Bharat Matrimony brand
-
ఐపీఓ కాలమ్...
♦ భారత్ మ్యాట్రిమోని బ్రాండ్ కింద ఆన్లైన్ ద్వారా పెళ్లిళ్లు కుదిర్చే వ్యాపారం నిర్వహిస్తున్న మ్యాట్రిమోనిడాట్కామ్ త్వరలో ఐపీఓకు రానుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.350 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ♦ ఫార్మా సంస్థ ఇరీస్ లైఫ్‌సైన్సెస్ ఐపీఓకు సెబీ ఆమోదం లభించింది. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ♦ ఇండియా గ్రిడ్ట్రస్ట్ (ఇండిగ్రిడ్) త్వరలో తన ఇన్విట్‌తో (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ ఇండిగ్రిడ్ ఇన్విట్‌ను స్టెరిలైట్ పవర్ గ్రిడ్ వెంచర్స్ స్పాన్సర్ చేస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ. 2,250 కోట్లు సమీకరిస్తారు. ఇది ఐపీఓకు వచ్చిన రెండో ఇన్విట్. ఇటీవలే ఐఆర్బీ ఇన్ఫ్రా కంపెనీ ఇన్విట్ ద్వారా రూ.5,000 కోట్లకు పైగా నిధులు సమీకరించింది. ఎస్బీఐకి చెందిన జీవిత బీమా వెంచర్–ఎస్బీఐ లైఫ్ ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా ఐపీఓకు వచ్చే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ కంటే ముందుగానే ఎస్బీఐ లైఫ్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్నది ప్రణాళిక. -
మ్యాట్రిమోనిడాట్కామ్ ఐపీఓ!
- రూ.600-700 కోట్లు సమీకరణ ప్రణాళిక - సెబీకి పత్రాలు... న్యూఢిల్లీ: భారత్‌మ్యాట్రిమోని బ్రాండ్ కింద ఆన్లైన్ ద్వారా పెళ్లి సంబంధాలు కుదిర్చే మ్యాట్రిమోనిడాట్కామ్ త్వరలో పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీఓ)కు రానున్నది. ఐపీఓకు సంబంధించిన పత్రాలను ఈ సంస్థ బుధవారం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ సంస్థ రూ.600-700 కోట్ల నిధులు సమీకరించనున్నదని సమాచారం. . ఈ ఐపీఓలో భాగంగా రూ.350 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద 16.6 లక్షల షేర్లను జారీ చేయనున్నదని ఈ పత్రాల్లో మ్యాట్రిమోనిడాట్కామ్ పేర్కొంది. ఈ ఇష్యూకు కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, సిటి గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, డాయిస్ ఈక్విటీస్ ఇండియాలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. గత ఆర్థిక సంవత్సరం (2014-15) చివరి నాటికల్లా మ్యాట్రిమోనీడాట్‌కామ్ సంస్థ రూ.243 కోట్ల ఆదాయాన్ని రూ.18 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది. ఈ సంస్థ వద్ద 26.5 లక్షల వధూవరుల ప్రొఫైల్స్ ఉన్నాయి. నిధుల సమీకరణ విస్తరణ కార్యకలాపాలకు వినియోగించాలన్నది ప్రణాళిక. ఇంత భారీ స్థాయి లో ఐపీఓకు వస్తోన్న 2వ ఇంటర్నెట్ కంపెనీ ఇది. ఇంతకు ముందు లోకల్ సెర్చ్ ఇంజన్ జస్ట్ డయల్ 2013లో రూ.950 కోట్లు ఐపీఓ ద్వారా సమీకరించింది.