లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు | Markets edge higher: Sensex rises nearly 90 points; Infosys, TCS gain over 1% | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Published Thu, Aug 24 2017 9:31 AM | Last Updated on Tue, Sep 12 2017 12:56 AM

Markets edge higher: Sensex rises nearly 90 points; Infosys, TCS gain over 1%

సాక్షి, ముంబై : స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సుమారు 90  పాయింట్ల మేర ఎగిసిన సెన్సెక్స్‌, మళ్లీ ఒడుదుడుకులకు లోనవుతూ స్వల్పంగా 18.22 పాయింట్ల లాభంలో 31,586 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 8.45 లాభంలో 9860 వద్ద కొనసాగుతోంది. విశాల్‌ సిక్కా రాజీనామా దెబ్బకు భారీగా కుదేలైన ఇన్ఫోసిస్‌ షేరు కోలుకున్న సంగతి తెలిసిందే.
 
వరుసగా మూడోరోజు ఈ షేరు లాభాన్ని పండిస్తోంది. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్‌, ఎల్‌ అండ్‌ టీ లు టాప్‌ గెయినర్లుగా ఉన్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో టీసీఎస్‌ కూడా 1 శాతం మేర లాభపడింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలపడి 64.07గా ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు కూడా 64 రూపాయల లాభంలో 29,169 వద్ద కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement