ఫైనాన్షియల్ బేసిక్స్..
అయితే ముందు యులిప్స్ అంటే ఏంటో తెలియాలి. యులిప్స్‌కి సంప్రదాయ ఇన్సూరెన్స్ పాలసీలకు మధ్య ఉన్న తేడాలపై స్పష్టమైన అవగాహనకు రావాలి. మీరు ఎంత రిస్క్ భరించగలుగుతారు? మీ వయసు? సంపాదన వంటి అంశాలు పాలసీ ఎంపికను ప్రభావితం చేస్తాయి.
ఈక్విటీ, డెట్ ఫండ్స్‌కు కేటాయించే మొత్తాన్ని కూడా మీరు పాలసీ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎక్కువ రిస్క్‌ను భరించగలిగితే ఈక్విటీ ఫండ్స్‌పై, తక్కువ రిస్క్‌వైపు మొగ్గుచూపితే డెట్ ఫండ్స్‌పై ఎక్కువగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మధ్యరకంగా ఉండాలంటే అటు ఈక్విటీ ఫండ్స్‌కు, ఇటు డెట్ ఫండ్స్‌కు సమాన కేటాయింపులు జరపాలి.
ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు వాటి పనితీరును పరిగణనలోకి తీసుకోండి. పాలసీ చార్జీలు ఎలా ఉన్నాయో గమనించండి. సాధారణంగా యులిప్స్‌లో ప్రీమియం కేటాయింపు, ఫండ్ మేనేజ్‌మెంట్, పాలసీ అడ్మినిస్ట్రేషన్ వంటి అంశాలకు సంబంధించిన తదితర చార్జీలు ప్రధానంగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకోండి. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా బీమా కంపెనీలున్నాయి. అవి కస్టమర్లకు పలు రకాల యులిప్ పాలసీలనందిస్తున్నాయి.
ఒక కంపెనీ పాలసీని మరొక కంపెనీ పాలసీతో పోల్చి చూసుకోండి. ఎందుకంటే బీమా కంపెనీల పాలసీలన్నీ ఒకే విధంగా ఉండవు. ఏ బీమా కంపెనీ పాలసీ మీకు అనువుగా ఉంటుందని భావిస్తారో దాన్ని ఎంపిక చేసుకోండి. పాలసీ ఎంపికకు ముందు ఇన్సూరెన్స్ అడ్వైజర్ సలహాలను కూడా తీసుకోవచ్చు. అదే సమయంలో ఆయన సిఫార్సు చేసిన ప్రొడక్ట్ గురించి మీకేమైనా సందేహాలుంటే వాటిని అడిగి నివృత్తి చేసుకోండి.
యులిప్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా?
Published Mon, Feb 1 2016 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM
Advertisement