
3 రోజుల్లో కోటి అమ్మకాలు..
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ .. ఐఫోన్ 6, 6 ప్లస్ మోడల్స్ అమ్మకాలు రికార్డులు సృష్టిస్తున్నాయి.
యాపిల్ ఐఫోన్ 6
న్యూయార్క్: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ .. ఐఫోన్ 6, 6 ప్లస్ మోడల్స్ అమ్మకాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. విక్రయాలు మొదలైన మూడు రోజుల్లోనే ఏకంగా 1 కోటి పైగా ఫోన్లు అమ్ముడయ్యాయి. ఒక కొత్త మోడల్ ఈ స్థాయిలో అమ్ముడవడం రికార్డు. ఏడాది క్రితం ఐఫోన్ 5సీ, 5ఎస్ మోడల్స్‌ని ప్రవేశపెట్టినప్పుడు 90 లక్షల మేర అమ్మకాలు జరిగినట్లు యాపిల్ పేర్కొంది. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ తదితర పది దేశాల్లో ఈ కొత్త ఐఫోన్‌లను విక్రయిస్తోంది కంపెనీ.
ఈ నెల 26 నుంచి మరో 20 దేశాల్లో విక్రయాలు ప్రారంభించనుంది. కంపెనీ ఊహించిన దానికంటే డిమాండ్ భారీగా ఉందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. పెద్ద స్క్రీన్‌తో పాటు మరింత వేగవంతమైన పనితీరు, క్రెడిట్ కార్డు చెల్లింపుల కోసం వైర్‌లెస్ చిప్ తదితర ఫీచర్లు ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్‌లో ఉన్నాయి. వచ్చే నెల 17న ఇవి భారత మార్కెట్లోకి రానున్నాయి. భారత్‌లో ఈ ఫోన్ల ధర సుమారు రూ. 48,000 - రూ. 60,000 దాకా ఉండొచ్చని అంచనా.