జెట్‌ ఎయిర్‌వేస్‌ డిస్కౌంట్‌ ధరలు | jet Airways to offer 20-30% discounted fares | Sakshi
Sakshi News home page

జెట్‌ ఎయిర్‌వేస్‌ డిస్కౌంట్‌ ధరలు

Published Thu, Aug 10 2017 8:24 PM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM

జెట్‌ ఎయిర్‌వేస్‌ డిస్కౌంట్‌ ధరలు - Sakshi

జెట్‌ ఎయిర్‌వేస్‌ డిస్కౌంట్‌ ధరలు

న్యూఢిల్లీ:  జెట్‌ ఎయిర్‌వేస్‌  తగ్గింపు ధరలను ప్రకటించింది. విమాన టికెట్ల కొనుగోలుపై 20-30శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నట్టు గురువారం ప్రకటించింది.   ఆగస్టు 11నుంచి  6 రోజులపాటు  ఈ ప్రత్యేక సేల్‌ ద్వారా డిస్కౌంట్‌ ధరల్లో  రెండు వైపులా (వన్‌ వే అండ్‌, రిటన్‌) టికెట్లను అందించనున‍్నట్టు ఎయిర్లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
 
ఎకానమీ టికెట్లపై 30 శాతం,  ప్రీమియం ఛార్జీలపై 20 శాతం తగ్గించనున్నట్లు  జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఈ ప్రమోషనల్‌ ఆఫర్‌  టికెట్ల ద్వారా  దేశీయ విమానాల్లో  సెప్టెంబర్ 5 నుంచి ప్రయాణాలకు  చెల్లుబాటు అవుతుంది. అలాగే  అంతర్జాతీయ విమానాల్లో సెప్టెంబర్ 15 నుంచి  చెల్లుబాటు అవుతాయి.  జెట్‌ ఎయిర్‌వేస్‌ నెట్‌ వర్క్‌ పరిధిలోని  మొత్తం 44 దేశీయ, 20 అంతర్జాతీయ రూట్లలో తమ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని ,  రెండు  వైపులా ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని  చెప్పింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement