టెలీవింగ్స్‌కు టెలికాం లెసైన్స్‌లు | Uninor gets new telecom licences | Sakshi
Sakshi News home page

టెలీవింగ్స్‌కు టెలికాం లెసైన్స్‌లు

Published Wed, Dec 4 2013 2:31 AM | Last Updated on Sat, Aug 11 2018 8:24 PM

టెలీవింగ్స్‌కు  టెలికాం లెసైన్స్‌లు - Sakshi

టెలీవింగ్స్‌కు టెలికాం లెసైన్స్‌లు

 న్యూఢిల్లీ: టెలీవింగ్స్ సంస్థకు ఏకీకృత లెసైన్స్, కొత్త టెలికాం పర్మిట్లు  లభించినట్లయింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, గోవా, తూర్పు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ల్లో ఏకీకృత లెసైన్స్‌లు పొందామని టెలీ వింగ్స్ పేర్కొంది. యూనినార్ పేరుతోనే సర్వీసులను కొనసాగిస్తామని వివరించింది. నార్వేకు చెందిన టెలినార్, భారత్‌కు చెందిన యూనిటెక్‌లు కలిసి యూనినార్ పేరుతో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల యూనిటెక్ ఈ జేవీ నుంచి వైదొలగడంతో యూనిటెక్ వెర్లైస్‌లో ఉన్న ఆస్తులన్నింటినీ యూనినార్ ప్రమోటర్ సంస్థ టెలినార్ - కొత్త సంస్థ, టెలీ వింగ్స్‌కు బదలాయించింది. దీంతో టెలీవింగ్స్‌కు ఏకీకృత లెసైన్స్, కొత్త టెలికాం పర్మిట్లు లభించినట్లయింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement