బ్యాంక్ షేర్లను భారీగా కొంటున్న ఫండ్స్ | MFs exposure to bank stocks hits record high of Rs. 94000 cr | Sakshi
Sakshi News home page

బ్యాంక్ షేర్లను భారీగా కొంటున్న ఫండ్స్

Published Tue, Aug 9 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

బ్యాంక్ షేర్లను భారీగా కొంటున్న ఫండ్స్

బ్యాంక్ షేర్లను భారీగా కొంటున్న ఫండ్స్

మొండి బకాయిల ప్రక్షాళనకు ఆర్‌బీఐ, ప్రభుత్వం చర్యలు   
దీంతో బ్యాంక్ షేర్లవైపు మొగ్గుతున్న ఫండ్ మేనేజర్లు

 న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ సంస్థలు బ్యాంక్ షేర్లలో జోరుగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థల బ్యాంక్ షేర్ల పెట్టుబడులు రికార్డ్ స్థాయికి, రూ.94,000 కోట్లకు పెరిగాయని వెల్త్‌ఫోర్స్‌డాట్‌కామ్ పేర్కొంది. మొండి బకాయిల ప్రక్షాళనకు ప్రభుత్వం, ఆర్‌బీఐలు గట్టి ప్రయత్నాలు చేస్తుండటమే దీనికి కారణమని  ఈ సంస్థ వ్యవస్థాపకులు సిద్ధాంత్ జైన్ పేర్కొన్నారు.  ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు అందిస్తుండడం కూడా మరో కారణమని వివరించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఫండ్ మేనేజర్లు బ్యాంక్ షేర్ల కొనుగోళ్లకు కేటాయింపులు పెంచుతున్నారని పేర్కొన్నారు.  గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ మొండి బకాయిల సమస్యతోనే బ్యాంక్ షేర్లను ఫండ్స్ తగ్గించుకున్నాయన్నారు. సెబీ గణాంకాల ప్రకారం., మేలో మ్యూచువల్ ఫండ్ ఏయూఎమ్‌ల్లో 20.28 శాతంగా ఉన్న బ్యాంక్ షేర్లు జూన్ నాటికి 20.4 శాతానికి పెరిగాయని జైన్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement