ఆర్‌బీఐ రేటుకోత ఎఫెక్ట్: వీక్‌గా మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనాయి. ప్రతికూల ఆసియా మార్కెట్లు, ఆర్‌బీఐ వడ్డీరేటు కోత ప్రభావంతో మార్కెట్ నెగిటివ్‌గా ఓపెన్ అయింది. ఒక దశలో నిఫ్టీ 10వేల కిందికి దిగజారింది. అనంతరం కొద్దిగా తేరుకుని సెన్సెక్స్ 64 పాయింట్లు నష్టపోయి 32416, నిఫ్టీ19 పాయింట్లు కోల్పోయి 10062 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా నిన్నటి ఆర్‌బీఐ పాలసీ రివ్యూ నేపథ్యంలో పీఎస్‌యూ, ప్రయివేట్ బ్యాంకింగ్ సెక్టార్‌లోని నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ ప్రభావం మంగళవారం నాటి మార్కెట్ ముగింపులో కనిపించింది. అది నేడు కూడా కొనసాగుతోంది. ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ లాభాల్లో ఉన్నాయి.
ఫలితాల నేపథ్యంలో 4 శాతం ఎగిసి బాటా టాప్ విన్నర్‌గా ఉండగా, ఏఓసీ, హెచ్‌పీసీఎల్, సిప్లా, లుపిన్, వర్క్‌హార్డ్, అరబిందో లాభాల్లో కొనసాగుతున్నాయి. కెనరా, యూనియన్‌బ్యాంక్, బీఓబీ, కోటక్, ఎస్ బ్యాంక్, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తదితర బ్యాంకింగ్ షేర్లు నష్టపోతున్నాయి. వీటితో పాటు బీహెచ్‌ఈఎల్, వపర్ గ్రిడ్, టాటా స్టీల్ బలహీనంగా కొనసాగుతున్నాయి.
అటు డాలర్‌మారకంలో రుపీ బలంగా ఉంది. 0.39 పైసలు ఎగిసి రూ.63. 69వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ.86లు ఎగిసి రూ. 28, 490వద్ద ఉంది.