మహిళలూ మొబైల్ ఫోన్లు వినియోగించేలా చేయడమే కార్యక్రమ ముఖ్యోద్ధేశమని యునినార్ సీఎంవో రాజీవ్ సేథి సాక్షి బిజినెస్ బ్యూరోకు సోమవారం తెలిపారు. ఈ ప్యాక్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని వివరించారు. రెండు సిమ్‌లలో ఒకరు ఖచ్చితంగా మహిళ అయి ఉండాలన్న నిబంధన విధించామన్నారు. ప్రాజెక్ట్ సంపర్క్ పేరుతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించామని.. ఫలితాలనుబట్టి ఆంధ్ర ప్రదేశ్‌తోసహా(తెలంగాణ, సీమాంధ్ర) అన్ని సర్కిళ్లకు బంధన్‌ను విస్తరిస్తామని రాజీవ్ తెలిపారు. కాగా, 7 నెలల ప్రాజెక్టులో భాగంగా యునినార్, జీఎస్‌ఎంఏకు చెందిన మొబైల్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్లు రూ.1.10 కోట్లను వెచ్చిస్తాయి. ప్రీపెయిడ్ కనెక్షన్లు, రీచార్జ్ వోచర్ల విక్రయంలో మహిళలకు యునినార్ శిక్షణ ఇవ్వనుంది. -
యూత్ బ్రాండ్ యునినార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ యునినార్‌కు దేశవ్యాప్తంగా జూన్ నాటికి 3.93 కోట్ల మంది చందాదారులున్నారు. వీరిలో 60 శాతం మంది 18-25 ఏళ్ల వయసు వారే కావడం విశేషం. సబ్సే సస్తా పేరుతో అన్ని కంపెనీల కంటే చవకైన ప్యాక్‌లను ఆఫర్ చేస్తున్నామని, దీంతో యూత్ బ్రాండ్‌గా నిలిచామని యునినార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాజీవ్ సేథి గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. అందరికీ ఇంటర్నెట్ను చేరువ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇంటర్నెట్ చార్జీ గంటకు 50 పైసలు మొదలు చవక ధరలో ప్యాక్‌లు, టారిఫ్‌లు పరిచయం చేశామన్నారు. యునినార్ వినియోగదారుల్లో 30 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. మార్చికల్లా ఈ సంఖ్య2 రెట్లు ఆశిస్తున్నాన్నారు. అవసరంగా ఇంటర్నెట్.. కనీస అవసరంగా ఇంటర్నెట్ మారిందని రాజీవ్ సేథి తెలిపారు. ‘యునినార్ వినియోగదారుల్లో 50 శాతం మంది గ్రామీణులు ఉన్నారు. వీరు వినోదం కోసం నెట్లో ముఖ్యంగా పాటలు, యూట్యూబ్, ఫేస్బుక్ వాడుతున్నారు. పట్టణ వినియోగదారులు సమాచారం, పరిజ్ఞానం తెలుసుకోవడానికి నెట్‌పై ఆధారపడుతున్నారు’ అని తెలిపారు. టెలికం రంగంలో తాము 45 శాతం వృద్ధి నమోదు చేస్తున్నామని, పరిశ్రమ వృద్ధి రేటు కేవలం 10 శాతానికి పరిమితమైందని వివరించారు. అస్సాంలో జనవరిలో అడుగు పెట్టనున్నామని, దీంతో యునినార్ సర్కిళ్ల సంఖ్య 7కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఉత్తమ ఐడియాకు.. నార్వేలోని ఓస్లోలో డిసెంబరులో టెలినార్ యూత్ సమ్మిట్ జరగనుంది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ ఫర్ ఆల్ చాలెంజ్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. 18-25 ఏళ్ల వయసున్నవారు చాలెంజ్‌కు అర్హులని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కుమార్ కన్నన్ తెలిపారు. మొబైల్ ఇంటర్నెట్ను ఆసరాగా చేసుకుని సామాజిక మార్పు, అభివృద్ధికి దోహదపడే ఉత్తమ వ్యాపార ఆలోచనలను ఎంపిక చేస్తారు. ఒక్కో సర్కిల్ నుంచి ఇద్దరిని, ఇలా భారత్‌లో 12 మందిని ఎంపిక చేస్తారు. ఇద్దరు విజేతలకు ప్రథమ బహుమతి రూ.1 లక్ష, ద్వితీయ బహుమతి కింద రూ.50 వేలు ఇస్తారు. ఇలా టెలినార్ సేవలందిస్తున్న 14 దేశాల నుంచి 28 మందిని సమ్మిట్‌కు పంపిస్తారు. దరఖాస్తును ఫేస్బుక్లో యునినార్ పేజీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులు పంపించేందుకు చివరితేదీ ఆగస్టు 31. -
యూనినార్ చౌక ఇంటర్నెట్ ఆఫర్లు
రూ. 15(నెలకు) ఫేస్బుక్ ప్యాకేజీ రూ. 15కు వాట్స్‌యాప్ ప్యాకేజీ న్యూఢిల్లీ: చౌక ధరల్లో ఇంటర్నెట్ ప్లాన్లను అందిస్తున్నామని యూనినార్ సీఈవో మోర్టెన్ కార్ల్సన్ సోర్బీ చెప్పారు. గంటకు 50 పైసలు చొప్పున నెలకు రూ.15కు ఫేస్బుక్ ప్యాకేజీని, అలాగే రోజుకు రూపాయి చొప్పున నెలకు రూ.15కే వాట్స్‌యాప్ ప్యాకేజీని అందిస్తున్నామని తెలి పారు. ఈ ప్లాన్లను ముందు గా గుజరాత్, మహారాష్ట్ర, గోవాల్లో అందిస్తామని ఆ తర్వాత తెలంగాణ, సీమాంధ్ర, ఉత్తరప్రదేశ్, బీహార్‌ల్లో అందుబాటులోకి తెస్తామని వివరించారు. -
టెలీవింగ్స్‌కు టెలికాం లెసైన్స్‌లు
న్యూఢిల్లీ: టెలీవింగ్స్ సంస్థకు ఏకీకృత లెసైన్స్, కొత్త టెలికాం పర్మిట్లు లభించినట్లయింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, గోవా, తూర్పు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ల్లో ఏకీకృత లెసైన్స్‌లు పొందామని టెలీ వింగ్స్ పేర్కొంది. యూనినార్ పేరుతోనే సర్వీసులను కొనసాగిస్తామని వివరించింది. నార్వేకు చెందిన టెలినార్, భారత్‌కు చెందిన యూనిటెక్‌లు కలిసి యూనినార్ పేరుతో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల యూనిటెక్ ఈ జేవీ నుంచి వైదొలగడంతో యూనిటెక్ వెర్లైస్లో ఉన్న ఆస్తులన్నింటినీ యూనినార్ ప్రమోటర్ సంస్థ టెలినార్ - కొత్త సంస్థ, టెలీ వింగ్స్‌కు బదలాయించింది. దీంతో టెలీవింగ్స్‌కు ఏకీకృత లెసైన్స్, కొత్త టెలికాం పర్మిట్లు లభించినట్లయింది. -
నిమిషానికి 25 పైసలే..ఏ నెట్‌వర్క్‌కైనా
యునినార్ కొత్త ఆఫర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగంలో మరో ధరల యుద్ధానికి తెరలేవనుందా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒకవైపు నిర్వహణ వ్యయ భారాన్ని తట్టుకోలేక ఆపరేటర్లు టారిఫ్‌లను పెంచుతూ వస్తుంటే.. యునినార్ మాత్రం దానికి విరుద్ధంగా సంచలనాత్మక ఆఫర్‌ను ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న యునినార్ కస్టమర్లు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా నిమిషానికి 25 పైసలకే కాల్ చేసుకునే సదుపాయాన్ని ప్రకటించింది. ‘సబ్ సే సస్తా’ వాగ్దానానికి ఇది కొనసాగింపు అని కంపెనీ స్పష్టం చేసింది. యునినార్ ఇప్పటికే మహారాష్ట్ర, గోవా సర్కిల్లో ఇటువంటి పథకాన్ని అందుబాటులోకి తెచ్చి విజయవంతమైంది. కంపెనీ సేవలందిస్తున్న మిగిలిన నాలుగు సర్కిళ్లకూ దీనిని విస్తరించనున్నారు. కేవలం స్థానిక కాల్స్ చేసుకునే కస్టమర్లు రూ.17 విలువగల స్పెషల్ టారిఫ్ వోచర్‌ను(ఎస్టీవీ) కొనుగోలు చేస్తే చాలు. ఎస్టీడీ కావాల్సినవారు రూ.29 విలువైన ఎస్టీవీని తీసుకోవాల్సి ఉంటుంది. వోచర్ల కాల పరిమితి 28 రోజులు. 50 శాతం ఆదా..: కొత్త ఆఫర్‌తో ప్రీపెయిడ్ కస్టమర్లు తమ నెలవారీ బిల్లులో 50 శాతం ఆదా చేసుకోవచ్చని యునినార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీశ్ కన్నన్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘టెలికం రంగంలో టాక్ టైం, కాల్ రేట్లు ప్రధానమైనవి. దీనిని దృష్టిలో పెట్టుకుని కొత్త ప్యాక్‌కు రూపకల్పన చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో ఇదే చవకైన పథకం. మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయం’ అని అన్నారు. ప్రవేశపెడుతున్న అన్ని ఉత్పత్తులను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. మొబైల్ ఫోన్ వాడకందార్లలో 90% మంది డ్యూయల్ సిమ్ ఫోన్లను వినియోగిస్తున్నారని, ఇది కంపెనీకి కలిసి వస్తుందని వివరించారు. -
టెలికం యూజర్లు 90 కోట్లకు పైనే..
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ నాటికి భారత్‌లో మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 90.3 కోట్లకు చేరిందని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది. జూన్‌లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) కోసం 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటున్న ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మేలో 90 కోట్లుగా ఉన్న టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య జూన్‌లో 0.34 శాతం వృద్ధితో 90.3 కోట్లకు చేరింది. జూన్‌లో 31.6 లక్షల మంది కొత్తగా మొబైల్ వినియోగదారులవగా, ల్యాండ్‌లైన్ కనెక్షన్లు 1.2 లక్షలు తగ్గాయి. పట్టణ వినియోగదారుల సంఖ్య 60.5 శాతం నుంచి 60.4 శాతానికి తగ్గగా, గ్రామీణ వినియోగదారుల సంఖ్య 39.4 శాతం నుంచి 39.6 శాతానికి పెరిగింది. జూన్‌లో భారతీ ఎయిర్‌టెల్‌కు అత్యధికంగా కొత్త వినియోగదారులు లభించారు. ఈ కంపెనీ జూన్‌లో 12.63 లక్షల మంది కొత్త వినియోగదారులను సాధించింది. 12.09 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా సెల్యులర్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (8.33 లక్షల మంది కొత్త వినియోగదారులు), ఎయిర్‌సెల్(6.11 లక్షలు), వొడాఫోన్(3.47లక్షలు)లు నిలిచాయి. 1.32 లక్షల మంది కొత్త వినియోగదారులను సాధించినప్పటికీ, వినియోగదారుల వృద్ధి విషయంలో వీడియోకాన్ గరిష్ట వృద్ధి(5.81 శాతం)ని సాధించింది. యూనినార్‌కు 2.95 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. టాటా టెలిసర్వీసెస్ సంస్థ 6.39 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. ఈ సంస్థతో పాటు మరో ఐదు కంపెనీలు సిస్టమ శ్యామ టెలిసర్వీసెస్(3.5 లక్షలు) బీఎస్ఎన్ఎల్(75,000) కూడా వినియోగదారులను కోల్పోయాయి. మేలో 1.513 కోట్లుగా ఉన్న బ్రాడ్‌బాండ్ వినియోగదారుల సంఖ్య జూన్‌లో 1.519 కోట్లకు పెరిగింది.