వెలుగులో ఐటీ, మెటల్ షేర్లు
సోమవారం ట్రేడింగ్ ముగింపు సవుయుంలో ఐటీ, మెటల్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు రోజులో కనిష్టస్థాయి నుంచి వేగంగా కోలుకున్నారు. ప్రపంచ వూర్కెట్ల బలహీనత కారణంగా ట్రేడింగ్ తొలిదశలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 268 పాయింట్లు పతనమై 19,648 వద్దకు పడిపోయింది. అటుతర్వాత కొన్ని కౌంటర్లలో విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో 19,895 వద్దకు కోలుకుంది. చివరకు 21 పాయింట్ల స్వల్పనష్టంతో వుుగిసింది. ఇదేరీతిలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్ 5,826 నుంచి తేరుకుని, ఒక పారుుంటు నష్టంతో 5,906 వద్ద క్లోజయ్యింది. ఫార్మా షేరు ర్యాన్‌బాక్సీ 5 శాతం పెరగ్గా, మెటల్ షేర్లు టాటా స్టీల్, హిందాల్కోలు 3-4 శాతం మధ్య ర్యాలీ జరిపారు.
ఐటీ దిగ్గజం టీసీఎస్ 3 శాతం పెరుగుదలతో కొత్త రికార్డు గరిష్టస్థాయి 2,090 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తిరిగి రూ. 4 లక్షల కోట్ల స్థాయిని దాటింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ వుహీంద్రాలు కూడా 2-4 శాతం మధ్య పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయున్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1-2 శాతం మధ్య తగ్గారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మరో రూ. 494 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు. దేశీయు సంస్థలు రూ. 267 కోట్లు వెనక్కుతీసుకున్నారుు. వూర్కెట్ వుుగిసిన తర్వాత రిజర్వుబ్యాంక్ మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్)ని అరశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో సోమవారం రాత్రి 11.30 గంటలకు ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఫ్యూచర్ 60 పాయింట్ల పెరుగుదలతో 5,996 పాయింట్ల వద్ద ముగిసింది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ 38 పాయింట్ల ప్రీమియంతో ఎన్‌ఎస్‌ఈలో క్లోజయ్యింది.
నిఫ్టీ ఫ్యూచర్లో షార్ట్ కవరింగ్....
80 పాయింట్లకుపైగా స్పాట్ నిఫ్టీ క్షీణించిన సవుయుంలో నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో ఇన్వెస్టర్లు వారి షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకోవడం మొదలుపెట్టారు. షార్ట్ కవరింగ్‌ను సూచిస్తూ నిఫ్టీ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి ఒక్కసారిగా 14 లక్షల షేర్లు (8 శాతం) కట్ అయ్యూరుు. దాంతో మొత్తం ఓఐ 1.60 కోట్ల షేర్లకు తగ్గింది. సూచీ ఇంకా పెరగవచ్చన్న అంచనాలతో గతంలో విక్రరుుంచిన ఫ్యూచర్ కాంట్రాక్టును తిరిగి కొనుగోలు చేయుడాన్ని షార్ట్ కవరింగ్ అంటారు. ఫ్యూచర్లో షార్ట్ కవరింగ్ జరిగినా, 6,000 స్ట్రరుుక్ వద్ద వూత్రం తాజా కాల్ బిల్డప్ ఏర్పడింది. ఆ కాల్ ఆప్షన్ ఓఐలో కొత్తగా 4.65 లక్షల షేర్లు యూడ్ కాగా, 5,800 స్ట్రరుుక్ వ ద్ద పుట్ రైటింగ్ ఫలితంగా ఆ పుట్ ఆప్షన్ ఓఐలో 3.64 లక్షల షేర్లు యూడ్ అయ్యూరుు.
సమీప భవిష్యత్తులో నిఫ్టీ నిరోధ, వుద్దతుస్థారుుల్ని ఈ రైటింగ్ వెల్లడిస్తున్నది. మరోవైపు మెటల్ కౌంటర్లలో వరుసగా రెండోరోజు లాంగ్ బిల్డప్ జరిగింది. హిందాల్కో ఫ్యూచర్ కాంట్రాక్టు ఓఐలో వురో 9.32 లక్షల షేర్లు (4.23 శాతం) యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 2.30 కోట్ల షేర్లకు చేరింది. టాటా స్టీల్ ఫ్యూచర్ ఓఐలో 4.66 లక్షల షేర్లు (2.82 శాతం) యూడ్‌కాగా, మొత్తం ఓఐ 1.70 కోట్ల షేర్లకు పెరిగింది. సేసా గోవా కౌంటర్లో 1.76 లక్షల షేర్లు యూడ్ అయ్యూరుు. మొత్తం ఓఐ 1.58 కోట్ల షేర్లకు పెరిగింది. రానున్న రోజుల్లో షేరు ర్యాలీ జరపవచ్చన్న అంచనాలతో కొనుగోలు చేసే ఫ్యూచర్ కాంట్రాక్టును లాంగ్ పొజిషన్‌గా పరిగణిస్తారు.