mwc
-
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024: వీటికే అవార్డ్స్..
ఫిబ్రవరి 26 నుంచి బార్సిలోనాలో ప్రారంభమైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024' (MWC 2024)లో అనేక కొత్త ఉత్పత్తులు కనిపించాయి. ఇందులో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్స్ వంటివి ఉన్నాయి. ఎండబ్ల్యుసీ 2024 వేదికపై కొన్ని ఉత్పత్తులు ఆండ్రాయిడ్ అథారిటీ బెస్ట్ ఆఫ్ MWC 2024 అవార్డులు గెలుచుకున్నాయి. ఆండ్రాయిడ్ అథారిటీ బెస్ట్ ఆఫ్ MWC 2024 అవార్డులు గెలుచుకున్న ఉత్పత్తులు షియోమీ 14 అల్ట్రా లెనోవా ట్రాన్స్పరెంట్ ల్యాప్‌టాప్ హానర్ మ్యాజిక్ 6 ప్రో శామ్సంగ్ గెలాక్సీ రింగ్ ZTE నుబియా ప్యాడ్ 3D 2 హానర్ మ్యాజిక్‌బుక్ ప్రో 16 టెక్నో పోలార్ఏస్ అండ్ కెమోన్ 30 ప్రీమియర్ పాయింట్ ఎంసీ02 నథింగ్ ఫోన్ 2ఏ ఒప్పో ఎయిర్ గ్లాస్ 3 వన్‌ప్లస్ వాచ్ 2 మోటోరోలా స్మార్ట్ కనెక్ట్ నుబియా ఫ్లిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్80 / ఫాస్ట్ కనెక్ట్ 7900 హానర్ ఐ-ట్రాకింగ్ టెక్ -
మొబైల్స్‌కూ కరోనా కష్టాలు..!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ .. దేశీ స్మార్ట్‌ఫోన్స్ పరిశ్రమను కూడా కలవరపెడుతోంది. పరికరాలు, సబ్–అసెంబ్లీస్ కోసం చైనాపై ఆధారపడిన దేశీ కంపెనీలకు .. సరఫరాపరమైన సమస్యలతో క్రమంగా సెగ తగులుతోంది. చైనాలో మూతబడిన ఫ్యాక్టరీలు మళ్లీ తెరుచుకుని, ఈ వారంలోనైనా ఉత్పత్తుల సరఫరా ప్రారంభమవుతుందేమోనని స్మార్ట్‌ఫోన్ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ‘దేశీ పరిశ్రమపై కరోనా వైరస్ ప్రభావం ఉంది. కొన్ని ఉత్పత్తులు, మోడల్స్‌పై ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, కొన్ని ఫ్యాక్టరీలు దశలవారీగా మళ్లీ ఉత్పత్తి ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభావ తీవ్రతపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం సాధ్యపడదు‘ అని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మహింద్రూ తెలిపారు. దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు నిరాకరించిన మహింద్రూ.. దేశీ పరిశ్రమ ఈ వారమంతా వేచి, చూడాలని భావిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు, దేశీ స్మార్ట్‌ఫోన్ సంస్థలకు అవసరమైన కీలక పరికరాలన్నీ చైనా నుంచే రావాల్సి ఉన్నందున.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అస్సలు బాగాలేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక డిమాండ్ లేక మార్కెట్లో మందగమనం పరిశ్రమను మరింత కలవరపెడుతోందని పేర్కొన్నాయి. కాగా, సరఫరాపరమైన సమస్యలకు సంబంధించి ప్రస్తుతానికైతే భారత్‌లో స్టాక్స్, ఉత్పత్తిపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ లేదని స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ రియల్మీ తెలిపింది. మరోవైపు, ఓ భారీ స్థాయి కాంట్రాక్ట్ తయారీ సంస్థ చైనాలోని ఒక ప్లాంటులో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. కొద్ది సిబ్బందితో పనులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కరోనా వైరస్ బారిన పడి చైనాలో మరణించిన వారి సంఖ్య వెయ్యి దాటిపోయింది. చైనా వెలుపల ఇతర దేశాల్లో 350 పైగా కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో కూడా ఇద్దరు మృత్యువాత పడ్డారు. మధ్యకాలికంగా సరఫరా ఇక్కట్లు: ఇండ్–రా కరోనా వైరస్ కారణంగా మధ్యకాలికంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదముందని రేటింగ్ ఏజెన్సీ ఇండ్–రా తెలిపింది. అయితే, వైరస్ ఒకవేళ హుబె ప్రావిన్స్‌కే పరిమితమైతే.. సమీప కాలంలో భారతీయ సంస్థలపై పెద్దగా ప్రతికూల ప్రభావం పడకపోవచ్చని తెలిపింది. కానీ, ‘కరోనా తీవ్రత మరో మూడు 4 నెలలు కొనసాగిందంటే మాత్రం ఫార్మా, టెక్స్టైల్స్, వాహన సంస్థలకు కీలకమైన ముడి వస్తువుల సరఫరాపరమైన సమస్యలు రావొచ్చు. ఇది 2003లో వచ్చిన సార్స్ ప్రభావాల కన్నా ఎక్కువగా ఉండొచ్చు‘ అని ఇండ్–రా వివరించింది. మొబైల్ కాంగ్రెస్‌కు దిగ్గజాలు దూరం.. కరోనా వైరస్ (ఎన్సీపీ) ప్రబలుతున్న నేపథ్యంలో త్వరలో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2020కి (ఎండబ్ల్యూసీ) దూరంగా ఉండాలని భావిస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా చైనాకు చెందిన హ్యాండ్సెట్ సంస్థ వివో, చిప్సెట్ సంస్థ ఇంటెల్‌తో పాటు పలు గ్లోబల్ బ్రాండ్స్ .. ఇందులో పాల్గొనడం లేదని ప్రకటించాయి. తమ ఉద్యోగులు, ఇతరత్రా ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివో ఒక ప్రకటనలో తెలిపింది. జీఎస్ఎం అసోసియేషన్ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలు అభినందనీయమైనప్పటికీ ఎండబ్ల్యూసీకి దూరంగా ఉండటమే శ్రేయస్కరమని తాము భావిస్తున్నట్లు సాఫ్ట్వేర్ సేవలందించే యామ్‌డాక్స్ పేర్కొంది. అయితే, పరిస్థితులను బట్టి షెడ్యూల్ ప్రకారమే ఎండబ్ల్యూసీలో పాల్గొంటామని వివో అనుబంధ సంస్థ ఒపో వెల్లడించింది. ఎరిక్సన్, అమెజాన్, సోనీ వంటి దిగ్గజాలు ఇప్పటికే ఎండబ్ల్యూసీలో పాల్గొనటం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారమే కాంగ్రెస్... ఫిబ్రవరి 24–27 తేదీల మధ్య స్పెయిన్‌లోని బార్సెలోనాలో మొబైల్ కాంగ్రెస్ జరగనుంది. అయితే, కరోనా వైరస్ భయాల కారణంగా చైనా నుంచి రావాల్సిన 5,000–6,000 మంది దాకా డెలిగేట్లు హాజరు కాలేకపోతున్నారని మొబైల్ కాంగ్రెస్ నిర్వహించే జీఎస్ఎం అసోసియేషన్ వెల్లడించింది. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని, షెడ్యూల్ ప్రకారమే ఎండబ్ల్యూసీని నిర్వహించనున్నట్లు పేర్కొంది. -
ఆ స్మార్ట్‌ఫోన్‌కు 16,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇప్పటి వరకు వచ్చిన స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ ఎంత ఉంటుంది అంటే? ఠక్కున 3000 ఎంఏహెచ్ లేదా 4000 ఎంఏహెచ్ అని చెప్పేస్తాం. ఈ మధ్యన కంపెనీలు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో కూడా స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయడం చూస్తున్నాం. షియోమీ తాజాగా లాంచ్ చేసిన ఎంఐ మ్యాక్స్2లో 5,300 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూసీ) 2018లో ఎనర్జైజర్ లైసెన్సు బ్రాండు అవెనిర్ మొబైల్స్ ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ సామర్థ్యం తెలిస్తే నిజంగా షాకవుతారు. ఈ కంపెనీ ఎనర్జైజర్ పవర్ మ్యాక్స్ పీ16కే ప్రొ, ఎనర్జిజెర్ పవర్ మ్యాక్స్ పీ490ఎస్, ఎనర్జిజెర్ హార్డ్కేస్ హెచ్590ఎస్ అనే పేర్లతో మూడు స్మార్ట్ఫోన్లను ఎండబ్ల్యూసీ వేదికగా మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీనిలో ఎనర్జైజర్ పవర్ మ్యాక్స్ పీ16కే ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు 16000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 16000 ఎంఏహెచ్ సామర్థ్యంతో లాంచ్ అయిన ప్రపంచంలో తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ ఎలక్ట్రిక్ దిగ్గజం తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఎనర్జైజర్ పవర్ మ్యాక్స్ పీ16కే ప్రొ స్పెషిఫికేషన్లు ఆండ్రాయిడ్ 8.0 ఓరియా 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ హిలియో పీ25 ఎస్ఓసీ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 16 ఎంపీ, 13 ఎంపీతో డ్యూయల్ రియర్ కెమెరా 13 ఎంపీ, 5 ఎంపీతో డ్యూయల్ ఫ్రంట్ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ భారీ బ్యాటరీతో ఈ హ్యాండ్సెట్ బరువు 350 గ్రాములు ఎనర్జైజర్ పవర్ మ్యాక్స్ పీ490ఎస్ స్పెషిఫికేషన్లు ఆండ్రాయిడ్ ఓరియో 4.95 అంగుళాల డిస్ప్లే క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6739 ఎస్ఓసీ 2జీబీ ర్యామ్, 16జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ 32 జీబీ వరకే విస్తరణ మెమరీ 8 ఎంపీ, 0.3 ఎంపీతో డ్యూయల్ బ్యాక్ కెమెరా 5 ఎంపీ, 0.3 ఎంపీతో డ్యూయల్ ఫ్రంట్ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఎనర్జైజర్ హార్డ్కేస్ హెచ్590ఎస్ స్పెషిఫికేషన్లు డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ 5.9 అంగుళాల ఫుల్-హెచ్డీ ప్లస్ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 3 ఆక్టా-కోర్ మీడియాటెక్ పీ23 ఎస్ఓసీ 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 16 ఎంపీ, 0.3 ఎంపీ సెన్సార్‌తో డ్యూయల్ బ్యాక్ కెమెరా 13 ఎంపీ, 0.3 ఎంపీ సెన్సార్‌తో డ్యూయల్ ఫ్రంట్ కెమెరా 5800 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ -
నోకియా నుంచి కొత్తగా ఐదు ఫోన్లు
బార్సిలోనా : నోకియా బ్రాండు స్మార్ట్‌ఫోన్ తయారు చేసి, మార్కెట్లోకి విడుదల చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తోంది. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018(ఎండబ్ల్యూసీ) వేదికగా కొత్తగా ఐదు డివైజ్‌లను హెచ్ఎండీ గ్లోబల్ ఆవిష్కరించింది. అవి నోకియా 8 సిరొక్కో, నోకియా 7 ప్లస్, నోకియా 6(కొత్త వేరియంట్), నోకియా 1, పునరుద్ధరించిన నోకియా 8110. నోకియాకు చెందిన ఐకానిక్ మోడల్ 8110. ఈ మోడల్‌ను ప్రస్తుతం 4జీ కనెక్టివిటీతో పాటు గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి యాప్స్‌తో కంపెనీ ఆవిష్కరించింది. పన్నులు, ఇతర సబ్సిడీలను మినహాయించి నోకియా ఐకానిక్ మోడల్ అయిన 8110 ధరను హెచ్ఎండీ గ్లోబల్ 79 యూరోలుగా నిర్ణయించింది. మే నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రాబోతుంది. ''గతేడాది ఈ రోజుల్లో, అభిమానుల నుంచి మంచి స్పందన రావాలని ఆశిస్తూ మా ప్రయాణాన్ని ప్రారంభించాం. మా స్పేస్‌లో అత్యంత వినూత్నమైన బ్రాండులను డెలివరీ చేస్తున్నాం. గతేడాది 70 మిలియన్లకు పైగా నోకియా ఫోన్లను రవాణా చేశాం'' అని హెచ్ఎండీ గ్లోబల్ సీఈవో ఫ్లోరియాన్ సైచి చెప్పారు. కొత్తగా ఐదు డివైజ్‌ల ఆవిష్కరణతో తమ రేంజ్‌ను విస్తరించుకున్నామని తెలుపడం చాలా గర్వంగా ఉందని, నోకియా 8 సిరొక్కోతో స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో కొత్త బెంచ్‌మార్కు తీసుకొచ్చామని హెచ్ఎండీ గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జూహో సర్వికాస్ అన్నారు. నోకియా 8 సిరొక్కో, నోకియా 7 ప్లస్, కొత్త నోకియా 6లు ఆండ్రాయిడ్ వన్ ఫ్యామిలీలో చేరాయని, గూగుల్ డిజైన్ చేసిన హై క్వాలిటీ సాఫ్ట్వేర్ అనుభవాన్ని వీటిలో తాము అందించినట్టు పేర్కొన్నారు. నోకియా 8 సిరొక్కో స్మార్ట్‌ఫోన్ ధర 749 యూరోలుగా కంపెనీ నిర్ణయించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.60వేలుగా తెలుస్తోంది. కానీ భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉండొచ్చో కంపెనీ వెల్లడించలేదు. ఏప్రిల్ ప్రారంభం నుంచి నోకియా 8 సిరొక్కో స్మార్ట్‌ఫోన్ సేల్ మొదలవుతోంది. 5.5 అంగుళాల క్యూహెచ్డీ పీఓలెడ్ డిస్ప్లే, 3డీ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీ, 6జీబీ ర్యామ్, 128జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 12 ఎంపీ, 13 ఎంపీతో డ్యూయల్ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా దీనిలో ఫీచర్లు. కాగ, కొత్త నోకియా 6 ముందు దాని కంటే 60 శాతం వేగవంతంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 279 యూరోలకు కంపెనీ మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ అయిన నోకియా 1, మృదువుగా డిజైన్ అయింది. గూగుల్ ప్లే స్టోర్ ఫుల్ యాక్సస్‌తో దీన్ని ఆవిష్కరించింది. దీని ధర కూడా అన్ని పన్నులు, సబ్సిడీలు కలుపుకోకపోతే, 85 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. -
సిమ్ కార్డు అవసరం లేని ఫోన్
సిమ్ కార్డు లేకుండా ఫోన్ పనిచేస్తుందా? అంటే, అది అసాధ్యమని చెప్పేస్తాం. లక్ష రూపాయల ఫోన్ అయినా.. అది పనిచేయాలంటే సిమ్ కావాల్సిందే. అయితే సిమ్ కార్డులు అవసరం లేని ఫోన్ కూడా మార్కెట్లోకి రాబోతుందట. ఆర్మ్ టెక్నాలజీ సంస్థ ఈ వినూత్నాన్ని ఆవిష్కరించబోతుంది. మొబైల్ ఫోన్లలో వాడే సిమ్‌కి బదులుగా ఐసిమ్ కార్డుని(ఇంటిగ్రేటెడ్ సిమ్ కార్డును) ఆర్మ్ సంస్థ, ఎండబ్ల్యూసీ 2018లో ప్రదర్శించబోతుంది. ఈ సిమ్ కార్డు, ప్రాసెసర్‌తోనే చిప్‌సెట్‌లో ఇంటిగ్రేటెడ్ పార్ట్‌గా ఉండబోతుంది. ప్రాసెసర్ చిప్సెట్లోనే ఇంటిగ్రేటెడ్ అయ్యే ఐసిమ్ నెంబర్‌ను, ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత ఐసిమ్ నెంబర్ నెట్వర్క్ కంపెనీలకు చెబితే, వాళ్లు దానికి మొబైల్ నెంబర్‌ను అనుసంధానిస్తారు. దీంతో సిమ్ కార్డుకు కేటాయించే అదనపు స్థలం మిగిలిపోతుంది. ఈ కొత్త ఐసిమ్ కార్డు చదరపు మిల్లిమీటర్ కంటే తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది. ఈ విధానం వల్ల ప్రస్తుతం ఉన్న సిమ్ కార్డ్ అవసరం ఉండదు. నెట్వర్క్ కంపెనీలకు కూడా సిమ్ కార్డ్ ఖర్చు తగ్గిపోతుంది. దీనికితోడు ప్రస్తుతం సిమ్ కార్డ్ స్లాట్ కోసం ఉపయోగిస్తున్న స్థలంలో మరికొన్ని ఆప్షన్స్‌తో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటానికి మొబైల్ తయారీ కంపెనీలకు అవకాశం కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ టెక్నాలజీతో మెరుగైన వాయిస్ క్లారిటీ ఉంటుందని ఆర్మ్ టెక్నాలజీ చెబుతోంది. స్మార్ట్‌ఫోన్ తయారీ దారులు, నెట్ వర్క్ సంస్థలు ఆమోదిస్తే, ఏడాది కాలంలోనే ఈ టెక్నాలజీ ఇండియాలోకి అందుబాటులోకి రానుందని సమాచారం. -
మొబైల్ కాంగ్రెస్‌లో మనసు దోచినవి ఇవే
ప్రతి ఏటా దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూసీ)-2017 ముగిసింది. మొత్తం ఐదు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్‌లో పలు అంతర్జాతీయ మొబైల్ బ్రాండ్లు కొత్త మోడళ్లను పరిచయం చేశాయి. వీటిలో కొన్ని మొబైల్ ప్రేమికుల మనసును దోచేశాయి. అవేంటో ఓ లుక్కేద్దాం. బ్లాక్ బెర్రీ ఎండబ్ల్యూసీ కార్యక్రమానికి రెండు రోజుల ముందే బ్లాక్‌బెర్రీ కీ వన్ ఫోన్‌ను విడుదల చేసింది. టచ్ స్క్రీన్‌తో పాటు కీ ప్యాడ్‌ను కోరుకునే మొబైల్ లవర్స్ దీన్ని చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు. టచ్ అండ్ టైప్ మోడల్ ఫోన్లను బ్లాక్ బెర్రీ గతంలో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ధర సుమారు రూ. 40 వేలుగా ఉండొచ్చు. హువాయి ఈ కంపెనీ తన ఫ్లాగ్షిప్ ఫోన్లు హువాయి పీ10, హువాయి పీ10 ప్లస్‌లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు ఎండబ్ల్యూసీలో ప్రకటించింది. డ్యూయల్ కెమెరా, 960 ఆక్టా కోర్ ప్రాసెసర్లు ఈ ఫోన్లో ప్రత్యేకతలు. హువాయి వాచ్ 2.0ను కూడా ప్రకటించింది. క్లాసిక్, స్పోర్ట్స్ రకాల్లో వాచ్ లభ్యమవనుంది. ఎల్జీ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఎల్జీ జీ6 ఫోన్‌ను ఎల్జీ ఎండబ్ల్యూసీలో విడుదల చేసింది. 5.7 ఇంచుల స్క్రీన్, డాల్బీ విజన్ హెచ్డీఆర్, 821 క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ దీని ప్రత్యేకతలు. ఈ ఫోన్ ధర, అందుబాటులోకి వచ్చే తేదీలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మోటోరోలా గత మూడేళ్లుగా మోటో వెర్షన్లతో మార్కెట్లోకి దూసుకొచ్చిన మోటోరోలా(లెనోవో).. తాజాగా మోటో జీ5, మోటో జీ5 ప్లస్‌లను ఎండబ్ల్యూసీలో విడుదల చేసింది. 3 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 430 ప్రాసెసర్ తదితరాలు. ధర సుమారుగా రూ.17,500/-. ఇండియాలో మే నెల నుంచి అందుబాటులోకి రానుంది. నోకియా గతంలో మొబైల్ సామ్రాజ్యాన్ని ఏలిన నోకియా 2017 ఎండబ్ల్యూసీలో పునఃప్రవేశం చేసింది. నోకియా 3310 పాత ఫోన్‌ను కొత్త రూపుతో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు సోషల్‌మీడియాలో విపరీతంగా క్రేజ్ వచ్చింది. చాలామంది ఎప్పుడెప్పుడూ ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. నోకియా 6, నోకియా 5 మొబైల్స్‌ను కూడా నోకియా ప్రకటించింది. జూన్ లోపు ఇవన్నీ భారత మార్కెట్లోకి వస్తాయి. శాంసంగ్ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్3ను విడుదల చేసింది. దీంతోపాటు ఎస్ పెన్ను కూడా ప్రకటించింది. సోనీ ఈ కంపెనీ తన ఫ్లాగ్షిప్ ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్ ప్రీమియం ఫోన్‌ను ఎండబ్ల్యూసీలో ప్రకటించింది. 4కే హెచ్డీఆర్, 19 మెగాపిక్సల్ మోషన్ ఐ కెమెరా, క్వాల్కామ్ 835 స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్‌లతో ఈ ఫోన్ లభించనుంది. సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ ఏ1, ఎక్స్ ఏ1 ఆల్ట్రా(మిడ్ రేంజ్ ఫోన్లు)ను విడుదల చేసింది. -
ఈ ఫోన్‌తో ల్యాపీ, డెస్క్‌టాప్ మీ దగ్గరున్నట్టే!
ప్రఖ్యాత ఐటీ కంపెనీ హెచ్‌పీ తన లేటెస్ట్ ప్రాడక్ట్‌తో వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తన ఫ్లాగ్షిప్ మోడలైన హెచ్‌పీ 'ఎలైట్ ఎక్స్3' స్మార్ట్‌ఫోన్‌ను ఎండబ్ల్యూసీలో ఆవిష్కరించింది. విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టంతోపాటు మైక్రోసాఫ్ట్ ఫీచర్స్ అన్ని ఇందులో పనిచేయనుండటం గమనార్హం. ఈ స్మార్ట్‌ఫోన్ ఆల్మోస్ట్ కంప్యూటర్‌లానే వ్యవహరిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇందులోని ఫీచర్స్ ఆధారంగా దీనిని ల్యాప్‌టాప్‌గానూ, డెస్క్‌టాప్‌గానూ వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్న రెండోస్మార్ట్ ఫోన్ ఎలైట్ ఎక్స్3. గతంలోనూ హెచ్‌పీ ఇలాంటి మోడల్‌ను విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ సంస్థ భాగస్వామ్యంతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆరు అంగుళాల తాకే తెర (టచ్ స్క్రీన్) ఉంటుంది. విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో విండోస్ 10 'కంటిన్యూమ్' ఫీచర్ స్పెషల్ అట్రాక్షన్. దీనిద్వారా ఎలైట్ ఎక్స్3ని డెస్క్‌టాప్‌గానూ, ల్యాప్‌టాప్‌గానూ వాడుకోవచ్చు. ఎలైట్ ఎక్స్3 లోని ఫీచర్స్ డిస్ప్లే: 5.96-అంగుళాలు, గొరిల్లా గ్లాస్-4 ప్రొటెక్షన్‌తో వస్తుంది ప్రాసెసర్: Qualcomm Snapdragon 820 ర్యామ్: 4జీబీ ఇన్‌బిల్ట్ స్టోరెజ్: 64 జీబీ అదనపు స్టోరేజ్ కోసం మైక్రో ఎస్డీ కార్డ్ సౌలభ్యం బ్యాక్ కెమెరా: 15 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా: 8 మెగాపిక్సెల్ బ్యాటరీ: 4150 mAh