రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై : రిలయన్స్ సొంతమైన డిజిటల్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్ మరో మెగా డీల్ ను తన ఖాతాలో వేసుకోనుంది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలనుంచి పెట్టుబడులను సాధించిన జియో త్వరలోనే గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ తో మరో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. (రిలయన్స్ సామ్రాజ్యంలోకి మరో వారసుడు)
ముకేష్ అంబానీ నేతృత్వంలోని జియోలో సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్న టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ 2.5 శాతం వాటాను కొనుగోలు చేయనుందనే ఊహాగానాలు ఉన్నాయని మింట్ నివేదించింది. ఈ చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయనీ, తుది ఒప్పంద వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయని తెలిపింది. ఫిబ్రవరిలో భారతదేశ పర్యటన సందర్భంగా తన సేవలను మరింత విస్తరించ నున్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. ప్రధానంగా అజూర్ క్లౌడ్ సేవలను క్యాష్ చేసుకోవటానికి భారతదేశం అంతటా డేటా సెంటర్లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. (ప్రత్యర్థులకు గుబులు : దూసుకొచ్చిన జియో మార్ట్)
కాగా ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తోపాటు సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, కేకేఆర్ అండ్ కో, జనరల్ అట్లాంటిక్ వంటి దిగ్గజ సంస్థల నుండి 10 బిలియన్ డాలర్ల (రూ. 78,562 కోట్లు) పెట్టుబడులను జియో సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి : శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే..
విమానం ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు
Comments
Please login to add a commentAdd a comment