ఏటీఎం ఆధారిత ఈ ఫైలింగ్ కు శ్రీకారం | IT department searches two firms linked to Sanjay Bhandari | Sakshi
Sakshi News home page

ఏటీఎం ఆధారిత ఈ ఫైలింగ్ కు శ్రీకారం

Published Mon, Jun 6 2016 1:34 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM

ఏటీఎం ఆధారిత ఈ ఫైలింగ్ కు శ్రీకారం - Sakshi

ఏటీఎం ఆధారిత ఈ ఫైలింగ్ కు శ్రీకారం

కాగితం రహిత పాలనను విస్తరించేందుకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ (ఐటీ) ఏటీఎం ఆధారిత ఈ ఫైలింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ట్యాక్స్ చెల్లింపుదారుడికి ఏటీఎం ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) అందుతుంది. ఈ నెల మూడో తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. త్వరలోనే మిగతా బ్యాంకులు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తాయని ఐటీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేని వారికోసం ఐటీ శాఖ బ్యాంకు అకౌంట్ ఆధారిత ధ్రువీకరణ వెసులుబాటును గత నెలలో ప్రారంభించింది. 

ఆధార్ నంబరు సాయంతో వన్‌టైంపాస్‌వర్డ్ ద్వారా ఐటీశాఖ అధికారిక ఈ -ఫైలింగ్ పోర్టల్‌లో హెచ్‌టీటీపీ://ఇన్‌కం ట్యాక్స్‌ఇండియాఈఫైలింగ్.జీవోవీ.ఇన్‌ను సందర్శించవచ్చు. చెల్లింపుదారుడు పేపర్ ఆధారిత ఐటీఆర్‌ను బెంగుళూరు కేంద్రమైన సెంట్రల్ ప్రొసెసింగ్  సెంటర్‌కు తపాలా ద్వారా పంపే సుదీర్ఘ ప్రక్రియను నిలువరించేందుకు ఈ విధానం ఉపకరించనుంది. జీతాలు, ఇంటి ఆస్తులు, ఇతర ఆదాయ వనరులు కలిగి ఉన్న ఎవరైనా ఐటీఆర్-1ను ఫైల్ చేయొచ్చు. వ్యాపారం, ఇతరేతర వృత్తి ద్వారా ఆదాయం పొందని వ్యక్తులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు(హెచ్‌యుఎఫ్) ఐటీఆర్-2ని ైఫైల్ చేసుకునేందుకు అర్హులు. అలాగే వ్యాపారం, వృత్తి, విదేశీ ఆస్తులు లేని వ్యక్తులు, హెచ్‌యుఎఫ్‌లు ఐటీఆర్-2ఏను ఫైల్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement