ఆ స్మార్ట్‌ఫోన్‌కు 16,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ  | Meet the World's First Phone With 16000mAh Battery | Sakshi
Sakshi News home page

ఆ స్మార్ట్‌ఫోన్‌కు 16,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

Published Tue, Feb 27 2018 2:53 PM | Last Updated on Tue, Feb 27 2018 7:29 PM

Meet the World's First Phone With 16000mAh Battery - Sakshi

ఇప్పటి వరకు వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ ఎంత ఉంటుంది అంటే? ఠక్కున 3000 ఎంఏహెచ్‌ లేదా 4000 ఎంఏహెచ్‌ అని చెప్పేస్తాం. ఈ మధ్యన కంపెనీలు 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో కూడా స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయడం చూస్తున్నాం. షియోమీ తాజాగా లాంచ్‌ చేసిన ఎంఐ మ్యాక్స్2లో 5,300 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌(ఎండబ్ల్యూసీ) 2018లో ఎనర్జైజర్‌ లైసెన్సు బ్రాండు అవెనిర్‌ మొబైల్స్‌ ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ సామర్థ్యం తెలిస్తే నిజంగా షాకవుతారు. ఈ కంపెనీ ఎనర్జైజర్‌  పవర్‌ మ్యాక్స్‌ పీ16కే ప్రొ, ఎనర్జిజెర్‌ పవర్‌ మ్యాక్స్‌ పీ490ఎస్‌, ఎనర్జిజెర్‌ హార్డ్‌కేస్‌ హెచ్‌590ఎస్‌ అనే పేర్లతో మూడు స్మార్ట్‌ఫోన్లను ఎండబ్ల్యూసీ వేదికగా మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. దీనిలో ఎనర్జైజర్‌ పవర్‌ మ్యాక్స్‌ పీ16కే ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు 16000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 16000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో లాంచ్ అయిన ప్రపంచంలో తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే. ఈ ఎలక్ట్రిక్‌ దిగ్గజం తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో త్వరలోనే లాంచ్‌ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఎనర్జైజర్‌ పవర్‌ మ్యాక్స్‌ పీ16కే ప్రొ స్పెషిఫికేషన్లు
ఆం‍డ్రాయిడ్‌ 8.0 ఓరియా
5.99 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
ఆక్టా-కోర్‌ మీడియాటెక్‌ హిలియో పీ25 ఎస్‌ఓసీ
6‍ జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
16 ఎంపీ, 13 ఎంపీతో డ్యూయల్‌ రియర్‌ కెమెరా
13 ఎంపీ, 5 ఎంపీతో డ్యూయల్‌ ఫ్రంట్‌ కెమెరా
 ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
భారీ బ్యాటరీతో ఈ హ్యాండ్‌సెట్‌ బరువు 350 గ్రాములు

ఎనర్జైజర్‌ పవర్‌ మ్యాక్స్‌ పీ490ఎస్‌ స్పెషిఫికేషన్లు
ఆండ్రాయిడ్‌ ఓరియో
4.95 అంగుళాల డిస్‌ప్లే
క్వాడ్‌-కోర్‌ మీడియాటెక్‌ ఎంటీ6739 ఎస్‌ఓసీ
2జీబీ ర్యామ్‌, 16జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌
32 జీబీ వరకే విస్తరణ మెమరీ
8 ఎంపీ, 0.3 ఎంపీతో డ్యూయల్‌ బ్యాక్‌ కెమెరా
5 ఎంపీ, 0.3 ఎంపీతో డ్యూయల్‌ ఫ్రంట్‌ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌

ఎనర్జైజర్‌ హార్డ్‌కేస్‌ హెచ్‌590ఎస్‌ స్పెషిఫికేషన్లు
డ్యూయల్‌ సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌
5.9 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 3
ఆక్టా-కోర్‌ మీడియాటెక్‌ పీ23 ఎస్‌ఓసీ
6జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
256 జీబీ వరకు విస్తరణ మెమరీ
16 ఎంపీ, 0.3 ఎంపీ సెన్సార్‌తో డ్యూయల్‌ బ్యాక్‌ కెమెరా
13 ఎంపీ, 0.3 ఎంపీ సెన్సార్‌తో డ్యూయల్‌ ఫ్రంట్‌ కెమెరా
5800 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement