అమెజాన్‌లో ఐఫోన్ 6 ధరెంతో తెలుసా?
అమెజాన్‌లో ఐఫోన్ 6 ధరెంతో తెలుసా?
Published Tue, Jul 11 2017 2:59 PM | Last Updated on Fri, May 25 2018 7:14 PM
భారీ ఆఫర్లు, బంపర్ డిస్కౌంట్లతో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన మొట్టమొదటి ప్రైమ్ డే సేల్‌ను నిన్న సాయంత్రం ఆరుగంటల నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ సేల్ నేటి అర్థరాత్రి(జూలై 11, అర్థరాత్రి) వరకు కొనసాగనుంది. ఈ సేల్ సందర్భంగా ఐఫోన్ 6ను 25వేల రూపాయలకే అమెజాన్ అందిస్తోంది. అంతేకాక ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 15 శాతం డిస్కౌంట్‌ను కూడా అందుబాటులో ఉంచింది. దీంతో పాటు ఐఫోన్ 6ఎస్(స్పేస్ గ్రే, 32జీబీ), ఐఫోన్6ఎస్(గోల్డ్, 32జీబీ) ఫోన్లను 25 శాతం తగ్గింపుతో రూ.34,999కి విక్రయిస్తోంది. వీటితోపాటు ఐఫోన్ 7 రోజ్ గోల్డ్, బ్లాక్, గోల్డ్ వేరియంట్లు రూ.42,999కే అందుబాటులో ఉన్నాయి. ఈ వేరియంట్ల అసలు ధర రూ.56,200. ప్రస్తుతం అమెజాన్ ఆఫర్ చేస్తున్న తగ్గింపు ధరతో 23 శాతం పొదుపు చేసుకోవచ్చు.
ప్రైమ్ యూజర్లు ఎల్‌జీ జీ6 స్మార్ట్‌ఫోన్‌ను 30 శాతం ఆదాతో 37,990 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా తగ్గించి రూ.38,999కే విక్రయిస్తోంది. అయితే ఈ సేల్ ప్రత్యేకంగా రూ.499తో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న తన ప్రైమ్ యూజర్లకు మాత్రమే. రెండు రకాల డీల్స్‌ను ఈ సేల్లో అమెజాన్ ఆఫర్‌చేస్తోంది. రెగ్యులర్ డిస్కౌంట్లను, ప్రత్యేక సందర్భాల్లో పరిమిత ఉత్పత్తులపై ఆఫర్ చేసే డీల్స్. ఇవే కాకుండా మరెన్నో డీల్స్, ఆఫర్లు సేల్‌లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఉన్నాయని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు. 30 కొత్త బ్రాండ్‌లను కూడా ఈ సేల్‌లో లాంచ్‌చేసింది. భారత్‌తో పాటు ప్రైమ్ డే సేల్ జరుగబోయే దేశాల్లో ఫ్రాన్స్, చైనా, జర్మనీ, కెనడా, బెల్జియం, జపాన్‌లు ఉన్నాయి. గతేడాదే అమెజాన్ ఈ సేల్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ఈ సారి భారత్‌లో కూడా ఎక్స్‌క్లూజివ్‌గా నిర్వహిస్తున్నారు.
Advertisement
Advertisement