♦ భారత్ మ్యాట్రిమోని బ్రాండ్ కింద ఆన్‌లైన్ ద్వారా పెళ్లిళ్లు కుదిర్చే వ్యాపారం నిర్వహిస్తున్న మ్యాట్రిమోనిడాట్‌కామ్ త్వరలో ఐపీఓకు రానుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.350 కోట్లు సమీకరిస్తుందని అంచనా.
♦ ఫార్మా సంస్థ ఇరీస్ లైఫ్‌సైన్సెస్ ఐపీఓకు సెబీ ఆమోదం లభించింది. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది.
♦ ఇండియా గ్రిడ్‌ట్రస్ట్ (ఇండిగ్రిడ్) త్వరలో తన ఇన్విట్‌తో (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్) పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ ఇండిగ్రిడ్ ఇన్విట్‌ను స్టెరిలైట్ పవర్ గ్రిడ్ వెంచర్స్ స్పాన్సర్ చేస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ. 2,250 కోట్లు సమీకరిస్తారు. ఇది ఐపీఓకు వచ్చిన రెండో ఇన్విట్. ఇటీవలే ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా కంపెనీ ఇన్విట్ ద్వారా రూ.5,000 కోట్లకు పైగా నిధులు సమీకరించింది.
ఎస్‌బీఐకి చెందిన జీవిత బీమా వెంచర్–ఎస్‌బీఐ లైఫ్ ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా ఐపీఓకు వచ్చే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ కంటే ముందుగానే ఎస్‌బీఐ లైఫ్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్నది ప్రణాళిక.
ఐపీఓ కాలమ్...
Published Sun, May 14 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM
Advertisement
Advertisement