సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌కు చెందిన వాహన తయారీ సంస్థ ఎంజీ (మోరిస్ గ్యారేజ్) మోటార్ మరో ఘనతను సాధించింది. దేశీయ మార్కెట్లో తొలి ఇంటర్నెట్ కారైన 'హెక్టార్'పై ఇంకా ఉత్కంఠ ఇంకా కొనసాగుతుండగానే మరో కీలక ప్రకటన చేసింది. తన తొలి గ్లోబల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేయబోతున్నామని ప్రకటించింది. ఎంజీ ఈ-జెస్‌ఎస్ పేరుతో పూర్తి ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది డిసెంబరు నాటికి దీన్ని ప్రారంభించనున్నట్టు ఎంజీ బుధవారం ప్రకటించింది. దీంతోపాటు యూకే జర్మనీ, ఆస్ట్రేలియా, థాయిలాండ్, మధ్య ప్రాచ్య దేశాల మార్కెట్లలో త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొంది.
భారతదేశంలో పర్యావరణ అనుకూలంగా జీరో ఎమిషన్స్‌తో పాటు ఆధునిక డిజైన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో తమ తాజా ఎస్‌యూవీ ఎంజీ ఈజెడ్‌ఎస్‌ను రూపొందించామని కంపెనీ తెలిపింది. దీని ఫీచర్స్, ధర తదితర మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నామని ఎంజీ మోటర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా చెప్పారు.
కాగా తన ఎస్‌యూవీ హెక్టార్ వచ్చే జూన్‌లో తన విడుదల చేయబోతున్నట్లు సంస్థ ప్రకటించింది.భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఐస్మార్ట్ టెక్నాలజీతో ఈ కారును రూపొందించడానికి అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, అడోబ్, సాప్‌లతో జతకట్టింది. స్మార్ట్‌ఫీచర్లతో వస్తున్న తొలి ఇంటర్నెట్ ఎస్‌యూవీ హెక్టార్‌లో ఇన్‌బిల్ట్‌గా 5జీ స్మార్ట్ సిమ్‌ను అందిస్తోంది. బటన్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ సహాకారంతో ‘హలో ఎంజీ’ అంటూ కారు రూఫ్, తలుపులు తెరవమని ఆదేశించవచ్చు. అలాగే వచ్చే రెండేండ్లలో నాలుగు నూతన కార్లతోపాటు హైబ్రిడ్, విద్యుత్‌తో నడిచే వాహనాన్ని సైతం విడుదల చేయబోతున్నట్లు ఎండీ రాజీవ్ చాబా పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment